News


మూడున్నరేళ్ల కనిష్ఠానికి మ్యూచువల్‌ఫండ్‌ నిధులు!

Tuesday 10th December 2019
personal-finance_main1575971263.png-30154

ఈక్విటీ ఎంఎఫ్‌ల్లోకి మూడున్నరేళ్లలో రానంత తక్కువ నిధులు నవంబర్‌లో వచ్చాయి. ఈక్విటీఎంఎఫ్‌ల్లోకి నవంబర్‌లో రూ. 1311 కోట్ల నిధులు వచ్చాయి. అక్టోబర్‌తో పోలిస్తే ఇది 78 శాతం తక్కువ. అయితే ఎంఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) మాత్రం నవంబర్‌లో రికార్డు గరిష్ఠం  రూ.27 లక్షల కోట్లకు చేరింది. అక్టోబర్‌తో పోలిస్తే ఇది 3 శాతం అధికం. డెట్‌ పథకాల్లోకి వచ్చిన నిధులు ఏయూఎంల విలువ పెరిగేందుకు దోహదం చేశాయి. నవంబర్లో ఈక్విటీ పథకాల్లోంచి రూ. 16268 కోట్లను మదుపరులు వెనక్కు తీసుకున్నారు. అక్టోబర్‌తో పోలిస్తే ఇది 47 శాతం అధికం. ప్రస్తుత పరిస్థితుల పట్ల ఇన్వెస్టర్లు ఆందోళనగా ఉన్నారని, అందువల్ల కొత్త పెట్టుబడులకు మొగ్గు చూపడం లేదని, మరికొందరు ప్రాఫిట్‌ బుకింగ్‌కు మొగ్గు చూపారని మార్కెట్‌ నిపుణుడు స్వరూప్‌మహంతి అభిప్రాయపడ్డారు. మార్కెట్లు కొత్త గరిష్ఠాలను చేరడంతో వివిధ రంగాల్లో మదుపరులు ప్రాఫిట్‌ బుకింగ్‌ చేశారన్నారు. డిసెంబర్‌లో కూడా ఇన్వెస్టర్ల రిడింప్షన్‌ ఎక్కువగానే ఉందన్నారు. నవంబర్‌లో సిప్‌ పెట్టుబడులు స్వల్పంగా పెరిగి రూ. 8272 కోట్లను తాకాయి. సిప్స్‌ బలంగా కొనసాగడం ఆరోగ్యకర పరిణామమని నిపుణుల అంచనా. లిక్విడ్‌ స్కీమ్స్‌లోకి నిధుల ప్రవాహం 92 శాతం తగ్గి రూ. 6938 కోట్లకు చేరింది. లిక్విడ్‌ స్కీమ్స్‌కు సెబి కొత్తగా నిబంధనలు కఠినం చేయడంతో నిధుల రాక తగ్గిందని నిపుణుల విశ్లేషణ. క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌నుంచి రూ. 1898 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కు తీసుకున్నారు. అన్ని లెక్కించి చూస్తే నవంబర్‌లో ఎంఎఫ్‌ల్లోకి వచ్చిన నిధుల కన్నా బయటకు వెళ్లిన మొత్తమే అధికం. 



You may be interested

అమ్మకాల ఒత్తిడిలో మెటల్‌ షేర్లు

Tuesday 10th December 2019

మార్కెట్‌ నెలకొన్న అమ్మకాల్లో భాగంగా మెటల్‌ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. మిడ్‌సెషన్‌ సమయానికి ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ మెటల్ ఇండెక్స్‌ దాదాపు 2శాతం నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 2,549.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ను ప్రారంభం నుంచి మెటల్‌ షేర్లలో అ‍మ్మకాలు కొనసాగడంతో ఇండెక్స్‌ ఒకదశలో 1.85శాతం నష్టపోయి 2,510.75 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌

యస్‌బ్యాంక్‌లో ఝన్‌ఝన్‌వాలా వాటా కొనుగోలు లేనట్లే!

Tuesday 10th December 2019

యస్‌బ్యాంకులో దాదాపు 2.5 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టి వాటాలు కొనాలన్న ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా, తన ప్రతిపాదన ఉపసంహరించుకున్నట్లే కనిపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. బ్యాంకు నిధుల సమీకరణ ప్లాన్స్‌పై సందేహాలు రాకేశ్‌ను వెనుకంజ వేసేలా ప్రేరేపించాయని అంచనా వేస్తున్నారు. రాకేశ్‌ తన భార్య రేఖా ఝన్‌ఝన్‌వాలా పేరుమీద యస్‌బ్యాంకులో వాటాలు కొనుగోలు చేయాలని భావించినట్లు బిజినెస్‌లైన్‌ వెల్లడించింది. ఈ విషయమై ఈరోజు ఒక ప్రకటన చేయాలని రాకేశ్‌

Most from this category