News


బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ ఎంపిక భిన్నం

Sunday 9th September 2018
personal-finance_main1536517358.png-20100

బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్న వారు, ఇన్వెస్ట్‌ చేయదలిచిన వారు తప్పకుండా కొన్ని అంశాలను కూలంకుషంగా తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే ఇటీవలి మార్పుల అనంతరం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ప్రాథమికంగా 10 కేటగిరీలు, హైబ్రిడ్‌ ఫండ్స్‌లో ఆరు కేటగిరీలు ఉన్నాయి. వీటన్నింటికీ ఈక్విటీల్లో ఎంత, డెట్‌లో ఎంత మేర ఇన్వెస్ట్‌ చేయాలి అనే విషయంలో కచ్చితమైన పరిమితులు నిర్ణయించడం జరిగింది. ఒక్క బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్స్‌ విషయంలో దీనికి మినహాయింపు ఉంది. అందుకే ఈ విభాగంలో పెట్టుబడులకు ఎంచుకునే పథకం కీలకం అవుతుంది. అదే రిస్క్‌, రాబడులను నిర్ణయిస్తుంది. 

 

కేటగిరీ
మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లు తమ రిస్క్‌ ప్రొఫైల్‌ ఆధారంగా ఫండ్స్‌ను మరింత సులభంగా ఎంపిక చేసుకునేందుకే సెబీ ఇటీవల మార్పులు చేసింది. ఇన్వెస్ట్‌ చేసే వారు ఎవరైనా కానీ, ఆయా కేటగిరీలోని ఫండ్స్‌ పెట్టుబడుల విధానాన్ని తెలుసుకోవడం అవసరం. అప్పుడే అది వారి రిస్క్‌ స్థాయికి సిరపడేదా, సరిపడనిదా అన్నది తెలుస్తుంది. 

 

బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌
డైనమిక్‌ అస్సెట్‌ అలోకేషన్‌ ఫండ్‌ లేదా బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ వీటిలో ఏ పేరున్నా కానీ, ఇవి ఈక్విటీల్లో 100 శాతం వరకు ఇన్వెస్ట్‌ చేయగలవు. కావాలంటే 100 శాతం వరకు డెట్‌లోనూ లేదా రెండింటి మిశ్రమంగానూ పోర్ట్‌ఫోలియో నిర్వహించొచ్చు. ఆ వెసులుబాటు సెబీ కల్పించింది. ఉదాహరణకు హెచ్‌ఎస్‌బీసీ డైనమిక్‌ అస్సెట్‌ అలోకేషన్‌ ఫండ్‌లో ఈక్విటీ కేటాయింపులు జూన్‌ 30 నాటికి 93.83 శాతంగా ఉన్నాయి. అదే మోతీలాల్‌ ఓస్వాల్‌ డైనమిక్‌ ఫండ్‌లో ఈక్విటీ కేటాయింపులు 43.93 శాతం అయితే, డెట్‌ కేటాయింపులు 25.28 శాతంగా ఉండడం గమనార్హం. ఇక ఎస్‌బీఐ డైనమిక్‌ అస్సెట్‌ అలోకేషన్‌ ఫండ్‌ మేనేజర్లు ఈక్విటీ కేటాయింపులను 27.34 శాతం, డెట్‌ కేటాయింపులు 72.28 శాతంగానూ నిర్వహిస్తున్నారు. ‘‘ఈక్విటీ, డెట్‌ లేదా డెరివేటివ్‌ హోల్డింగ్స్‌ విషయం కానీ, మార్కెట్‌ క్యాప్‌ పరంగా కానీ ఎటువంటి స్పష్టమైన నిర్వచనం లేదు. దీంతో డైనమిక్‌ అస్సెట్‌ అలోకేషన్‌, బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ అన్నది క్లిష్టమైన కేటగిరీలుగా ఉండిపోయాయి’’ అని ఫండ్స్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ విద్యాబాల తెలిపారు. 

 

పోల్చడం ఎలా?
ఇటీవలి కేటగిరీ మార్పుల నేపథ్యంలో కొన్ని పథకాల మధ్య విలీనం లేదా పేర్ల మార్పు జరిగింది. దీంతో ఈ కేటగిరీలోని పథకాల మధ్య పనితీరును పోల్చేందుకు ట్రాక్‌ రికార్డు కోసం వేచి చూడాల్సి ఉందని విద్యా బాల పేర్కొన్నారు. ఒక్కో పథకం భిన్నమైన ఈక్విటీ, డెట్‌ ఎక్స్‌పోజర్‌ కలిగి ఉండడం రాబడుల విషయంలో పోల్చేందుకు అడ్డంకేనని నిపుణుల అభిప్రాయం. అయితే, కేటగిరీ మార్పులకు ముందు నుంచి ఈ విభాగంలో ఉన్న పథకాలను పరిశీలించొచ్చని విద్యా బాల అభిప్రాయపడ్డారు. ఈక్విటీ మార్కెట్లో అధిక అస్థిరతలను జీర్ణించుకోలేని వారు, ఈక్విట్లీలో నష్టాలను పరిమితం చేసుకోవాలని భావించేవారు 2-3 ఏళ్ల పాటు పెట్టుబడుల కోసం అయితే, ఈ కేటగిరీ పథకాలను పరిశీలించొచ్చని ఆమె సూచించారు. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయగలిగితే ఈక్విటీ ఫండ్స్‌ మెరుగైన ఆప్షన్‌గా పేర్కొన్నారు.You may be interested

ఇప్పట్లో మార్కెట్‌ క్రాష్‌ ఉండదు: ఇండిట్రేడ్‌ క్యాపిటల్‌

Sunday 9th September 2018

దేశీయ స్టా్క్‌‌ మార్కెట్లు సమీప కాలంలో పతనమయ్యే అవకాశాల్లేవని, అలాగని సమీప కాలంలో వేగంగా పెరిగే అవకాశాలు కూడా లేవని ఇండిట్రేడ్‌ క్యాపిటల్‌ గ్రూపు చైర్మన్‌ సుదీప్‌ బందోపాధ్యాయ తెలిపారు. ఫార్మా, ఆటోమొబైల్‌ రంగంలో ఎంపిక చేసిన స్టాక్స్‌ను పెట్టుబడులకు ఎంచుకోవచ్చని సూచించారు. ఓ ‍ప్రముఖ వార్తా సంస్థకు ఈ మేరకు ఇంటర్వ్యూ ఇచ్చారు.    అంతర్జాతీయ సమస్యలే మార్కెట్లకు ఆందోళన కలిగించే అంశాలుగా బందోపాధ్యాయ చెప్పారు. రూపాయి పతనం అన్నది ఓ

ఈ కంపెనీల్లో మీకు ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఉన్నాయా?

Sunday 9th September 2018

ఎన్‌ఎస్‌ఈ 36 కంపెనీలకు నోటీసులను జారీ చేసింది. త్రైమాసిక ఫలితాల వివరాలను స్టాక్‌ ఎక్సేంజ్‌కు ఫైల్‌ చేయకపోవడంతో నోటీసులను జారీ చేసింది. గీతాంజలి జెమ్స్‌, ఏబీజీ షిప్‌యార్డ్‌ కంపెనీలు జూన్‌ క్వార్టర్‌ త్రైమాసిక ఫలితాలను నిర్ణీత గడువులోపు సమర్పించలేదని సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ తెలిపింది. క్వాలిటీ లిమిటెడ్‌, యూనిటెక్‌, ఆమ్టెక్‌ ఆటో, ఎలక్ట్రోస్టీల్‌ స్టీల్స్‌, మోసర్‌ బేర్‌ ఇండియా, ఎస్‌ఆర్‌ఎస్‌, జేవీఎల్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌, భారతి డిఫెన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌,

Most from this category