News


డెట్‌ ఫండ్స్‌లోనూ ఈక్విటీల మాదిరి రిస్క్‌

Friday 28th February 2020
personal-finance_main1582829752.png-32149

డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్న వారు ఇక మీదట అయినా ఎంతో జాగ్రత్తగా అడుగులు వేయాలని ఇటీవలి పరిణామాలు సూచిస్తున్నాయి. ఇటీవలి క్రెడిట్‌ సంక్షోభం మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు, ఇన్వెస్టర్లు, డిస్ట్రిబ్యూటర్లు లేదా క్రెడిట్‌ ఏజెన్సీలకు ఒక పాఠం వంటిదని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

 

‘‘గడిచిన 18 నెలల్లో చాలా వరకు రుణ ఎగవేతలు వ్యాపారణ కారణాల వల్ల కాకుండా పాలనా నిర్వహణ కారణాలతో జరగడాన్ని చూశాం. మ్యూచువల్‌ ఫండ్స్‌ వీటిని అర్థం చేసుకుని సంబంధిత రిస్క్‌ పట్ల జాగ్రత్త వహించాలి. డెట్‌ రిస్క్‌ కూడా ఈక్విటీల రిస్క్‌ మాదిరే తయారైంది. కనుక పరిశ్రమ మళ్లీ మూలాల్లోకి వెళ్లాలి. వ్యాపార నమూనా, యాజమాన్యం, నగదు ప్రవాహాలను చూడాల్సి ఉంది. రిస్క్‌ ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు’’ అని ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ, సీఈవో అశ్వని భాటియా సీఐఐ నిర్వహించిన మ్యూచువల్‌ ఫండ్స్‌ సదస్సులో తెలిపారు. 2018 సెప్టెంబర్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంస్థలో తలెత్తిన సంక్షోభం క్రెడిట్‌ మార్కెట్‌, ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభానికి దారితీసిన విషయం తెలిసిందే. ఇది దేశ ఆర్థిక వృద్ధి క్షీణతకు కూడా దారితీసింది. డెట్‌ పెట్టుబడులు సురక్షితమని భావించే వారిని అయోమయంలో పడేసింది ఈ సంక్షోభం. మార్కెట్లో తలెత్తిన సంక్షోభం డెట్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేసిన మ్యూచువల్‌ ఫండ్స్‌ రాబడులపై తీవ్ర ప్రభావం చూపించింది. 

 

ఎవరికి ఏ పథకాలను అందించాలి? అనే విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ సీఈవో ఎండీ విజయ్‌ చందోక్‌ ఫండ్స్‌ పథకాల పంపిణీ దారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. క్రెడిట్‌ రిస్క్‌ తీసుకుంటున్నామంటే, అది రిస్క్‌ లేకుండా వస్తుందని తాము భావించకూడదని ఐడీఎఫ్‌సీ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ సీఈవో విషాల్‌ కపూర్‌ అన్నారు. టాప్‌ రేటింగ్‌ డెట్‌ పేపర్‌ అయినా కానీ, క్రెడిట్‌ డిఫాల్ట్‌ రిస్క్‌ (డెట్‌ ఇనుస్ట్రుమెంట్ల చెల్లింపుల్లో కంపెనీలు విఫలం కావడం) గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘రిటైల్‌ ఇన్వెస్టర్‌ గతంలో చూడని వాటిని కూడా ఇప్పుడు చూస్తున్నారు. పెట్టుబడిని కూడా హరించేంత క్రెడిట్‌ రిస్క్‌ ఉంటుందని ఎవరూ ఊహించడం లేదు’’ అని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపు ఎండీ మయాంక్‌ఝా అన్నారు. గడిచిన 12-18 నెలల కాలంలో చూసినది భవిష్యత్తులో పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని కోటక్‌ మహీంద్రా అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ సీఐవో లక్ష్మీ అయ్యర్‌ పేర్కొన్నారు. You may be interested

క్రెడిట్‌ స్కోరును గుడ్డిగా అనుసరించొద్దు : కేంద్ర ఆర్థిక మంత్రి

Friday 28th February 2020

శాఖల స్థాయిలో అనుసంధానత పెంచుకోవాలి బ్యాంకులకు ఆర్థిక మంత్రి సీతారామన్‌ సూచన న్యూఢిల్లీ/గువహటి: రుణ గ్రహీతలకు సంబంధించి క్రెడిట్‌ స్కోరు (రుణ చెల్లింపుల చరిత్ర)ను గుడ్డిగా నమ్మవద్దని, కేవలం ఓ సూచికగానే పరిగణించాలని ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. కస్టమర్లతో శాఖల స్థాయిలో అనుసంధానత పెంపుపై దృష్టి పెట్టాలని కోరారు. ‘‘శాఖా బ్యాంకింగ్‌కు మళ్లీ మళ్లాలి. గతంలో మాదిరిగా శాఖల స్థాయిలో కస్టమర్లతో అనుసంధానత ఇప్పుడు లేదు.

కరోనా నుంచి ఊహించని రక్షణ కవచం

Friday 28th February 2020

కరోనా వైరస్‌ చైనా సహా ఆసియాలోని పలు దేశాలకు నిద్ర లేకుండా చేస్తున్న పరిస్థితులను చూస్తున్నాం. కానీ, మన ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ ప్రభావం పెద్దగా ఉండదని... ఇందుకు ఊహించని రక్షణ కవచమే కారణమని నోమురా ముఖ్య ఆర్థికవేత్త రాబర్ట్‌ సుబ్బురామన్‌ అంటున్నారు. కరోనా వైరస్‌కు ఆసియా ప్రాంతం ఎక్కువగా గురయ్యే అవకాశాలున్నాయన్న ఆయన.. ఆసియాలో అతి తక్కువ ప్రభావిత దేశం భారత్‌ అని స్పష్టం చేశారు. దీనికి

Most from this category