News


నేరుగా ఎన్‌సీడీల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా ?

Monday 8th July 2019
personal-finance_main1562561857.png-26882

ప్ర: నేను గత నాలుగేళ్లుగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ప్రస్తుతం నా పోర్ట్‌ఫోలియోలో మొత్తం 20కి పైగా ఫండ్స్‌ ఉన్నాయి. ఈ సంఖ్యను సగనికైనా తగ్గించుకొమ్మని మిత్రులంటున్నారు. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి. 
-సురేశ్‌, విజయవాడ 

జ: మీ మిత్రులు చెప్పింది నిజమే. మీ పోర్ట్‌ఫోలియోలో ఫండ్స్‌ సంఖ్యను కనీసం నాలుగో వంతుకైనా తగ్గించుకుంటే మంచిది. ఈక్విటీలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేస్తే ఎలాంటి రాబడులు వస్తాయో, 3–4 మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసినా అదే రాబడులు పొందవచ్చు. సాధారణంగా డైవర్సిఫికేషన్‌ కోసం మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తారు. డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు పొందడం కోసం గరిష్టంగా ఐదు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే సరిపోతుంది. కానీ మీ పోర్ట్‌ఫోలియోలో 20కి పైగా ఫండ్స్‌ ఉన్నాయంటే డైవర్షిఫికేషన్‌ కూడా బాగా ఎక్కువగా ఉన్నట్లు అర్థం. ఇంత అధికమైన డైవర్సిఫికేషన్‌ అవసరం లేదు. పైగా ఫండ్స్‌ అధికంగా ఉండడం వల్ల మీరు ఫండ్‌ నిర్వహణ చార్జీలు కూడా అధికంగానే చెల్లించాల్సి ఉంటుంది. మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఫండ్స్‌ అన్నింటిపై మీకు ఆసక్తి ఉంటుంది. కానీ, ఏ ఫండ్‌పై పూర్తి అవగాహన ఉండదు. పైగా అన్ని ఫండ్స్‌ గురించి పట్టించుకోవడం కాలహరణం తప్ప మరేమీ కాదు. అందుకని మీ పోర్ట్‌ఫోలియోలోని ఫండ్స్‌ సంఖ్యను కుదించండి. ఫండ్స్‌ పోర్ట్‌ఫోలియోలు దగ్గర, దగ్గరగా, దాదాపు ఒకటేగా  ఉన్న వాటి నుంచి వైదొలగండి. మీ పోర్ట్‌ఫోలియోలో లార్జ్‌ క్యాప్, స్మాల్‌ క్యాప్, మల్టీ క్యాప్‌ ఫండ్స్‌ ఉండేలా చూసుకోండి. 


ప్ర: నేను అత్యవసర నిధి నిమిత్తం కొంత డబ్బులు పోగేసాను. ఈ మొత్తాన్ని ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి ? 
-సుచరిత, హైదరాబాద్‌ 

జ: మీ కుటుంబానికి ఆరు నెలల పాటు అవసరమయ్యే ఖర్చులను లెక్కేసి అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఉద్యోగం కోల్పోయినా, మరో ఉద్యోగం దొరికేదాకా  ఈ అత్యవసర నిధి మిమ్ములను ఆదుకుంటుంది. ఈ అత్యవసర నిధిని వివిధ స్థాయిల్లో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. మీ తల్లిదండ్రులు మీ వద్దే ఉన్నా, మీకు ఇంటర్, ఆపై చదువులు చదివే పిల్లలున్నా, కనీసం రూ.20,000 చేతిలో ఉంచుకోండి. ఇది మొదటి లెవల్, ఇక రెండో లెవల్‌... రూ.15,000–20,000 మొత్తాన్ని బ్యాంక్‌ సేవింగ్స్‌ ఖాతాలో ఉంచుకోండి. ఈ డబ్బును ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఏటీఎమ్‌ కార్డ్‌ ద్వారా తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక మూడో స్థాయిలో కనీసం రూ.30,000 వరకూ అల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ లేదా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. ఒకటి లేదా రెండు రోజుల్లో మీరు ఈ ఫండ్స్‌ నుంచి పెట్టుబడుల్ని నగదుగా మార్చుకోవొచ్చు. 

ప్ర: ఇటీవలి కాలంలో డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పెద్దగా రాణించడం లేదు కదా ! అందుకని నేను హౌసింగ్‌ ఫైనాన్స్, తయారీ రంగ కంపెనీల నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లు(ఎన్‌సీడీ)లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా ? 
-వంశీ, విశాఖపట్టణం 

జ: కొన్ని కంపెనీల సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల డెట్‌ ఫండ్స్‌ బాగా దెబ్బతిన్నాయి. ఫలితంగా ఎఫ్‌ఎమ్‌పీలు తమ ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన మొత్తాలను వాయిదా వేస్తున్నాయి. ఫలితంగా ఎఫ్‌ఎమ్‌పీల పట్ల ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొన్నది. అయితే రాబడులు తగ్గడమో, లేదా స్వల్పంగా నష్టాలు రావడమో తప్పితే, ఇన్వెస్టర్లు తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను నష్టపోయే అవకాశాలు లేవని చెప్పవచ్చు. ఇక ఎన్‌సీడీల్లో నేరుగా ఇన్వెస్ట్‌ చేసే విషయానికొస్తే, దురదృష్టవశాత్తూ మీరు ఇన్వెస్ట్‌ చేసిన ఎన్‌సీడీలను జారీ చేసిన కంపెనీకి ఏమైనా అయితే మీరు ఇన్వెస్ట్‌ చేసిన మొత్తాన్ని మీరు నష్టపోవలసి వస్తుంది. అదే మ్యూచువల్‌ ఫండ్‌ విషయానికొస్తే, మీరు ఇన్వెస్ట్‌ చేసిన ఫండ్‌ తన నిధులను కనీసం పది నుంచి పదిహేను కంపెనీల సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. కాబట్టి ఒక కంపెనీ దివాలా తీసినా ఆ మేరకు అంటే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కొంత భాగం మాత్రమే ఆ  ప్రభావం ఉంటుంది. అందుకని ఎన్‌సీడీల్లో నేరుగా ఇన్వెస్ట్‌ చేయకుండా ఉంటేనే బాగుంటుంది. అయితే హెచ్‌డీఎఫ్‌సీ, సుందరమ్‌ ఫైనాన్స్‌ వంటి కంపెనీల ఎన్‌సీడీల్లో ఎలాంటి సంశయం లేకుండా ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఇలాంటి కంపెనీలు 30–40 ఏళ్లపాటు ఎన్‌సీడీలను సకాలంలో రిడీమ్‌ చేస్తూ, ఇన్వెస్టర్లకు మంచి రాబడులనే ఇస్తున్నాయి.  అయితే ఇలాంటి కంపెనీలు తక్కువగానే ఉన్నాయి. అందుకని ఎన్‌సీడీల్లో నేరుగా ఇన్వెస్ట్‌ చేయాలనే ఆలోచన మానుకోండి. మరోవైపు డెట్‌ ఫండ్స్‌ల్లో మొత్తం 16 కేటగిరీల ఫండ్స్‌ ఉన్నాయి. వీటిల్లో లిక్విడ్‌ ఫండ్స్, అల్ట్రా షార్ట్‌ డ్యురేషన్, లేదా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌లో మాత్రమే ఇన్వెస్ట్‌ చెయ్యండి. You may be interested

స్టాక్స్‌ వ్యూ

Monday 8th July 2019

నెస్లే ఇండియా    కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌ ప్రస్తుత ధర: రూ.11,920 టార్గెట్‌ ధర: రూ.13,000 ఎందుకంటే: ఈ కంపెనీ ఈ ఏడాది జనవరి-మార్చి క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు బాగున్నాయి. నికర అమ్మకాలు 9 శాతం వృద్ధితో రూ.3,003 కోట్లకు పెరిగాయి. వివిధ కేటగిరీల్లో కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తేవడంతో అమ్మకాలు పెరిగాయి. నిర్వహణ లాభం 6 శాతం వృద్ధితో  రూ.738 కోట్లకు పెరిగింది. మార్జిన్లు మాత్రం 71 బేసిస్‌ పాయింట్లు తగ్గి 24.6

సెన్సెక్స్‌ మద్దతు శ్రేణి 39,320-39,090

Monday 8th July 2019

బడ్జెట్‌ అంచనాలు, ప్రపంచ మార్కెట్ల సానుకూల పవనాల కారణంగా గతవారం తొలి నాలుగురోజులూ క్రమేపీ పెరిగిన మన మార్కెట్‌...బడ్జెట్‌ ప్రతిపాదనలు నిరుత్సాహపర్చడంతో వారంలో ఆర్జించిన లాభాల్లో చాలావరకూ కోల్పోయింది. మరోవైపు అమెరికాలో తాజాగా వెలువడిన జాబ్స్‌ డేటాతో ఫెడ్‌ వడ్డీ రేట్లు తగ్గవన్న అంచనాల్ని ఏర్పర్చడంతో గత శుక్రవారం అమెరికా, యూరప్‌ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఈ అంశాల ప్రభావం ఈ వారం ప్రారంభంలో మన మార్కెట్‌పై పడవచ్చు.

Most from this category