News


అప్పుల ఊబికి ఐదు సంకేతాలు..

Monday 1st October 2018
personal-finance_main1538390842.png-20762

ఈ సిగ్నల్స్‌ వస్తే రుణభారం మోయలేనట్లే లెక్క
తక్షణ చర్యలు తీసుకోకుంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం...
శ్రుతిమించిన అప్పులతో మితిమీరిన తిప్పలు వస్తాయి.. అందువల్ల ఎప్పటికప్పుడు రుణాలను కంట్రోల్‌లో ఉంచుకోవడం ఉత్తమం. ఒక్కోసారి పరిస్థితులు మన చేతిలో ఉండవు. అలాంటప్పుడు తలకుమించిన అప్పులు చేస్తాం. వీటిని సకాలంలో తీర్చగలిగితే ఓకే, లేదంటే రుణ ఊబిలోకి జారడం ఖాయం. మనం రుణాల అగాధంలో పడిపోతున్నామనేందుకు ఐదు సంకేతాలుంటాయని పర్సనల్‌ ఫైనాన్స్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ ఐదు కనిపిస్తున్నాయంటే మన పరిస్థితి బాగా దెబ్బతిన్నట్లే లెక్కని, వెంటనే సరిదిద్దకపోతే మన ఆర్థిక పరిస్థితి కుప్పకూలడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. అవేంటో చూద్దాం..
- వచ్చిన ఆదాయమంతా అప్పులకే పోతుందా?: సాధారణంగా నెలసరి వేతనంలో 30 శాతం వరకు రుణాలకు కట్టడం పెద్ద ప్రభావం చూపదు. ఒకవేళ హోమ్‌లోన్స్‌, ఎడ్యుకేషన్‌ లోన్స్‌లాంటి సెక్యూర్ట్‌ రుణాలకు 40 శాతం వరకు ఓకే అనుకోవచ్చు. కానీ వచ్చిన జీతంలో 70- 90 శాతం అప్పులకు పోతున్నాయంటే ఆలోచించాల్సిందే. ఇది రెండో సంకేతానికి దారితీస్తుంది.
- నెలసరి ఖర్చులకోసం కొత్త అప్పులు చేస్తున్నారా? పైన చెప్పిన సిట్యుయేషన్‌ ముదిరి ఈ పరిస్థితి వస్తుంది. జీతమంతా అప్పులకు పోతే నెల గడిచేందుకు చేబదుళ్లు, చిన్నా చితకా అప్పులు చేయాల్సివస్తుంది. ఇది క్రమంగా పెరిగి రుణ వలయానికి దారితీస్తుంది.
- క్రెడిట్‌ కార్డు డ్యూ కట్టలేకపోతున్నారా? క్రెడిట్‌ కార్డు డ్యూ ఎప్పుడైన ఖరీదైన రుణమే. ఒక్క డ్యూ కట్టకపోతే అది మరలా అసలులోకలిసి బండెడమొత్తం అవుతుంది. కేవలం రుణ మొత్తం పెరగడమే కాకుండా, దీనివల్ల క్రెడిట్‌ స్కోరు విపరీతంగా దెబ్బతింటుంది. 
- పాతలోను తీర్చేందుకు కొత్త అప్పు? ఒక్కసారి నెలవారీ ఆర్థిక ప్రణాళిక చెడిపోతే తిరిగి రిపేరు చేయడం చాలా కష్టంగా మారుతుంది. కొంతమంది పాత లోన్స్‌ను చిన్నపాటి ఫీజుకు వేరే బ్యాంకులకు బదిలీ చేసుకుంటుంటారు. దీనివల్ల కొంత సమయం దొరికినట్లు కనిపిస్తుంది. కానీ, ఇది రుణ ఊబికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా బదిలీ చేసుకుంటూ పోతే ఒకదశలో మనం భరించలేని వడ్డీకి రుణం తీసుకోవడం, చివరకు దాన్ని తీర్చలేక డిఫాల్ట్‌కావడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది.
- ఏ బ్యాంకు మీ ముఖం చూడడం లేదా? ఇది అప్పుల ఊబిలో ఆఖరు మజిలీ. ఈ దశ వచ్చిందంటే మనం అధికారికంగా డిఫాల్టర్‌గా మారినట్లే లెక్క. కొత్త అప్పులు దేవుడెరుగు, పాతవి తీర్చకపోతే కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఈ దశలో ఉంటుంది. 
ఈ ఐదు సంకేతాల్లో ఏ ఒక్కటి మీకు అనుభవంలోకి వచ్చినా వెంటనే అత్యంత జాగ్రత్త వహించాలని ఎకనమిస్టులు సలహా ఇస్తున్నారు. లేదంటే ఇంతే సంగతులు.. You may be interested

లిక్విడ్‌ ఫండ్స్‌ కూడా నమ్మకాన్ని వమ్ము చేశాయ్‌!

Monday 1st October 2018

తమ పొదుపు నిధులను బ్యాంకు ఖాతాలకు బదులు లిక్విడ్‌ ఫండ్స్‌లో ఉంచితే కాస్తంత అదనపు రాబడి వస్తుందని ఆశించిన వారి ఆశలు అడియాశలయ్యాయి. ఎందుకంటే ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ సంక్షోభం ఈ ఏడాది కొన్ని లిక్విడ్‌ ఫండ్స్‌లో రాబడులను హరించి వేశాయి. లిక్విడ్‌ ఫండ్స్‌ అన్నవి సాధారణంగా రిస్క్‌ తక్కువ అన్న అభిప్రాయం ఉండేది. తాజా పరిణామాం దాన్ని తుడిచిపెట్టేసింది. లిక్విడ్‌ ఫండ్స్‌ షార్ట్‌ టర్మ్‌ డెట్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి.

అక్టోబర్‌ ఆరంభం అదిరింది.

Monday 1st October 2018

మిడ్‌సెషన్‌ నుంచి పెరిగిన కొనుగోళ్లతో మార్కెట్‌ సోమవారం భారీగా లాభపడింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకు, ఐటీ, ఫైనాన్స్‌ రంగాలకు చెందిన షేర్ల ర్యాలీతో సెన్సెక్స్‌ 300 పాయింట్లను ఆర్జించింది. నిఫ్టీ 11వేల ఎగువన ముగిసింది.  సెన్సెక్స్‌ 299 పాయింట్ల లాభంతో 36,526 వద్ద ముగియగా, నిఫ్టీ 78 పాయింట్ల లాభంతో 11,008.30 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ 1శాతం(247 పాయింట్లు) లాభపడి 25,367 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో

Most from this category