News


ఎథికల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా..?

Monday 16th September 2019
personal-finance_main1568606396.png-28387

ధీరేంద్ర కుమార్‌ వ్యాల్యూ రీసెర్చ్‌, సీఈవో

ప్ర: ఎథికల్‌ ఫండ్స్‌ అంటే ఏమిటి? మన మార్కెట్లో ఈ ఫండ్స్‌ ఉన్నాయా ? ఈ ఫండ్స్‌లో సామాన్య ఇన్వెస్టర్‌ ఇన్వెస్ట్‌ చేయవచ్చా ?
-శైలేంద్ర కుమార్‌, హైదరాబాద్‌ 

జ: ఎథికల్‌ ఫండ్స్‌... ఆసక్తిదాయకమైనవే. అయితే భారత్‌లో వీటికి పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదు. ఈ ఫండ్స్‌కు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పెరుగుతోంది. ఆల్కహాల్‌, పొగాకు, తదితర  నైతికం కాని వస్తువులకు సంబంధించిన కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయని ఫండ్స్‌ను ఎథికల్‌ ఫండ్స్‌గా వ్యవహరిస్తారు. ఈ ఫండ్స్‌ షరియా-నిబంధనలను కూడా పాటిస్తాయి. అంటే వడ్డీ ఆదాయం పొందే వ్యాపారాలు, భారీగా రుణాలు తీసుకుని వ్యాపారాలు నిర్వహించే కంపెనీల షేర్లలో కూడా ఈ ఎథికల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌ చేయవు. అంటే ఈ ఫండ్స్‌ బ్యాంక్‌ షేర్లకు కూడా దూరంగా ఉంటాయి. ఇలా ఈ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌ చేయడానికి కొన్ని కంపెనీలను దూరంగా ఉంచినప్పటికీ, అలా ఇన్వెస్ట్‌ చేయని కంపెనీల సంఖ్య మరీ ఎక్కువగా ఏమీ లేదు. ఈ ఫండ్స్‌ బ్యాంక్‌ షేర్లకు దూరంగా ఉండటం... ఇన్వెస్టర్లకు మేలు చేసిందనే చెప్పాలి. గత 7-8 సంవత్సరాలుగా బ్యాంకింగ్‌ షేర్లు తీవ్రంగా నిరాశపరచడం ఈ ఫండ్స్‌కు కలసివచ్చింది. ఇక మనకు అందుబాటులో రెండు ఫండ్స్‌ ఉన్నాయి. టాటా మ్యూచువల్‌ ఫండ్‌, టారస్‌ మ్యూచువల్‌ ఫండ్‌.. ఈ రెండు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ఎథికల్‌ ఫం‍డ్స్‌ను ఆఫర్‌ చేస్తున్నాయి. ఈ ఫండ్స్‌ రాబడులు బాగానే ఉన్నాయి. అయితే సామాన్య ఇన్వెస్టర్లు ఇలాంటి ట్రెండీ విషయాలకు దూరంగా ఉంటేనే మేలు. ఈ ఫండ్స్‌కు బదులుగా ఎదైనా మంచి మల్టీ-క్యాప్‌ ఫండ్‌ను ఎంచుకోండి. 

ప్ర: సెన్సెక్స్‌ ఇటీవల బాగా పతనమవుతూ వస్తోంది కదా ! మార్కెట్‌ పడుతున్నప్పుడే ఇన్వెస్ట్‌ చేయమని చాలా మంది నిపుణులు సూచిస్తుంటారు కదా ! అందుకని పెద్ద మొత్తాల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను ? నాది సరైన నిర్ణయమేనా ?
జ: మీది సరైన నిర్ణయం కాదని చెప్పవచ్చు. ఉదాహరణకు మార్కెట్‌ బాగా పడిందని  మీరు రూ. లక్ష ఏదైనా ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేశారనుకోండి. మార్కెట్‌  మరింత పతనమై ఆ  ఫండ్‌ పది శాతం పతనమైంది అనుకోండి. అప్పుడు మీకు రూ.10,000 మేర నష్టం వస్తుంది. ఒక్కసారే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేస్తే వచ్చే ప్రమాదమే ఇది. మార్కెట్‌ పడటం మొదలు పెడితే, ఎంత వరకూ పడిపోతుందో ఎవరూ అంచనా వేయలేరు. అందుకని ఈక్విటీ, ఈక్విటీ మార్కెట్‌పై ఆధారపడిన మ్యూచువల్‌ ఫండ్స్‌పై ఒకేసారి పెద్ద మొత్తాల్లో ఎప్పుడూ  ఇన్వెస్ట్‌ చేయకూడదు. దీనికి బదులుగా మీ దగ్గరున్న పెద్ద మొత్తాన్ని కనీసం 12-24 భాగాలుగా చేసి నెలకు కొంత మొత్తాన్ని సిప్‌ విధానంలో ఏదైనా మంచి ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. మార్కెట్‌ తగ్గడం, పెరగడమనేది చక్రీయమైనది. ఇలాంటి ఒడిదుడుకులను పట్టించుకోకుండా సిప్‌లను కొనసాగించండి. దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు. 

ప్ర: నేను ప్రతినెలా కొంత మొత్తాన్ని వివిధ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. నా పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ, డెట్‌ల కేటాయింపులు 70:30 నిష్పత్తిలో ఉన్నాయి. డెట్‌కు సంబంధించి బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో కాకుండా లిక్విడ్‌, ఆల్ట్రా-షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను.  ఇలా చేయవచ్చా ? 
జ: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఇన్వెస్ట్‌ చేయకండి. పన్ను పరంగా చూస్తే, అవి ఏమంత ఆకర్షణీయం కాదు. మీరు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే, ఆ డబ్బులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడం కష్టమవుతుంది. అల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌తో ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఎలాంటి షరతులు లేకుండా ఎంత మొత్తం కావాలానుకుంటే అంత మొత్తంలో డబ్బులను తీసుకోవచ్చు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో అయితే, నిర్దేశిత కాలపరిమితి కంటే ముందుగానే మీ డబ్బులను తీసుకోవాలనుకుంటే, మీరు ఎంతో కొంత జరిమానా చెల్లించాల్సి రావచ్చు. పైగా రాబడుల విషయంలో రాజీ పడాల్సి ఉంటుంది కూడా ! స్థిరాదాయ కేటాయంపుల నిమిత్తం ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే కూడా అల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌కే ప్రాధాన్యత ఇవ్వండి. You may be interested

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Monday 16th September 2019

ప్రపంచ మార్కెట్లో క్రూడ్‌ ధర భారీగా పెరగడంతో భారత్‌ స్టాక్‌ సూచీలు సోమవారం గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 180 పాయింట్ల నష్టంతో 37,205 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 84 పాయింట్ల గ్యాప్‌డౌన్‌తో 10,995 పాయింట్ల వద్ద మొదలయ్యాయి.  సౌదీ అరేబియలో రెండు చమురు ఉత్పాదక కేంద్రాలపై గత శనివారం టెర్రరిస్టులు...ద్రోణులతో జరిపిన దాడుల ప్రభావంతో సౌదీ చమురు ఉత్పాదక సామర్థ్యం 50 శాతం తగ్గుతుందని, తద్వారా చమురు ఎగుమతులు 5-6

సెన్సెక్స్‌ కీలక అవరోధం 37,810

Monday 16th September 2019

అమెరికా-చైనాల వాణిజ్య యుద్ధం ముగుస్తున్న సంకేతాలు కన్పించడం, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ తాజా ఉద్దీపన ప్రకటించడం, వచ్చేవారం అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ కూడా ఇదేబాటలో పయనించవచ్చన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లన్నీ బలంగా ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా వారాల తర్వాత విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు క్రితంవారం నికర కొనుగోళ్లు జరిపారు. అయితే దేశ జీడీపీ వృద్ధి, కార్పొరేట్ల ఫలితాల పట్ల ఇన్వెస్టర్ల ఆందోళన కారణంగా భారత్‌ మార్కెట్‌

Most from this category