News


డీడీటీ పోయి.. టీడీఎస్‌ వచ్చెన్‌

Sunday 2nd February 2020
personal-finance_main1580582756.png-31409

డివిడెండ్‌ పంపిణీ పన్ను(డీడీటీ)ను ఎత్తివేయడం ఈ బడ్జెట్‌లో ప్రధాన నిర్ణయాల్లో ఒకటి. దీంతో కంపెనీలపై పన్నుల భారం తగ్గిపోయి.. స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారి మీదకు భారం మళ్లినట్టయింది. ఇన్వెస్టర్లు డివిడెండ్‌ రూపంలో అందుకున్న ఆదాయాన్ని తమ వార్షికాదాయానికి కలిపి చూపించుకోవాలి. తాము ఏ శ్లాబులో ఉన్నామో ఆ మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారికీ డీడీటీ భారం తగ్గిపోయింది. కానీ, దీని స్థానంలో ఫండ్స్‌ ఇన్వెస్టర్లకు చేసే డివిడెండ్‌ చెల్లింపులు రూ.5,000 మించితే 10 శాతాన్ని టీడీఎస్‌ కింద మినహాయించి ఆదాయపన్ను శాఖకు జమ చేయడం తాజా బడ్జెట్‌లో చోటు చేసుకున్న కొత్త ప్రతిపాదన.

 

మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి డివిడెండ్‌ ఆదాయం కోరుకునే వారికి తాజా బడ్జెట్‌ ప్రతిపాదన అనుకూలించేదే అవుతుంది. ఎందుకంటే డీడీటీని ఎత్తివేయడం వల్ల మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల నుంచి అందుకునే డివిడెండ్‌ కూడా పెరుగుతుంది. ‘‘మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లకు చెల్లించే డివిడెండ్‌పై 10 శాతం టీడీఎస్‌ను అమలు చేయాల్సి ఉందని ఆర్థిక బిల్లు 2020లో ఓ నిబంధన కూడా పొందుపరిచారు. అది కూడా చెల్లించే డివిడెండ్‌ రూ.5,000 మించిన సందర్భాల్లోనే’’ అని గ్రాంట్‌ థార్న్‌టర్‌ ఇండియా ఎల్‌ఎల్‌పీ డైరెక్టర్‌ అఖిల్‌ చందనా పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లకు చెల్లించే డివిడెండ్‌పై 11.64 శాతాన్ని డీడీటీగా మినహాయించుకునేవి. బాండ్‌ ఫండ్స్‌లో డీడీటీ మినహాయింపు 29.12 శాతంగా ఉంది. తక్కువ ఆదాయపన్ను రేటులో ఉన్న వారికి డీడీటీని ఎత్తివేయడం లాభం కలిగిస్తుంది. బాండ్‌ ఫండ్స్‌ నుంచి డివిడెండ్‌ అందుకునే వారికి ముఖ్యంగా డీడీటీని ఎత్తివేయడం లాభకరం. 20 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి సైతం బాండ్‌ ఫండ్స్‌లో డీడీటీ 29 శాతంతో పోలిస్తే 9 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే, డివిడెండ్‌ రూ.5,000 మించితే 10 శాతం టీడీఎస్‌ను మినహాయించడం వల్ల ఇన్వెస్టర్ల చేతుల్లో తక్కువ నగదు ఉండేందుకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. టీడీఎస్‌ను మినహాయించుకుంటే పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఇన్వెస్టర్లపై ఉంటుందని గుర్తు చేస్తున్నారు. 



You may be interested

సెక్షన్‌ 80సీ పొదుపు.. కుదరకపోతే పన్ను..?

Sunday 2nd February 2020

ఇప్పటి వరకు వేతన జీవులు తమ ఆదాయంలో రూ.1.5 లక్షలను సెక్షన్‌ 80సీ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసి పన్ను ఆదా పొందుతున్నారు. ఇకపైనా ఈ అవకాశం కొనసాగుతుంది. మరోవైపు రూ.5-7.5 లక్షల మధ్య ఆదాయంపై పన్నును 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు. రూ.7.5-10 లక్షల ఆదాయంపై పన్ను రేటును 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. రూ.10-12.5 లక్షల మధ్య ఆదాయంపై 30 శాతానికి బదులు

బడ్జెట్‌ 2020: ఈ రంగాలకు ఏమీ లేదు..!

Saturday 1st February 2020

దేశీయ ఆర్థిక వ్యసస్థ వృద్ధి 11ఏళ్ల కనిష్టానికి దిగజారిన తరుణంలో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. వరుసగా రెండోసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌పై మార్కెట్‌ వర్గాలతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా భారీగా ఆశలు పెంచుకుంది. ఆదాయాలన్ని, కొనుగోలు శక్తిని పెంచడం ఈ బడ్జెట్‌ ప్రధాన లక్ష్యమని ద్రవోల్యణం ఎక్కువగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌

Most from this category