News


కొంత రిస్క్‌ తీసుకునే వారికి..

Monday 13th January 2020
personal-finance_main1578889209.png-30882

  • కెనరా రొబెకో ఎమర్జింగ్‌ ఈక్విటీస్‌

గతేడాది లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ ర్యాలీ చేస్తే, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ నష్టపోయాయి. లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారికి లాభాలు, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లో వారికి నష్టాలు మిగిలాయి. కానీ, ఇదే పనితీరు ఎల్లప్పుడూ కొనసాగదు. ఒక్కోసారి ఒక్కో విభాగం ర్యాలీ చేస్తే, మరో విభాగం నష్టపోవచ్చు. కొన్ని సందర్భాల్లో అన్ని రకాల స్టాక్స్‌తో కూడిన విస్తృత ర్యాలీ కూడా ఉంటుంది. అందుకే ఇన్వెస్టర్లు ఈ తరహా ఒక్కో విభాగం ర్యాలీ చేసిన సమయాల్లోనూ ప్రయోజనం పొందేందుకు లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ అనుకూలంగా ఉంటాయి. అలాగే, రెండు విభాగాలు ర్యాలీ చేసిన సందర్భాల్లో మరింత లాభపడొచ్చు. లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ విభాగంలో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు కెనరా రొబెకో ఎమర్జింగ్‌ ఈక్విటీస్‌ పథకాన్ని పరిశీలించొచ్చు.

పథకం రూపం..
సెబీ నిబంధనల ప్రకారం లార్జ్‌ అండ్‌ మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ ఒక్కో విభాగంలో కనీసం 35 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. కెనరా రొబెకో ఎమర్జింగ్‌ ఈక్విటీస్‌ అన్నది గతంలో మిడ్‌క్యాప్‌ ఫండ్‌. 2018లో సెబీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల వర్గీకరణల్లో మార్పుల తర్వాత లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌గా రూపం మార్చుకుంది. అంటే గతంలో మిడ్‌క్యాప్‌ పథకంగా 65 శాతం వరకు మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఎక్స్‌పోజర్‌ కలిగి ఉండేది. దాంతో రిస్క్ అధికం. ఇప్పుడు లార్జ్‌క్యాప్‌ పెట్టుబడులతోనూ ఉండడం కొంత రిస్క్‌ను తగ్గించేదే. అయితే, అదే సమయంలో ఈ పథకంలోని మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ పెట్టుబడులపై రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. కనుక మోస్తరు రిస్క్‌ తీసుకునే వారు దీర్ఘకాలం కోసం సిప్‌ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్‌ను పరిశీలించొచ్చు. 

పనితీరు
కెనరా రొబెకో ఎమర్జింగ్‌ ఈక్విటీస్‌లో ఏడాది రాబడులు 10.20 శాతంగా ఉన్నాయి. అదే మూడేళ్ల కాలంలో వార్షికంగా 14.3 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 11.5 శాతంగా ఉన్నాయి. గతంలో కేవలం లార్జ్‌క్యాప్‌ ఫండ్‌గానే ఉండడం, ప్రస్తుతం లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌గా మారినందున భవిష్యత్తు రాబడులు భిన్నంగా ఉండొచ్చు. అంటే దీర్ఘకాలానికి (5-10 ఏళ్ల కాలంలో) ఇంకాస్త మెరుగైన రాబడులను ఆశించొచ్చు. ఏడేళ్ల కాలంలో ఈ పథకం వార్షికంగా 19.65 శాతం, పదేళ్ల కాలంలో వార్షికంగా 17.77 శాతం చొప్పున రాబడులను ఇచ్చినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

పోర్ట్‌ఫోలియో
మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా రంగాలు, స్టాక్స్‌ ఎంపికను ఈ ఫండ్‌ మేనేజర్‌ చేస్తుంటారు. డైవర్సిఫైడ్‌ పోర్ట్‌ఫోలియోను ఇందులో చూడొచ్చు. బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రంగానికి పెద్ద పీట వేస్తూ 33.5 శాతం పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేయడాన్ని గమనించొచ్చు. ఆ తర్వాత సేవల రంగానికి చెందిన స్టాక్స్‌లో 10 శాతం, హెల్త్‌ కేర్‌ స్టాక్స్‌లో 8 శాతం వరకు పెట్టుబడులు ఉన్నాయి. టాప్‌ 10 స్టాక్స్‌లో మొత్తం పెట్టుబడులు 37 శాతం వరకు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ పథకంలో 48.5 శాతం పెట్టుబడులు మెగా, లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో, 47 శాతం మిడ్‌క్యాప్‌లో, 4 శాతం స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఉన్నాయి. 
టాప్‌ హోల్డింగ్స్‌
కంపెనీ    పెట్టుబడుల శాతం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు    6.95
ఐసీఐసీఐ బ్యాంకు    6.33
ఆర్‌ఐఎల్‌    4.39
యాక్సిస్‌ బ్యాంకు    4.23
హెచ్‌డీఎఫ్‌సీ    3.01
ఇన్ఫోసిస్‌    2.59
కోటక్‌ బ్యాంకు    2.47
సిటీ యూనియన్‌ బ్యాంకు    2.23
వర్ల్‌పూల్‌    2.10
జుబిలంట్‌ ఫుడ్‌    2.04



You may be interested

ఇన్ఫీపై బుల్లిష్‌!

Monday 13th January 2020

క్యు3 ఫలితాల అనంతరం బ్రోకరేజ్‌లు మూడో త్రైమాసిక ఫలితాల అనంతరం ఇన్ఫోసిస్‌ షేరుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌ అంచనాలను కొనసాగించాలని నిర్ణయించాయి. శుక్రవారం కంపెనీ అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించింది. దీంతో పలు బ్రోకరేజ్‌లు రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ చేయడం లేదా టార్గెట్‌ పెంచడం లేదా రెండూ చేయడం చేపట్టాయి. క్యు3లో కంపెనీ నికరలాభం దాదాపు 24 శాతం పెరిగింది. దీనికితోడు పూర్తి ఆర్థిక సంవత్సర రెవెన్యూ గైడెన్స్‌ను కంపెనీ పెంచింది. ఇటీవల కొందరు

యస్‌ బ్యాంక్‌ షేరు పతనం

Monday 13th January 2020

5 శాతం దిగజారిన యస్‌ బ్యాంక్‌ షేరు నిధుల సమీకరణకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ వారాంతాన సమావేశమైన బ్యాంకు బోర్డు నిధుల సమీకరణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ వెల్లడించింది. వివిధ సెక్యూరిటీల జారీ ద్వారా రూ 10,000 కోట్ల సమీకరణకు బోర్డు అనుమతించినట్లు తెలియజేసింది. అయితే ఎర్విన్‌ సింగ్‌, ఎస్‌పీజీపీ హోల్డింగ్స్‌ సంయుక్తంగా ప్రకటించిన 1.2 బిలియన్‌ డాలర్ల ఆఫర్‌ను బోర్డు తిరస్కరించినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో యస్‌

Most from this category