News


చిన్న స్టాకుల్లో వాటాలు పెంచుకున్న ఎంఎఫ్‌లు!

Monday 30th December 2019
personal-finance_main1577689107.png-30528

2020లో పరుగులు తీస్తాయన్న అంచనాలు
ఈ సంవత్సరం చాలా మంది మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు చిన్నస్టాకులపై మక్కువ చూపారు. దాదాపు 100కుపైగా చిన్న కంపెనీల్లో ఎంఎఫ్‌లు 2019లో వాటాలు పెంచుకున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే వీటిలో చాలా వరకు స్టాకులు ఈ సంవత్సరం నెగిటివ్‌ రాబడులే ఇచ్చాయి. మార్కెట్లో లార్జ్‌క్యాప్స్‌ హవా కొనసాగుతున్నందున చిన్నస్టాకుల ర్యాలీ ఇంకా మొదలవ్వలేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. క్రమంగా స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌ పరుగులు ఆరంభమవుతాయని అంచనా వేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే ఫండ్‌ మేనేజర్లు గత మూడు త్రైమాసికాలుగా 108 చిన్న కంపెనీల్లో వాటాలు పెంచుకున్నారు. ఇలా ఫండ్‌ మేనేజర్ల మక్కువ చూరగొన్న స్టాకుల్లో గార్డెన్‌ రీచ్‌, గుజరాత్‌ గ్యాస్‌, దీపక్‌ నైట్రేట్‌, టిమ్‌కెన్‌ ఇండియా, ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌ తదితరాలున్నాయి. వీటిలో 22 కంపెనీలు ఈ ఏడాది దాదాపు 10- 122 శాతం ర్యాలీ చేశాయి. 71 కంపెనీలు నెగిటివ్‌ రాబడులు ఇచ్చాయి. ఇలా నెగిటివ్‌రాబడులు ఇచ్చిన వాటిలో సీసీడీ, ఐజీ పెట్రో, తేజాస్‌ నెట్‌వర్క్‌, ఎన్‌ఆర్‌బీ బేరింగ్‌, చెన్నై పెట్రో తదితరాలున్నాయి. 


కొత్త ఏడాది స్మాల్‌క్యాప్స్‌దే..
ఇప్పటివరకు వచ్చిన పతనంతో పలు స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాకుల వాల్యూషన్లు ఆకర్షణీయంగా మారాయని, 2020లో ఇవే పరుగుపందెంలో ముందుంటాయని ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఎండీ డీకే అగర్వాల్‌ అంచనా వేశారు. అయితే ఇందుకు ఎకానమీలో కొంత రికవరీ కనిపించాల్సి ఉందన్నారు. నాణ్యమైన అనేక చిన్నస్టాకుల్లోకి పెట్టుబడుల ప్రవాహం పెరిగిందని, , ఫండ్‌మేనేజర్లు వీటిపై మక్కువ చూపుతున్నారని తెలిపారు. బడ్జెట్‌కుముందు సాధారణంగా చిన్న స్టాకుల్లో ర్యాలీలు ఉంటాయని, అందువల్ల ప్రస్తుతం ఎలాంటి కరెక‌్షన్‌ కనిపించినా నాణ్యమైన చిన్న స్టాకులను కొనుగోలు చేసేందుకు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే ఈ దిశగా సంకేతాలు కనిపిస్తున్నాయని కేఐఎఫ్‌ఎస్‌ ట్రేడ్‌ క్యాపిటల్‌ సీఎస్‌ఓ రితేశ్‌ చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో చిన్నషేర్లలో నాణ్యతను చూసి ఎంచుకోవాలని సూచించారు. You may be interested

2019: చౌక వడ్డీ రేట్ల ఏడాది

Monday 30th December 2019

2019లో కేంద్ర బ్యాంకుల రేట్ల తగ్గింపు బాట యూటర్న్‌ తీసుకున్న అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ 6 సమీక్షలలో ఆర్‌బీఐ ఐదుసార్లు రెపో కోత ఈ కేలండర్‌ ఏడాదిని(2019) చౌక వడ్డీ రేట్ల సంవత్సరంగా పిలవవచ్చునంటున్నారు పలువురు ఆర్థికవేత్తలు. 2008లో ప్రపంచ దేశాలను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం తరువాత వరుసగా 9 సార్లు వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చిన ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ ఏడాది జూన్‌లో తొలిసారి రేట్ల తగ్గింపువైపు దృష్టిసారించింది. వెరసి రేట్ల కోతకు

నష్టాల్లో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు

Monday 30th December 2019

మార్కెట్‌ ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు సోమవారం​ఉదయం సెషన్‌లో అమ్మకాల ఒత్తిడిలోనయ్యాయి. ఆర్‌బీఐ చేపట్టిన ఆపరేషన్‌ ట్విస్ట్‌ ప్రక్రియతో పాటు నిన్నటి వారంలో శనివారం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ బ్యాంకు అధికారులతో చర్చలు బ్యాంకింగ్‌ రంగ షేర్లపై ఎలాంటి సానుకూల ప్రభావాన్ని చూపలేకపోయాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 1.25శాతం నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 2,569.95 వద్ద

Most from this category