News


క్వాంట్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా ?

Monday 23rd March 2020
personal-finance_main1584932306.png-32623

ప్ర: మార్కెట్‌ ప్రస్తుతం పతన బాటలో ఉంది కదా ! ఈ సమయంలో కూడా మ్యూచువల్‌ ఫం‍డ్స్‌లో సిప్‌లు కొనసాగించాలా ? 
జ: మార్కెట్‌ పతన బాటలో ఉన్నప్పటికీ, బుల్‌ రన్‌లో ఉన్నప్పటికీ, మ్యూచువల్‌ ఫం‍డ్స్‌లో సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) కొనసాగించడమే ఉత్తమం. బుల్‌ రన్‌ కానీ, మార్కెట్‌ పతనం కానీ ఎప్పుడు ఆగిపోతాయో ఎవరూ అంచనా వేయలేరు. ఉదాహరణకు 2,003 నుంచి 2007 వరకూ బుల్‌రన్‌ కొనసాగింది. సెన్సెక్స్‌ 2,800 పాయింట్ల నుంచి 3,000కు, ఆ తర్వాత 4,000, ఆ పైన 5,000కు, అటు తర్వాత 6,000 పాయింట్లకు ఎగసింది. దానిని బుల్‌ రన్‌గా విశ్లేషకులు గుర్తించారు. తర్వాత సెన్సెక్స్‌ 20,000 పాయింట్ల వరకూ పెరిగిపోయింది. బుల్‌ రన్‌ ఉంది కదాని సిప్‌లను ఆపేస్తే, ఈ పెరుగుదల ప్రయోజనాలను మనం మిస్‌ అయ్యే వాళ్లం కదా ! మార్కెట్‌ పతన బాటలో ఉన్నప్పటికీ, అది ఎంత కాలం ఉంటుంది ? ఎంత కాలం కొనసాగుతుంది ? ఇలాంటి విషయాలను మనం అంచనా వేయలేం. మార్కెట్‌ దశలపై మన అంచనాలు ఒక్కోసారి విఫలమవుతూ ఉంటాయి. అందుకని దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధన కోసం సిప్‌లను కొనసాగించడమే మంచిది. మార్కెట్‌ బుల్‌ రన్‌లో ఉన్నప్పుడు విలువలు బాగా పెరిగిపోతాయని, మార్కెట్‌ పతనమైనప్పుడు పెట్టుబడుల విలువ క్షీణిస్తుందనే భయం సాధారణంగా ఇన్వెస్టర్లలో ఉంటుంది. అలాగే మార్కెట్‌ పతన బాటలో ఉన్నప్పుడు ఎంత కాలం పతనం కొనసాగుతోంతో, పెట్టుబడుల విలువ ఎంత మేర తగ్గుతుందో అనే భయాలూ ఉంటాయి. అందుకని బుల్‌రన్‌ ఉన్నప్పుడు ఒకింత లాభాలు స్వీకరించండి. పతన బాటలో ఉన్నప్పుడు మరింతగా పెట్టుబడులు పెట్టండి. అవసరమనుకుంటే మీ పోర్ట్‌ఫోలియోను మార్కెట్‌ దశలను బట్టీ రీ బ్యాలన్స్‌ చేస్తూ ఉండండి. ఇలా రీ బ్యాలన్స్‌ చేసేటప్పుడు ఎగ్జిట్‌ లోడ్‌, పన్ను భారం అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 

ప్ర: నేను గత కొంతకాలంగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను.  నా పోర్ట్‌ఫోలియోలో మొత్తం ఎనిమిది మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉన్నాయి. వీటిల్లో ఐసీఐసీఐ ప్రు వేల్యూ డిస్కవరీ పనితీరు గత కొంత కాలంగా సరిగ్గా లేదు. నా మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌ల్లో 20 శాతం ఈ ఫండ్‌లోనే ఉన్నాయి. ఈ ఫండ్‌లో నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకొని యాక్సిస్‌ ఫోకస్డ్‌ 25కు బదిలీ చేయాలనుకుంటున్నాను. తగిన సూచనలు ఇవ్వండి.?
 

జ: ఐసీఐసీఐ ప్రు వేల్యూ డిస్కవరీ ఫండ్‌ అనుసరిస్తున్న ఇన్వెస్ట్‌మెంట్‌ వ్యూహం ఫలించాలంటే చాలా ఓపిక అవసరం. గత రెండు, మూడేళ్లుగా ఈ ఫండ్‌ పనితీరు అంతంతమాత్రంగానే ఉందనే విషయం వాస్తవమే. ఆరంభంలో ఈ ఫండ్‌ మంచి పనితీరునే కనబరిచింది. ఈ ఫండ్‌ అనుసరిస్తున్న విలువ ఆధారిత మదపు వ్యూహం గత రెండు, మూడేళ్లుగా మంచి ఫలితాలనివ్వడం లేదు. ఈ కాలంలో వచ్చిన ఒకే ఒక మార్పు- ఈ ఫండ్‌ సైజ్ పెరగడం. ఈ ఫండ్‌లో ఎక్కువగా లార్జ్‌ క్యాప్‌ కంపెనీ షేర్లే ఉన్నాయి. ఈ ఫండ్‌ విషయంలో మీ ఓపిక నశించినట్లు ఉంది. అయితే మీ మొత్తం పెట్టుబడుల్లో ఈ ఫండ్‌ వాటా 20 శాతమే కాబట్టి. మీరు మరికొంత కాలం ఓపిక పట్టవచ్చు. అంచనాలు తక్కువగా ఉన్నప్పుడే, అనుకోని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ ఫండ్‌ పనితీరు మెరుగుపడే అవకాశాలు అధికంగానే ఉన్నాయి. మరి కొంత కాలం నిరీక్షించండి. 

ప్ర:  నేను కొన్ని మల్టీ-క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. అల్గారిథమ్‌ ఆధారిత క్వాంట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా ? 
జ: అల్గారిథమ్‌ ఆధారిత ‍క్వాంట్‌ ఫండ్స్‌ విదేశాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. మన దేశంలో వీటి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అల్గారిథమ్‌ అధారిత వ్యూహాలు మంచి ప్రయోజనాలు ఇచ్చాయన్న అవగాహనకు రావడానికి ఇప్పటికైతే ఎక్కువగా ఆధారాలు లేవు. ఇవి నిలకడగా రాణిస్తాయని నమ్మకంగా చెప్పదగ్గ పరిస్థితులు కూడా లేవు. కొన్ని ఫండ్స్‌ మంచి రాబడులనే ఇచ్చినా, వీటిపై ఒక అంచనాకు రావడానికి మరికొంత కాలం పడుతుంది. వీటిల్లో చాలా ఫండ్స్‌ వేల్యూ లేదా గ్రోత్‌ ఓరియంట్‌ ఫం‍డ్స్‌. వీటిల్లో ఉన్న ఒక సానుకూలాంశం... ఏ సమయంలోనైనా ఇవి తమ మదుపు వ్యూహాన్నే కొనసాగిస్తాయి. అందుకని వీటి పనితీరుపై మనం  ముందుగానే ఒక అంచనాకు రావచ్చు. మొత్తం మీద వీటిపై పూర్తి స్పష్టత లేదని చెప్పవచ్చు. ​‍అల్గారిథమ్‌ క్వాంట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలని మీకు బలంగా ఉంటే, మీ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పది శాతానికి మించకుండా ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. You may be interested

స్టాక్స్‌లో నష్టపోకూడదంటే..?

Monday 23rd March 2020

కొన్ని తప్పులకు దూరంగా ఉండాలి అనుకూల సమయం ఎప్పుడదన్నది చెప్పలేం అప్పటి వరకూ వేచి చూస్తేనే లాభాలు స్థాయిని మించి రిస్క్‌ తీసుకుంటే ప్రమాదమే వైవిధ్యం లేకపోతే నష్టాలకు చాన్స్‌ తగినంత అధ్యయనం లేకుండా ఇన్వెస్ట్‌ చేయరాదు సంపద కూడబెట్టుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. అందులో ఈక్విటీలది అగ్ర తాంబూలం. మార్కెట్‌ పతనాలే మంచి పెట్టుబడి అవకాశాలను తెచ్చిపెడతాయి. గతంలో భారీ పతనాలు ఎన్నో వచ్చి వెళ్లాయి. ఈక్విటీ మార్కెట్లు పడి లేచిన బంతి మాదిరిగా ఆ పతనాల నుంచి

సెన్సెక్స్‌ ప్రధాన మద్దతు 26,714 పాయింట్లు

Monday 23rd March 2020

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను జీరో స్థాయికి తగ్గించినప్పటికీ, గతవారం అటు అమెరికా గానీ, ఇటు ఇండియాగానీ 12 శాతం మార్కెట్‌ నష్టాన్ని చవిచూసాయి. ఈ తరుణంలో శుక్రవారం మన మార్కెట్‌ ముగిసిన తర్వాత...షార్ట్‌ సెల్లింగ్‌పై నియంత్రణలు విధిస్తున్నట్లు సెబి ప్రకటించింది. ఇటువంటి నియంత్రణలు ఏ దేశంలోనూ సానుకూల ప్రభావాన్ని చూపించిన దాఖలాలు లేవు. 2001లో ఇండియాలో కూడా షార్ట్‌ సెల్లింగ్‌ని నిషేదించిన తర్వాతి రోజుల్లో

Most from this category