News


వేరే ఫండ్‌కు మారిపోవాలా?

Monday 17th February 2020
personal-finance_main1581909590.png-31839

ప్ర: నేను గత కొంతకాలంగా బ్యాంకింగ్‌ రంగానికి చెందిన సెక్టోరియల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించవచ్చా 
జ: అసలు సెక్టోరియల్‌ ఫండ్స్‌కు దూరంగా ఉంటేనే మంచిది. డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు పొందడం కోసమే మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తారు. అయితే సెక్టోరియల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే, మీకు డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు లభించవు. ఈ ఫండ్‌ పోర్ట్‌ఫోలియోలో అన్ని బ్యాంకింగ్‌ రంగ షేర్లే ఉంటాయి.  బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించి ప్రతికూల వార్తలు వచ్చినట్లయితే ఈ ఫండ్‌ పనితీరుపై తీవ్రమైన ప్రభావమే ఉంటుంది. అదే ఏదైనా ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేశారనుకోండి. ఈ ఫండ్‌ పోర్ట్‌ఫోలియోలో మీకు విభిన్న రంగాలకు చెందిన కంపెనీలు ఉంటాయి. డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు పొందవచ్చు. ఇక ప్రస్తుతం బ్యాంకింగ్‌ రంగం విషయానికొస్తే, ఆర్‌బీఐ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఫలితంగా మొండి బకాయిల సమస్య ఒక దారికి వస్తోంది. దివాలా చట్టం కారణంగా కొన్ని మొండి బకాయిలు కూడా రివకరీ అవుతున్నాయి. బ్యాంక్‌లను పటిష్టం చేయడానికి బలహీనమైన బ్యాంక్‌లను బలమైన బ్యాంక్‌ల్లో విలీనం చేస్తోంది. ఈ నిర్ణయాలన్నీ సానుకూలమైనవే. అయినప్పటికీ, ఒకే రంగానికి చెందిన ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం అన్ని వేళలా శ్రేయస్కరం కాదు. మీరు ప్రస్తుతం ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్న దాంట్లో మూడో వంతు మొత్తాన్ని ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసేలా ప్లాన్‌ చేసుకోండి. బ్యాంకింగ్‌ సెక్టోరియల్‌ ఫండ్‌లో మీరు కోల్పోయే డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలను ఈ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా పొందవచ్చు. 

ప్ర:  నా వయస్సు 20 సంవత్సరాలు. నేను ప్రస్తుతం సీఏ చదువుతున్నాను. నా ఖర్చుల కింద మా నాన్న ఇచ్చే దాంట్లో రూ.1,500 మేర ఒక బాండ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఇప్పుడు ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసే రిస్క్‌ తీçసుకోమంటారా ? ఏ రకమైన ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచిదో సూచించండి. 
-ప్రణీత్‌, హైదరాబాద్‌  
జ: మీరు ఇన్వెస్ట్‌ చేసే మొత్తం మీకు ఎప్పటికి అవసరమో, దానిని బట్టి మీరు ఎంత రిస్క్‌ తీసుకోవాలో నిర్ణయించుకోవచ్చు.  ఉదాహరణకు మీరు ఏడాదిలో బైక్‌ కొనాలనుకునే ఉద్దేశంతో ఇప్పుడు ఇన్వెస్ట్‌ చేయాలనుకోండి. మీకు వయస్సు తక్కువగా ఉన్నప్పటికీ, ఈక్విటీలను కాకుండా రిస్క్‌ తక్కువగా ఉండే ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచిది.  అలా కాకుండా మీ ఆర్థిక లక్ష్యాల కాలం ఐదేళ్లకు మించి ఉంటే, మీరు ఈక్విటీలోనే ఇన్వెస్ట్‌ చేయాలి.  ఇక మదుపు చేయడం బాండ్‌ ఫండ్‌తో మొదలు పెట్టడం మంచి విషయమే. నెలకు రూ.1,500 బాండ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల పెద్దగా రిస్క్‌ కూడా ఉండదు. సమీప భవిష్యత్తులో ఏదో ఒక వస్తువు కొనుగోలు చేసే ఉద్దేశంతో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, ఏదైనా ౖహైబ్రిడ్‌ ఫండ్‌ను పరిశీలించండి. ఇలా ఏడాది, రెండేళ్లపాటు ఇన్వెస్ట్‌ చేయడం కొనసాగిస్తే, మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం, మార్కెట్‌ స్థితిగతులు, ఫండ్స్‌ పనితీరు తదితర అంశాలపై మీకు ఒక అవగాహన వస్తుంది. ముఖ్యంగా ఒడిదుడుకులమయంగా సాగే స్టాక్‌ మార్కెట్‌ పట్ల తగిన అవగాహన మీకు వస్తుంది. ఆ తర్వాత ఈక్విటీ ఫండ్స్‌లో మీరు ఇన్వెస్ట్‌ చేయవచ్చు. 

ప్ర: నాకు కొన్ని స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాలున్నాయి. వీటి కోసం ఏ యే ఫండ్లలో ఇన్వెస్ట్‌ చేయాలి ? 
పవన్‌ కుమార్‌, రాజమండ్రి 

జ: రెండు, మూడేళ్లలో లేదా ఐదేళ్లలోపు  సాధించే ఆర్థిక లక్ష్యాలను స్వల్ప కాలిక ఆర్థిక లక్ష్యాలుగా పరిగణిస్తారు. ఉదాహరణకు కారు కొనుగోలు చేయడం, ఏడాదిలోపు విహారయాత్రకు వెళ్లడం... ఇవన్నీ స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాలు. ఏడాది, ఏడాదిలోపు అవసరమయ్యే వాటి కోసం లిక్విడ్‌ ఫండ్‌ను ఎంచుకోండి. కొన్ని రోజుల్లోనే అవసరమయ్యే భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేయడానికి ఓవర్‌నైట్‌ ఫండ్‌ను ఎంచుకోవాలి. ఏడాది నుంచి మూడేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, ఆల్ట్రా షార్ట్‌-టర్మ్‌ బాండ్‌ ఫండ్‌ను పరిశీలించాలి. You may be interested

నేడు ఓపెనింగ్‌ అక్కడక్కడే?!

Monday 17th February 2020

నామమాత్ర లాభంతో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ   వారాంతాన యూఎస్‌ మార్కెట్లు డీలా నేడు(సోమవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం  8.30 ప్రాంతం‍లో స్వల్పంగా 5 పాయింట్లు పుంజుకుని 12,134 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,129 పాయింట్ల వద్ద  ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ఏజీఆర్‌ బకాయిలను చెల్లించేందుకు

సెన్సెక్స్‌ 41,180 స్థాయికి అటూ...ఇటూ

Monday 17th February 2020

కరోనా వైరస్‌ ప్రభావం వున్నప్పటికీ, అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌...అవసరమైతే పాలసీని సరళీకరిస్తామంటూ అభయం ఇవ్వడంతో  అమెరికా, జర్మనీ  స్టాక్‌ సూచీలు గతవారం కొత్త రికార్డుల్ని నెలకొల్పగా, మిగిలిన ప్రపంచ ప్రధాన మార్కెట్లు దాదాపు స్థిరంగా ట్రేడయ్యాయి. అయితే భారత్‌ మార్కెట్‌కు సంబంధించి  టెలికాం కంపెనీల ఏజీఆర్‌ బకాయిలపై సుప్రీం కోర్టు చేసిన హెచ్చరికల కారణంగా ఇన్వెస్టర్లలో ఆందోళన తలెత్తింది. ఈ నేపథ్యంలో రానున్న కొద్దిరోజుల్లో బ్యాంకింగ్‌  షేర్ల

Most from this category