ఫండ్స్? పీఎమ్ఎస్ ? దేనిని ఎంచుకోవాలి ?
By Sakshi

(ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) ప్ర: నేను గత కొంత కాలం నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లోనూ, నేరుగా షేర్లలోనూ ఇన్వెస్ట్ చేస్తున్నాను. అయితే షేర్లలో నేరుగా ఇన్వెస్ట్ చేయడం కంటే మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయడం మంచిదని నాకనిపిస్తోంది. షేర్లలో నా ఇన్వెస్ట్మెంట్స్ రూ.35 లక్షలకు పెరిగాయి. వీటిని మెల్లగా మ్యూచువల్ ఫండ్స్‌లోకి మళ్లించమంటారా లేక పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్(పీఎమ్ఎస్)కి అప్పగించమంటారా ? ప్ర: నా పోర్ట్‌ఫోలియోలో డెట్ ఫండ్స్ ఎన్ని ఉండాలి ? డెట్, ఈక్విటీ ఫండ్స్ రెండూ వేర్వేరు మ్యూచువల్ ఫండ్ సంస్థలకు చెందినవి అయితే మంచిది కదా ?
-కార్తీక్, బెంగళూరు
జ: షేర్లలోని మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మ్యూచువల్ ఫండ్స్‌లోకి మళ్లించడమే మంచిదని నా సూచన. పీఎమ్ఎస్తో పోల్చితే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. మీరు పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్(పీఎమ్ఎస్) ద్వారా ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఒక ఏడాది కాలంలో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీకు వచ్చిన స్వల్పకాలిక లాభాలపై మీరు 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పీఎమ్ఎస్ విధానంలో మీ తరపున పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని (పవర్ ఆఫ్ అటార్నీ) ఎవరైనా ఒక వ్యక్తికి అప్పగించాల్సి ఉంటుంది. ఈ వ్యక్తి నిర్వహించే ప్రతి లావాదేవీ మీరు నిర్వహించిన లావాదేవీగానే పరిగణిస్తారు. ఇక మ్యూచువల్ ఫండ్స్ విషయానికొస్తే, మీరు పెట్టుబడిని మ్యూచువల్ ఫండ్ మేనేజర్‌కు ఇస్తారు. ఫండ్ మదుపు వ్యూహంలో భాగంగా సదరు ఫండ్ మేనేజర్ షేర్ల విక్రయాలు జరిపితే, ఆయన గానీ, మీరు గానీ ఎలాంటి మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పనిలేదు. మీరు మీ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను విక్రయిస్తేనే, మీరు మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మరో రెండు ప్రయోజనాలు లభిస్తాయి. పీఎమ్ఎస్తో పోల్చితే ఫండ్స్‌లో పారదర్శకత మెరుగ్గా ఉంటుంది. నియంత్రణ పటిష్టంగా ఉంటుంది. ఫండ్ మేనేజర్లు తమ ఫండ్ పోర్ట్‌ఫోలియోను, ఎన్ఏవీ తదితర వివరాలను ప్రతి నెలా ఖచ్చితంగా వెల్లడించాల్సి ఉంటుంది. పనితీరు సరిగ్గా లేకపోతే, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటారనే భయంతో ఫండ్ మేనేజర్లు ఎప్పటికప్పుడు మెరుగైన పనితీరు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఒక వేళ ఏదైనా పొరపాటు దొర్లితే, సెబీ కాచుకుని కూర్చుంటుంది. పీఎమ్ఎస్లో ఈ ప్రయోజనాలు ఉండవు.
ప్ర: నేను ఒక స్థాయి వరకూ రిస్క్‌ను భరించగలను. నెలకు రూ.50,000 చొప్పున ఏడు నుంచి ఎనిమిదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నేను ఇన్వెస్ట్ చేయడానికి ఏ ఫండ్స్‌ను ఎంచుకోవాలి? లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్.. ఏ రకమైన ఫండ్స్‌ను ఎంచుకుంటే మంచిది ?
-వంశీ, విజయవాడ
జ: లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్.. ఏ రకమైన ఫండ్స్‌ను ఇప్పుడు మీరు ఎంచుకోవద్దు. మీరు ఒకింత రిస్క్‌ను భరించగలను అంటున్నారు. మరోవైపు మీకు మ్యూచువల్ ఫండ్స్ కూడా కొత్త. అందుకని మీరు ముందుగా బ్యాలన్స్డ్ ఫండ్‌ను ఎంచుకోండి. ఈ ఫండ్స్ తమ నిధుల్లో 75 శాతం ఈక్విటీల్లోనూ, 25 శాతం డెట్‌లోనూ ఇన్వెస్ట్ చేస్తాయి. కాబట్టి మార్కెట్ పతనమైనా, ఆ ప్రభావం ఈ ఫండ్స్‌పై పెద్దగా ఉండదు. కనీసం రెండు నుంచి మూడేళ్ల పాటు బ్యాలన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. మూడేళ్ల తర్వాత మల్టీ క్యాప్ ఫండ్‌లో గానీ, వేల్యూ ఫండ్‌లో గానీ ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి. ఎనిమిదేళ్ల తర్వాత మీరు ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే అధికమైన రాబడులనే పొందగలరు.
-పల్లవి, హైదరాబాద్
జ: వేర్వేరు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు చెందిన డెట్, ఈక్విటీ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదే. ఈక్విటీ ఫండ్స్ విషయానికొస్తే, కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీకి చెందిన మల్టీ-క్యాప్, లేదా వేల్యూ ఫండ్స్‌నే పరిగణించాలి. మల్టీక్యాప్, వేల్యూ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు లభిస్తాయి. అదే డెట్ ఫండ్స్ విషయానికొస్తే, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు వేర్వేరుగా అంటే వేర్వేరు మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలకు చెందిన డెట్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. ఒక్కోసారి డెట్ ఫండ్స్‌కు సంబంధించి విపరీత పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. డెట్ ఫండ్స్ ఇచ్చే రాబడులనే కీలకంగా పరిగణించి వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన విధానం కాదు. గతంలో సాధించిన రాబడులనే డెట్ ఫండ్లు భవిష్యత్తులో కూడా ఆర్జిస్తాయన్న గ్యారంటీ ఏమీ లేదు. ఇక ఈక్విటీ ఫండ్స్ విషయానికొస్తే, ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాలం పాటు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే, మంచి రాబడులు పొందవచ్చు. డెట్ ఫండ్స్‌ల్లో ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. డీహెచ్ఎఫ్ఎల్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కంపెనీలు చెల్లింపుల్లో విఫలం కావడం వల్ల కొన్ని మ్యూచువల్ ఫండ్స్ రాబడులు 7 నుంచి 8 శాతం మేర పతనమయ్యాయి. వేర్వేరు మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు చెందిన రెండు, మూడు ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇలాంటి రిస్క్‌ను కొంచెం తగ్గించుకోవచ్చు.
You may be interested
ఈ వారం రికమెండేషన్లు
Monday 29th July 2019ఎల్ అండ్ టీ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.1,392 టార్గెట్ ధర:రూ.1,790 ఎందుకంటే:- ఇంజినీరింగ్ దిగ్గజం, ఎల్ అండ్ టీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఎన్నికల కారణంగా దేశీయ ఇంజినీరింగ్, కన్స్ట్రక్షన్ విభాగం ఆదాయం అంతంతమాత్రంగానే ఉండగలదన్న అంచనాలున్నాయి. అయితే ప్రాజెక్ట్‌ల అమలు జోరు కారణంగా ఈ విభాగం ఆదాయం 18 శాతం పెరిగింది. కంపెనీ కన్సాలిడేడెట్ ఆదాయం 10
సెన్సెక్స్ కీలక అవరోధం 38,340
Monday 29th July 2019అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ వారంలో జరపనున్న విధాన సమీక్షలో వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు నెలకొన్నప్పటికీ, అమెరికా మార్కెట్ మినహా ఇతర ప్రధాన దేశాల సూచీల్లో జోష్ కన్పించడం లేదు. ఫెడ్ రేటు తగ్గింపుకంటే ట్రేడ్‌వార్స్, వినియోగ డిమాండ్ తగ్గడం తదితర అంశాలతో యూరప్, ఆసియా మార్కెట్లు సతమతమవుతుండగా, ఇందుకు తోడు కొన్ని బడ్జెట్ ప్రతిపాదనలు నొప్పించడంతో మన మార్కెట్లో క్షీణత అధికంగా వుంది. వరుసగా