News


అప్పు చేసి కారు కొనచ్చా..?

Monday 11th November 2019
Markets_main1573442341.png-29486

ప్ర: నేను ఇప్పటికే మిడ్, లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేశాను. స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఈ ఫండ్స్‌ల్లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో 12-13 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. నాది సరైన మదుపు వ్యూహమేనా ?
-ఇంతియాజ్‌, ఈ మెయిల్‌ ద్వారా 
జ: పదేళ్లకు మించి ఇన్వెస్ట్‌ చేయడానికి మ్యూచువల్‌ ఫండ్స్‌ మంచి సాధనాలు. మీరు ఇప్పటికే మిడ్‌, లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేశారు. కాబట్టి స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ల్లో సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) ద్వారా ఇన్వెస్ట్‌ చేయాలనుకోవడం సరైన వ్యూహమే. అయితే స్టాక్‌ మార్కెట్‌లో తీవ్రమైన హెచ్చుతగ్గులు సహజం. ఈ ఒడిదుడుకులకు తట్టుకోగలిగిన ఓర్పు, నేర్పు, సహనం మీకు ఉండాలి. ఈ సందర్భంంగా మీకు 2008 నాటి ఆర్థిక సంక్షోభం నాటి విషయాలను గుర్తు చేయడం సందర్భహితమే. అప్పుడు లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌ 40 శాతం, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ 60 శాతం మేర నష్టపోగా, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ 70 శాతానికి పైగా నష్టపోయాయి. ఒక స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌ అయితే ఏకంగా 85 శాతం నష్టపోయింది. అంటే మనం రూ.100 ఇన్వెస్ట్‌ చేస్తే, దాని విలువ రూ.15కు పడిపోయింది. ఇలాంటి అధ్వాన పరిస్థితులు వస్తాయని, ఇలా వచ్చినా తట్టుకోగలనని మీకు అనిపిస్తే, ఈ వ్యూహంతో ముందుకు సాగండి. మార్కెట్‌ పతన బాటలో ఉన్నా అధైర్యపడకుండా మీ సిప్‌లను కొనసాగించండి. అయితే 2008 నాటి పరిస్థితులు ఇప్పట్లో రాకపోవచ్చు. వస్తాయనే ఉద్దేశంతో మానసికంగా సిద్దం కావడం మంచిదే కదా !


ప్ర: నాకు ఇటీవలనే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చింది. నాకు పొదుపు చేయాల్సిన, ఆదా చేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ, ప్రతి నెలా నా జీతంలో కొంత మొత్తాన్ని (రూ.2,000-రూ.3,000) వరకూ 15-20 ఏళ్ల వరకూ ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. నా ఇన్వెస్ట్‌మెంట్‌ను ఎలా ప్లాన్‌ చేసుకోవాలో సూచనలివ్వండి. 
-కిరణ్‌, విశాఖపట్టణం 
జ: మీరు మొదటిసారిగా ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. కాబట్టి ముందాగా మ్యూచువల్‌ ఫండ్స్‌తో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మొదలు పెట్టండి. మీ సంవత్సరాదాయం ఆదాయపు పన్ను పరిమితిని మించిందనుకోండి. పన్ను ఆదా కోసం మీరు గరిష్టంగా రూ. లక్షన్నర వరకూ ట్యాక్స్‌ సేవింగ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ట్యాక్స్‌ సేవింగ్‌ ఫండ్‌లో మీరు ఇన్వెస్ట్‌ చేసే మొత్తాన్ని మీ ఆదాయం నుంచి తగ్గించి, పన్ను లెక్కిస్తారు. (మీరు ఎంత ఇన్వెస్ట్‌ చేసినా, రూ. లక్షన్నర మాత్రమే మినహాయిస్తారు). అందుకని మీరు నిర్ణయించుకున్నట్లే ఏదైనా ట్యాక్స్‌ సేవింగ్‌ ఫండ్‌ను ఎంచుకొని క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌ చేయండి. ట్యాక్స్‌ సేవింగ్స్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కు మూడేళ్ల లాక్-ఇన్‌ పీరియడ్‌ ఉంటుంది. అంటే మూడేళ్ల దాకా మీరు మీ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి లేదు. మీరు 15 ఏళ్లకు మించి ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారు. కాబట్టి. ఈ లాక్‌-ఇన్‌ పీరియడ్‌ పెద్ద ఇబ్బంది, అడ్డంకి కాబోదు. ఇలా ఇన్వెస్ట్‌ చేయడం వల్ల మీకు పన్ను రాయితీ కూడా లభిస్తుంది. పన్ను ఆదా చేయడమంటే నా దృష్టిలో డబ్బు సంపాదించడమే. 
ఒక వేళ మీరు ఆదాయపు పన్ను పరిధిలోకి రాకుంటే, ఏదైనా ఒక హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ను ఎంచుకొని, దాంట్లో క్రమం తప్పకుండా సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌)ల ద్వారా ఇన్వెస్ట్‌ చేయండి. ప్రతి ఏడాది మీకు ఎంతో కొంత జీతం పెరుగుతుంది కదా ! దానికి తగ్గట్లే మీ సిప్‌ మొత్తాన్ని కూడా ప్రతి ఏడాది పెంచండి. తర్వాతి కాలంలో మీ ఆదాయాన్ని బట్టి మరో హైబ్రిడ్‌ ఫండ్‌నో లేదా ట్యాక్స్‌ సేవింగ్‌ ఫండ్‌నో ఎంచుకోండి. మార్కెట్‌ పెరిగినా, తరిగినా, సిప్‌లను కొనసాగించండి. 

ప్ర: నేను సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. రుణం తీసుకొని కారు కొనుగోలు చేయాలనుకుంటున్నాను. నా డౌన్‌ పేమెంట్‌ ఎంత ఉండాలి ?
-సంధ్య, హైదరాబాద్‌

జ: అసలు కారు కొనుగోలు చేయడం అవసరమా ? కాదా అనేది ముందు నిర్ణయించుకోండి. మీరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరే కాబట్టి చాలా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అదీ కాకుండా మీరు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. కాబట్టి మీ రవాణా అవసరాలకు ఓలా, ఉబెర్‌ వంటి వాటిని ఉపయోగించుకోవచ్చు. అలా కాకుండా కారు కొనుగోలు చేయడం తప్పనిసరి అయి,  అత్యవసరంగా కొనుగోలు చేయవలసిన పరిస్థితి ఉంటే, నాలుగైదు ఫైనాన్స్‌ సంస్థలను వాకబు చేసి మీ ఆదాయ స్థితిగతులకు తగ్గుట్లుగా తగిన ప్లాన్‌ను ఎంచుకోండి. ఒకవేళ కారు కొనుగోలు చేయడం తప్పనిసరి అయి, కొనుగోలు చేయడానికి ఏడాది లేదా రెండేళ్ల సమయం ఉన్నట్లయితే, ఇప్పటినుంచి కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేయడం ప్రారంభించండి. ఒక విధంగా ఇది రివర్స్‌ ఈఎమ్‌ఐ మెథడ్‌ అని చెప్పవచ్చు. అంటే కారు కొంటే, మనం చెల్లించే ఈఎమ్‌ఐలను ముందుగానే ఇన్వెస్ట్‌ చేయడమన్నమాట. అప్పు తీసుకొని కొనుగోలు చేసే ముందు ఒక విషయం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. మనం కొనుగోలు చేసే వస్తువు, వినియోగానికా లేదా ఆస్తి సమకూర్చుకోవడానికా అనేది కీలకం. వినియోగం కోసమైతే, అప్పు తీసుకొని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఆస్తి సమకూర్చుకోవడం కోసమైతే, అప్పు చేయవచ్చు. ఉదాహరణకు మీరు ఇల్లు కొనుగోలు చేయాలనుకోండి. ఈ ఆస్తి కోసం అప్పు చేయవచ్చు. దీని వల్ల మీరు చెల్లించే అద్దె ఆదా అవుతుంది. పైగా గృహ రుణం తీసుకుంటే పన్ను ప్రయోజనాలూ లభిస్తాయి. కారు ఆస్తి కాదు. వినియోగం కిందకు వస్తుంది కాబట్టి రుణం తీసుకొని కారు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. వినియోగిస్తున్న కొద్దీ దీని విలువ తరిగిపోతూ ఉంటుంది. పైగా దీనికి వడ్డీ చెల్లింపులు అదనపు భారం. You may be interested

ఈసారి 'దావోస్‌'కు భారీ సన్నాహాలు

Monday 11th November 2019

జనవరిలో డబ్ల్యూఈఎఫ్ 50వ వార్షిక సదస్సు భారత్ నుంచి 100 మంది పైగా సీఈవోలు,  రాజకీయ నేతలు, బాలీవుడ్ స్టార్స్‌ న్యూఢిల్లీ: వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) 50వ వార్షిక సదస్సు కోసం భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి 24 దాకా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ఈ సదస్సులో భారత్ నుంచి 100 మంది పైగా సీఈవోలు, పలువురు రాజకీయ నేతలు, దీపికా పదుకునె వంటి బాలీవుడ్ స్టార్స్

ఈ వారం స్టాక్స్‌ రికమెండేషన్లు

Monday 11th November 2019

ఇంజినీర్స్‌ ఇండియా    కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ ప్రస్తుత ధర: రూ.106 టార్గెట్‌ ధర: రూ.157 ఎందుకంటే: ఈ ప్రభుత్వ రంగ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో నిలకడైన పనితీరు సాధించింది. ఆదాయం 6 శాతం వృద్ధి చెంది రూ.720 కోట్లకు పెరిగింది. కన్సల్టెన్సీ విభాగం ఆదాయం 7 శాతం, టర్న్‌కీ ప్రాజెక్ట్‌ విభాగం ఆదాయం 6 శాతం చొప్పున పెరిగాయి. కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు కారణంగా నికర లాభం 53

Most from this category