STOCKS

News


ఈక్విటీ ఫండ్స్‌కు మళ్లీ పూర్వ వైభవం!

Wednesday 27th November 2019
personal-finance_main1574877904.png-29905

ఈక్విటీ మార్కెట్లు అంటేనే పడి లేచే కెరటాలు. కొంత కాలం పాటు ర్యాలీ, తర్వాత కరెక్షన్‌, మళ్లీ ర్యాలీ ఇటువంటివి సహజమే. ఈక్విటీ ఇన్వెస్టర్లు కూడా ఈ విషయాన్ని బాగానే అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలం (జూలై-సెప్టెంబర్‌)లో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ.24,000 కోట్లుగా ఉన్నాయి. క్యూ2 సమయంలోనే మార్కెట్లో భారీగా పడిపోవడం, ప్రభుత్వం కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, ఎఫ్‌పీఐలపై సర్‌చార్జ్‌ ఉపసంహరణ వంటి నిర్ణయాలు తీసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. క్యూ2లో వచ్చిన తాజా పెట్టుబడులతో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని మొత్తం ఆస్తులు సెప్టెంబర్‌ ఆఖరుకు రూ.7.24 లక్షల కోట్లకు చేరాయి. 

 

మార్నింగ్‌ స్టార్‌ నివేదిక ప్రకారం.. జూన్‌ త్రైమాసికంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు రూ.17,680 కోట్లుగా ఉన్నాయి. దీంతో పోలిస్తే సెప్టెంబర్‌ త్రైమాసికంలో పెట్టుబడులు గణనీయంగా పెరిగి రూ.24,000 కోట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. వీటిల్లో 25 శాతం అంటే రూ.6,000 కోట్లు లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ కేటగిరీలోకి వెళ్లాయి. గత ఏడాది కాలంగా లార్జ్‌క్యాప్‌ విభాగంలోని స్టాక్సే ర్యాలీని నడిపిస్తున్న విషయం తెలిసిందే. ‘‘ప్రభుత్వం తీసుకున్న చర్యలు సైతం లార్జ్‌క్యాప్‌ విభాగంలోకి ఎక్కువ నిధుల రాకకు తోడ్పడ్డాయి. ఎఫ్‌పీఐలపై సర్‌చార్జీ పెంపును వెనక్కి తీసుకోవడం, ప్రభుత్వరంగ బ్యాంకుల మూలధన సాయం వంటివి లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి స్థిరంగా నిధుల రాకకు తోడ్పడ్డాయి’’ అని మార్నింగ్‌ స్టార్‌ నివేదిక తెలియజేసింది.

 

2018 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్య ఈక్విటీ విభాగంలోకి సగటు పెట్టుబడుల రాక రూ.25,000 కోట్లుగా ఉంది. ఆ తర్వాత పెట్టుబడుల్లో భారీ క్షీణత నెలకొంది. ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో రూ.17,876 కోట్లకు పడిపోయింది. ఇదే ధోరణి తర్వాత ‍త్రైమాసికం అంటే ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ కాలంలోనూ కొనసాగి.. పెట్టుబడుల రాక రూ.17,680 కోట్లుగా ఉండడం గమనార్హం. అయితే, మొత్తానికి తిరిగి సెప్టెంబర్‌ త్రైమాసికంలో మళ్లీ పూర్వపు స్థాయికి పెట్టుబడులు పుంజుకున్నాయని మార్నింగ్‌ స్టార్‌ నివేదిక తెలియజేసింది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ విభాగంలో కరెక్షన్‌ ఎక్కువగా ఉండడం చూస్తూనే ఉన్నాం. దీంతో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాకపై ప్రభావం పడింది. అయితే, మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇప్పటికీ బలమైన సిప్‌ బుక్‌ కలిగి ఉన్నాయని మార్నింగ్‌ స్టార్‌ పేర్కొంది. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేసే వారు సిప్‌ రూపంలో ప్రతీ నెలా క్రమం తప్పకుండా దాన్ని అనుసరించినట్టయితే, మార్కెట్‌ అస్థిరతలు ఉన్నప్పటికీ లాభాలు ఆర్జించేందుకు అవకాశం ఉంటుందని తెలిసిందే. You may be interested

వచ్చే ఆరు నెలలు మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ హవా: మెహతా

Wednesday 27th November 2019

రానున్న 6-12 నెలల కాలంలో మార్కెట్లు ఎగువ దిశలోనే కొనసాగితే అప్పుడు అధిక శాతం స్మాల్‌, మిడ్‌క్యాప్‌ కంపెనీలు లార్జ్‌క్యాప్‌నకు మించి పనితీరు చూపిస్తాయని ఎలిగ్జిర్‌ ఈక్విటీస్‌ వ్యవస్థాపకుడు దీపన్‌ మెహతా పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి..   మిడ్‌క్యాప్స్‌ ఇక ముందు ఇన్వెస్టర్లు ఎంచుకున్న రంగాల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి (లార్జ్‌క్యాప్‌ మినహా) స్టాక్స్‌ను కొనుగోలు చేయడం మంచిది. మీరు ఏ

సూచీల రికార్డు ముగింపు

Wednesday 27th November 2019

41వేల పైన ముగిసిన సెన్సెక్స్‌ 12100 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ రాణించిన బ్యాంకింగ్‌, అటో, మెటల్‌ షేర్ల ర్యాలీ చివరి గంటలో బ్యాంకింగ్‌, అటో, మెటల్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బుధవారం సూచీలు రికార్డు ముగింపును నమోదుచేశాయి. సెన్సెక్స్‌ 199 పాయింట్ల లాభపడి 41000 పైన 41,020.61 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 63 పాయింట్లు పెరిగి 12,100 వద్ద ముగిసింది. ఇంతటి స్థాయిలో  సూచీలు ముగియడం ఇదే ప్రధమం.  ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ రంగ షేర్ల

Most from this category