News


వడ్డీ రేట్ల తగ్గింపు సమయంలో డెట్‌ ఫండ్స్‌ బెస్ట్‌

Friday 18th January 2019
personal-finance_main1547806588.png-23670

ఆర్‌బిఐ కీలక రేట్లను తగ్గించవచ్చని భావిస్తున్న వేళ   డెట్‌ ఫండ్స్‌ను ఎంచుకోవడం ద్వారా తీరైన రిటర్న్స్ పొందవచ్చని మార్కెట్‌ పండితులు సూచిస్తున్నారు. డెట్‌ ఫండ్స్‌ను ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సెక్యూరిటీలు అనికూడా అంటారు. వీటిల్లో సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్‌, కార్పొరేట్‌బాండ్స్‌, కమర్షియల్‌పేపర్స్‌, గవర్నమెంట్‌ బాండ్స్‌.. ఇలా పలు రకాలున్నాయి. ఈ ఫండ్స్‌లో ప్రధానంగా వడ్డీరేట్ల రిస్కు, క్రెడిట్‌ రిస్క్‌ అని రెండు రకాల రిస్కులుంటాయి. వడ్డీరేట్లకు, బాండ్ల మార్కెట్‌ విలువకు విలోమానుపాత సంబంధం ఉంటుంది, అంటే వడ్డీరేట్లు తగ్గితే బాండ్‌ రేటు పెరుగుతుంది, వడ్డీరేట్లు పెరిగితే బాండ్‌ విలువలు పడిపోతాయి. బాండ్‌ కాలపరిమితిని బట్టి ఈ సంబంధం ఉంటుంది, అంటే దీర్ఘకాలపరిమితి కల బాండ్లు వడ్డీరేట్ల మార్పులతో అధికంగా ప్రభావితం అవుతాయి. ఇక క్రెడిట్‌ రిస్క్‌ అంటే బాండ్‌ జారీచేసిన వారు కూపన్‌ పేమెంట్‌(వడ్డీ చెల్లింపులు) సమయానికి అందించలేకపోవడం లేదా మెచూరిటీ సమయంలో బాండ్‌ విలువను తిరిగివ్వలేకపోవడం జరుగుతుంటాయి. వడ్డీరేట్లలో మార్పులు వచ్చినప్పుడు సదరు బాండ్‌ మార్కెట్‌ విలువ తగ్గే ఛాన్సులుంటాయి.

ఈ రెండు రిస్కులు సదరు బాండ్‌ను ఎలా ప్రభావితం చేస్తాయన్నది ఆయా రేటింగ్‌ఏజన్సీలు సదరు బాండ్స్‌కు ఇచ్చే రేటింగ్‌ ఆధారంగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ఎఎఎ రేటింగ్‌ ఉన్న బాండ్లు సురక్షితమైనవిగా భావించవచ్చు. ఈ బాండ్లలో పై రెండు రిస్కులు చాలా తక్కువగా ఉంటాయి. రిస్కు పెరిగే కొద్దీ రేటింగ్‌ తగ్గుతూ(ఎఎ, ఎ, బిబిబి, బి...) ఉంటుంది.

మెచ్యూరిటీ, రేటింగ్‌ ఆధారంగా బాండ్స్‌ను 4 రకాలుగా వర్గీకరిస్తారు.
- లిక్విడ్‌ బాండ్లు: మెచ్యూరిటీకి సంవత్సరం లేదా అంతకన్నా తక్కువ కాలపరిమితి ఉన్న సెక్యూరిటీల్లో మదుపు చేస్తాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో దాదాపు సమానంగా రాబడినిస్తాయి. స్వల్పకాలానికి మూలధనం సురక్షితంగా ఉంచుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు సరిపోతాయి.
- షార్ట్‌ టర్మ్‌ ఫండ్స్‌: 1- 4 ఏళ్ల కాలపరిమితి గల ప్రభుత్వ, కార్పొరేట్‌ డెట్‌ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెడతాయి. ఎఫ్‌డిలతో పోలిస్తే అధిక రాబడులిస్తాయి. ఈ తరహా ఫండ్లు కొంచెం తక్కువ రేటింగ్‌ఉన్న బాండ్స్‌లో పెట్టుబడులు పెడతాయి, అందువల్ల క్రెడిట్‌రిస్క్‌ పెరుగుతుంది, రాబడులు కూడా పెరుగుతాయి. కనీసం మూడేళ్లలోపు పెట్టుబడి పెట్టేవారికి అనుకూలంగా ఉంటాయి.
- మిడ్‌టర్మ్‌ ఇన్‌కమ్‌ ఫండ్స్‌: కనీసం 4- 7 ఏళ‍్ల కాలపరిమితి ఉన్న సెక్యూరిటీల్లో పెట్టుబడి పెడతాయి. 
- లాంగ్‌టర్మ్‌ ఇన్‌కమ్‌ ఫండ్స్‌: కనీసం ఏడేళ్ల పైచిలుకు కాలపరిమితి ఉన్న సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెడతాయి. ఆర్‌బిఐ వడ్డీరేట్లు తగ్గించడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఈ బాండ్లలో కనిపిస్తాయి. వడ్డీరేట్లు తగ్గుతున్న వాతావరణంలో ఇలాంటి ఫండ్స్‌ని ఎంచుకోవచ్చు. ఎఫ్‌డిలతో పోలిస్తే ఎక్కువ రాబడులు ఇస్తాయి. 
డెట్‌ ఫండ్స్‌పై వచ్చే రాబడులపై విధించే పన్నులను మూడు రకాలుగా విభజించవచ్చు. స్వల్పకాలిక రాబడులపై ఇన్వెస్టర్‌ చెల్లించే ఐటీ ఆధారంగా కాపిటల్‌ గెయిట్‌ టాక్స్‌ పడుతుంది. డివిడెండ్లపై 28.84 శాతం చొప్పున పన్ను ఉంటుంది. దీర్ఘకాలిక ఫండ్స్‌పై పది శాతం ఫ్లాట్‌ లేదా 20.6 శాతం ఇండెక్సేషన్‌ బెనిఫిట్‌ రూపంలో కాపిటల్‌ గెయిన్‌ టాక్స్‌ విధిస్తారు. You may be interested

స్వల్పలాభాలతో ముగింపు

Friday 18th January 2019

ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతతో స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం కూడా అక్కడక్కడే ముగిసింది. సెన్సెక్స్‌ 12 పాయింట్ల లాభపడి 36,386.61 వద్ద, ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 2 పాయింట్లు పెరిగి 10,907 వద్ద ముగిసింది. సూచీలకు ఈ వారంలో ఇది నాలుగో లాభాల ముగింపు కావడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుకున్న సానుకూల సంకేతాలతో నేడు దేశీయ మార్కెట్‌ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది.

నెలన్నర గరిష్టానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.!

Friday 18th January 2019

మార్కెట్‌ వర్గాల అంచనాలకు మించి మూడో క్వార్టర్‌ ఫలితాలను వెల్లడించడంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు నెలన్నర గరిష్టాన్ని తాకింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో రిలయన్స్‌ షేర్లు రూ.1,148.80ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిన్నటి మార్కెట్‌ ముగింపు వెల్లడించిన క్యూ3 ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించడంతో నేడు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే షేర్లు లాభాల బాట పట్టాయి. ఇంట్రాడేలో ఒకానొక దశలో దాదాపు 5శాతం లాభపడి రూ.1,189.90ల గరిష్టాన్ని తాకింది. నవంబర్‌ 30వ తేదీ

Most from this category