News


ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా ?

Monday 3rd February 2020
news_main1580702496.png-31456

(ధీరేంద్ర కుమార్‌ సీఈవో వ్యాల్యూ రీసెర్చ్‌)

ప్ర: నేను గత కొంత కాలంగా మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. అయితే వీటి రాబడులు ఇప్పుడు అంతంతమాత్రంగానే ఉన్నాయి. వీటిల్లో నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించమంటారా ? ఆపేయమంటారా ? ఒకవేళ అపేస్తే, ఏ కేటగిరీ ఫండ్స్‌లోకి మళ్లించమంటారు?
-సిద్ధార్థ, హైదరాబాద్‌ 
జ: దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనకుంటేనే మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. కనీసం ఐదు నుంచి ఏడు సంవత్సరాలు పాటు ఇన్వెస్ట్‌ చేయగలిగి, ఈ మధ్య కాలంలో వచ్చే ఒడిదుడుకులను తట్టుకోగలిగితేనే మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ను ఎంచుకోవాలి.  ఇంత సుదీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేస్తేనే ఇవి సమంజసమైన రాబడులనిస్తాయి. రెండు, మూడేళ్ల పాటు అంతంతమాత్రం రాబడులనిచ్చినా, మార్కెట్‌ పెరుగుతున్నప్పుడు మాత్రం గతంలోని నష్టాలను కూడా పూడ్చుకొని ఆరోగ్యకరమైన రాబడులనిస్తాయి. అందుకని మీరు కనీసం ఐదు నుంచి ఏడేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయగలిగితే, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ల్లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించవచ్చు. మిడ్‌, స్మాల్‌ క్యాప్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడమనేది గత కొన్నేళ్లలోనే బాగా పెరిగింది. ఇవి మంచి రాబడులనిస్తున్నాయి కదాని చాలా మంది ఇన్వెస్టర్లు వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయడం మొదలు పెట్టారు. అయితే ప్రస్తుతం ఈ ఫండ్స్‌ పనితీరు నిరాశజనకంగా ఉండటంతో చాలా మంది ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఆపేస్తున్నారు. కొంతమంది వెనక్కి తీసుకుంటున్నారు. వేరే ఫండ్స్‌లోకి ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మళ్లిస్తున్నారు. కూడా. ముందే చెప్పినట్లుగా మీరు కనీసం ఐదు నుంచి ఏడేళ్లపాటు ఇన్వెస్ట్‌ చేయగలిగితే, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో మీ పెట్టుబడులను కొనసాగించవచ్చు. మరో ఏడాది, రెండేళ్లపాటు వీటి రాబడులు అంతంతమాత్రంగానే ఉన్నా, మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. ఒకవేళ ఈ ఫండ్స్‌ పుంజుకోవడం ప్రారంభిస్తే, మీరు మంచి రాబడులే పొందవచ్చు. మీ ఇన్వెస్ట్‌మెంట్‌ కాలం ఐదేళ్లలోపే ఉంటే, ఈ ఫండ్స్‌ నుంచి లార్జ్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌, లేదా హైబ్రిడ్‌ ఫండ్స్‌లోకి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మళ్లించండి. 

ప్ర: ఈక్విటీ ట్రేడెడ్‌ ఫండ్స్‌(ఈటీఎఫ్‌)ల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా ? ఇన్వెస్ట్‌ చేయడానికి కొన్ని మంచి ఈటీఎఫ్‌లను సూచించండి. 
-కృష్ణన్‌, చెన్నై 

జ: ఇండెక్స్‌ను ట్రాక్‌ చేసే ఫండ్స్‌ను ఈక్విటీ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌)గా చెప్పుకోవచ్చు. ఇండెక్స్‌ పనితీరును ఈ ఈటీఎఫ్‌లు ప్రతిబింబిస్తాయి. ఇవి స్టాక్‌ ఎక్స్చేంజ్‌ల్లో ట్రేడవుతాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం కంటే ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడం కొంచెం భిన్నంగా ఉంటుంది. షేర్లను కొనుగోలు చేసినట్లుగానే, ఈటీఎఫ్‌లను కొనుగోలు చేయవచ్చు. మీరు ఒక ఫండ్‌ను కొనుగోలు చేయడం కోసం రూ.10,000 ఇన్వెస్ట్‌ చేశారనుకుందాం. ఆరోజు సాయంత్రం ఉన్న ఎన్‌ఏవీ ధరకు మీకు ఆ ఫండ్‌ యూనిట్లు అలాట్‌ అవుతాయి. అదే ఈటీఎఫ్‌ విషయానికొస్తే, మీరు ఏ ధరకు కావాలనుకుంటే, ఆ ధరకు ఆర్డర్‌ పెట్టవచ్చు. ఈ ఈటీఎఫ్‌లు ట్రేడయ్యే ధరకు, ఎన్‌ఏవీలకు స్వల్పంగా తేడాలు ఉండవచ్చు. ఇక మీరు ఇన్వె‍స్ట్‌ చేయడానికి ఎస్‌బీఐ నిఫ్టీ 50 ఈటీఎఫ్‌, మోతిలాల్‌ ఓస్వాల్‌ నాస్‌డాక్‌ 100 ఈటీఎఫ్‌లను పరిశీలించవచ్చు. ఎస్‌బీఐ నిఫ్టీ 50 ఈటీఎఫ్‌కు వ్యయాలు చాలా తక్కువగా ఉన్నాయి. లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే ఈ ఈటీఎఫ్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. అంతర్జాతీయ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, నాస్‌డాక్‌ 100 ఆధారిత ఈటీఎఫ్‌-మోతిలాల్‌ ఓస్వాల్‌ నాస్‌డాక్‌ 100 ఈటీఎఫ్‌ను పరిశీలించవచ్చు. 

ప్ర: నేను ఇటీవలే రిటైరయ్యాను. కొన్ని స్మాల్‌ క్యాప్‌ ఫం‍డ్స్‌ల్లో నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఉన్నాయి. రిటైరయ్యాను కాబట్టి, ఈ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఆపేయమని మిత్రులు సూచిస్తున్నారు. నన్నేం చేయమంటారు ?
-నరసింగరావు, విశాఖపట్టణం 
జ: స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేవారికి మార్కెట్‌ పట్ల ఒకింత అవగాహన ఉండి తీరాలి. మార్కెట్‌ ఒడిదుడుకుల పట్ల అవగాహన ఉన్న వారికి స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ పనితీరు కూడా అర్థమవుతుంది. ఒక సాధారణ ఇన్వెస్టర్‌ తన మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌కు 10 శాతం కంటే మించి కేటాయించకూడదు. మీరు రిటైరైనప్పటికీ, మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 10 శాతం లోపే ఈ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ వీటి ప్రభావం మొత్తం పోర్ట్‌ఫోలియోపై పెద్దగా ఉండదు. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కూడా ఇదే రేంజ్‌లో ఉంటే నిరభ్యంతరంగా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగింవచ్చు. ఈ ఫండ్స్‌ పనితీరు అంతంతమాత్రంగానే ఉన్నా, నష్టాలు వచ్చినా, మీ పోర్ట్‌ఫోలియోలో పెద్దగా ప్రభావం పడదు కాబట్టి. పెట్టుబడులను కొనసాగించండి. మార్కెట్‌ పుంజుకుంటే గతంలో అంతంత మాత్రం రాబడులు ఇచ్చిన స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ మంచి రాబడులనే అందివ్వగలవు.  ఒక వేళ మీ మొత్తం నిధుల్లో స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌10 శాతానికి మించి ఉన్నట్లయితే అప్పుడు ఈ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ నుంచి అధిక భాగాన్ని వేరే ఫండ్స్‌లోకి మళ్లించండి. మల్టీ క్యాప్‌ లేదా అగ్రెసివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌కు ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేస్తే మంచిది. 



You may be interested

అటూఇటుగా మొదలై..లాభాల్లోకి

Monday 3rd February 2020

సెన్సెక్స్‌ లాభాల సెంచరీ నిఫ్టీ 33 పాయింట్లు అప్‌ బడ్జెట్‌ రోజు వారాంతాన కుప్పకూలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు నేటి ట్రేడింగ్‌లో కోలుకున్నాయి. అయితే తొలుత అటూఇటుగా ప్రారంభమయ్యాయి. తదుపరి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో వెనువెంటనే జోరందుకున్నాయి. ఉదయం 9.20 ప్రాంతంలో సెన్సెక్స్‌ లాభాల సెంచరీ చేసింది. 134 పాయింట్లు ఎగసి 39,870ను తాకగా.. నిఫ్టీ 33 పాయింట్లు పుంజుకుని 11,695 వద్ద ట్రేడవుతోంది. పలు సెలవుల తదుపరి ఓపెన్‌ అయిన

ఈ వారం స్టాక్‌ రికమెండేషన్లు

Monday 3rd February 2020

ఎస్‌బీఐ:    కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌ ప్రస్తుత ధర: రూ.303 టార్గెట్‌ ధర: రూ.400 ఎందుకంటే: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. రుణ నాణ్యత మెరుగుపడింది. స్థూల మొండి బకాయిలు 6.94 శాతానికి, నికర మొండి బకాయిలు 2.65 శాతానికి తగ్గాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే, మొండి బకాయిలకు కేటాయింపులు రూ.11,041 కోట్ల నుంచి రూ.8,193 కోట్లకు

Most from this category