News


ఏడాదిగా ఎంఎఫ్‌ల ఫేవరెట్‌ షేర్లివే!

Monday 4th November 2019
personal-finance_main1572845820.png-29328

నాలుగు త్రైమాసికాలుగా వీటిలో వాటాలు పెంచుకుంటున్న ఫండ్స్‌
ఏడాది కాలంగా మార్కెట్లు పడుతూ లేస్తూ పయనం సాగిస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఫండ్‌ మేనేజర్లు కొన్ని నాణ్యమైన స్టాకులను తమ పోర్టుఫోలియోల్లో పెంచుకుంటూ పోతున్నారు. వీటిలో నాణ్యమైన ఏడు స్టాకులను వివిధ పారామీటర్ల ఆధారంగా నిపుణులు ఎంపిక చేస్తున్నారు. 

ఇలా ఎంఎఫ్‌లు ఏడాదిగా మక్కువ చూపుతున్న ఏడు స్టాకుల వివరాలు ఇలా ఉన్నాయి...
1. ఎల్‌అండ్‌ టీ: బలమైన ఎర్నింగ్స్‌ నమోదు చేస్తున్నా, షేరు మాత్రం డిస్కౌంట్‌లో లభిస్తోంది. కంపెనీ ఆర్డరు పుస్తకం ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో రూ.3లక్షల కోట్లను చేరింది. సంవత్సరాంతానికి రూ.5 లక్షల కోట్లను అందుకోవాలని కంపెనీ భావిస్తోంది. 
షేరు ప్రస్తుత ధర(నవంబర్‌ 1 ముగింపు): రూ. 1449.40
పీఈ: 21.2
ఐదేళ్ల సరాసరి పీఈ: 25.4
మూడేళ్ల సరాసరి ఆర్‌ఓఈ: 16.9
అనలిస్టుల రికమండేషన్లు: 35 మంది కొనొచ్చని, ఇద్దరు అమ్మొచ్చని, ఇద్దరు హోల్డ్‌ అని సిఫార్సు చేస్తున్నారు.
ఎన్ని మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో షేరు ఉన్నది: 232.
మొత్తం షేర్‌ క్యాపిటల్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా, ఈ వాటా పెరుగుదల ధోరణి...

2. టీవీఎస్‌ మోటర్స్‌: వ్యయసామర్ధ్యం మెరుగుపడుతోంది. సవాళ్ల వాతావరణంలో కూడా కంపెనీ రెండు వరుస త్రైమాసికాలు మార్జిన్లు పెంచుకుంది. దీనికితోడు ఒక్కోవాహనంపై వచ్చే లాభం పెంచుకుంటూ వస్తోంది. 
షేరు ప్రస్తుత ధర(నవంబర్‌ 1 ముగింపు): రూ.469.25
పీఈ: 30.7
ఐదేళ్ల సరాసరి పీఈ: 38.9
మూడేళ్ల సరాసరి ఆర్‌ఓఈ: 25.7
అనలిస్టుల రికమండేషన్లు: కొనొచ్చని 12 మంది, హోల్డ్‌ అని 9 మంది, అమ్మొచ్చని 23 మంది సిఫార్సు చేస్తున్నారు. 
ఎన్ని మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో షేరు ఉన్నది: 42.
మొత్తం షేర్‌ క్యాపిటల్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా, ఈ వాటా పెరుగుదల ధోరణి...


3. ఐటీసీ: క్రమంగా బలమైన ఎర్నింగ్స్‌ ప్రకటిస్తూ వస్తోంది. కంపెనీ సిగిరెటేతర వ్యాపారం మంచి పురోగతి సాధిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యాపారం కంపెనీ ఆదాయంలో 32 శాతానికి చేరింది. తోటి కంపెనీల ఎఫ్‌ఎంసీజీ వ్యాపారాల కన్నా మంచి మెరుగుదల నమోదు చేస్తోంది. 
షేరు ప్రస్తుత ధర(నవంబర్‌ 1 ముగింపు): రూ. 261.30
పీఈ: 23.9
ఐదేళ్ల సరాసరి పీఈ: 29.6
మూడేళ్ల సరాసరి ఆర్‌ఓఈ: 23.3
అనలిస్టుల రికమండేషన్లు: 34 మంది కొనొచ్చని, నలుగురు హోల్డని సిఫార్సు చేస్తున్నారు. 
ఎన్ని మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో షేరు ఉన్నది: 197.
మొత్తం షేర్‌ క్యాపిటల్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా, ఈ వాటా పెరుగుదల ధోరణి...


4. కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌: వర్షపాతం బాగుండడం కంపెనీ అధిక రాబడికి దారితీస్తుంది. కంపెనీ ఆర్ఓఈ బలంగా కొనసాగుతోంది. షేర్లు బాగా డిస్కౌంట్‌లో ఉన్నాయి. 
షేరు ప్రస్తుత ధర(నవంబర్‌ 1 ముగింపు): రూ.477
పీఈ: 16.6
ఐదేళ్ల సరాసరి పీఈ: 19.3
మూడేళ్ల సరాసరి ఆర్‌ఓఈ: 21.4
అనలిస్టుల రికమండేషన్లు: 13 మంది కొనొచ్చని, ఒక్కరు హోల్డ్‌ అని సిఫార్సు చేస్తున్నారు. 
ఎన్ని మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో షేరు ఉన్నది: 54.
మొత్తం షేర్‌ క్యాపిటల్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా, ఈ వాటా పెరుగుదల ధోరణి...


5. కేఎన్‌ఆర్‌ కనస్ట్రక‌్షన్స్‌: గడువు కన్నా ముందే ప్రాజెక్టులు పూర్తి చేస్తుందన్న పేరుంది. బలమైన, పెద్ద ప్రాజెక్టులను, అది కూడా చాలా పరిమిత సంఖ్యలో ఎంచుకుంటుంది. ప్రాజెక్టుల సంఖ్య కన్నా లాభాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది. 
షేరు ప్రస్తుత ధర(నవంబర్‌ 1 ముగింపు): రూ. 233.05
పీఈ: 13.4 
ఐదేళ్ల సరాసరి పీఈ: 14.9
మూడేళ్ల సరాసరి ఆర్‌ఓఈ: 20
అనలిస్టుల రికమండేషన్లు: 25 మంది కొనొచ్చని, ఒక్కరు హోల్డ్‌ అని సిఫార్సు చేస్తున్నారు.
ఎన్ని మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో షేరు ఉన్నది: 48.
మొత్తం షేర్‌ క్యాపిటల్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా, ఈ వాటా పెరుగుదల ధోరణి...


6. కుమ్మిన్స్‌ ఇండియా: బలమైన నగదు నిల్వలకు తోడు బలమైన ఆర్డర్లను పొందుతోంది. మూలధన అవసరాలు బాగా తగ్గించుకుంది. 
షేరు ప్రస్తుత ధర(నవంబర్‌ 1 ముగింపు): రూ. 550.05
పీఈ: 22.2
ఐదేళ్ల సరాసరి పీఈ: 31.8
మూడేళ్ల సరాసరి ఆర్‌ఓఈ: 17.7
అనలిస్టుల రికమండేషన్లు: 15 మంది కొనొచ్చని, 11 మంది హోల్డ్‌ అని, 9 మంది అమ్మొచ్చు అని సిఫార్సు చేస్తున్నారు. 
ఎన్ని మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో షేరు ఉన్నది: 84.
మొత్తం షేర్‌ క్యాపిటల్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా, ఈ వాటా పెరుగుదల ధోరణి...


7. సుందరం ఫాస్టనర్స్‌: అధికవాల్యూ ఉన్న ఉత్పత్తులపై ఎక్కువ ఫోకస్‌ పెడుతోంది. ఈ ఏడాది ఇప్పటికే రూ.450 కోట్ల మూలధన వ్యయం చేసింది. మరో రూ. 350 కోట్లు వెచ్చించి కొత్త యూనిట్‌ నెలకొల్పనుంది. 
షేరు ప్రస్తుత ధర(నవంబర్‌ 1 ముగింపు): రూ. 478.45
పీఈ: 23.5
ఐదేళ్ల సరాసరి పీఈ: 26.6
మూడేళ్ల సరాసరి ఆర్‌ఓఈ: 28.6
అనలిస్టుల రికమండేషన్లు: ముగ్గురు కొనొచ్చని, ఒక్కరు హోల్డ్‌ అని సిఫార్సు చేస్తున్నారు. 
ఎన్ని మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో షేరు ఉన్నది: 28.
మొత్తం షేర్‌ క్యాపిటల్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా, ఈ వాటా పెరుగుదల ధోరణి...

ఏడు స్టాకుల్లో ఎంఎఫ్‌ల పెట్టుబడుల వివరాలు సంక్షిప్తంగా..

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

గమనిక: పెట్టుబడులకు ముందు సొంత అధ్యయనం తప్పనిసరి.



You may be interested

61 డాలర్ల పైకి క్రూడ్‌

Monday 4th November 2019

యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ఈ నెలలో ఖరారు కానుందనే అంచనాల నేపథ్యంలో శుక్రవారం రాత్రి అమెరికా ట్రేడింగ్‌లో 3 శాతానికి పైగా లాభపడిన చమురు ధరలు, సోమవారం ఆసియాలో లాభాల స్వీకరణ ఫలితంగా  గరిష్టస్థాయి నుంచి తగ్గాయి. ఉదయం 10.45 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.55 శాతం నష్టపోయి బారెల్‌ 61.35 డాలర్ల వద్ద, డబ్ల్యూటీఐ క్రూడ్‌ 0.59 శాతం నష్టపోయి బారెల్‌ 55.87 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. యుఎస్‌ క్రూడ్‌ ఆయిల్‌

స్థిరంగా పసిడి

Monday 4th November 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర సోమవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్లు స్వల్ప లాభంతో 1,513 వద్ద కదలాడుతుంది. అమెరికా - చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల్లో భాగంగా పూర్తిస్థాయి ఒప్పందంపై ఇరు దేశాధ్యక్షులు ఈ నెలలో సంతకాలు చేయవచ్చని సంకేతాలను వెలువడ్డాయి. అమెరికా ఉద్యోగ గణాంకాలు అక్టోబర్‌లో అంచనాలకు మించిన నమోదు కావడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్ల వైపు

Most from this category