News


2020లో మార్కెట్లు ఎలా ఉండొచ్చు..?

Tuesday 31st December 2019
personal-finance_main1577813693.png-30568

నూతన సంవత్సరంలో ఇన్వెస్టర్లు ఏ రంగాలను నమ్ముకోవచ్చు..? 2020లో ర్యాలీకి అవకాశం ఉన్న రంగాలేవి..? ఏ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా అధిక రాబడులు పొందొచ్చు? ఇలాంటి ఎన్నో సందేహాలను తొలగించే విధంగా 2020పై పీజీఐఎం ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ సీఐవో శ్రీనివాస్‌ రావూరి ఓ వార్తా పత్రికకు రాసిన కాలమ్‌లో స్పష్టతనిచ్చారు (ఆయన మాటల్లోనే).  డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమెరికా అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యాపారాన్ని పీజీఐఎం మ్యూచువల్‌ ఫండ్‌ గతంలో కొనుగోలు చేసింది. 

 

భవిష్యత్తుకు నిదర్శనం
స్టాక్‌ మార్కెట్లు నేటి కంటే భవిష్యత్తునే ప్రతిఫలిస్తాయి. ఎవరైనా ఒక కంపెనీ ఈక్విటీలో ఇన్వెస్ట్‌ చేస్తున్నారంటే ఎదురయ్యే ముఖ్యమైన ప్రశ్న ఆ కంపెనీ భవిష్యత్తు అవకాశాలు ఏ విధంగా ఉంటాయనే. అంతేకానీ, ప్రస్తుత త్రైమాసికం లేదా గత త్రైమాసికంలో ఏ విధమైన పనితీరు చూపించిందన్నది కాదు. అయితే, గత పనితీరు ముఖ్యమైనదే. కానీ, భవిష్యత్తులో కంపెనీ లాభాల వృద్ధి ఏ విధంగా ఉంటుందన్నది స్టాక్‌ ధరలను నడిపించే ముఖ్యమైన అంశం అవుతుంది. 2019 మన దేశానికి, కార్పొరేట్‌ ఇండియాకు ఆశాజనకంగా లేదన్నది నిజమే. అయితే 2020 నుంచి ఆర్థిక వ్యవస్థ, కార్పొరేట్లకు పరిస్థితులు అనుకూలంగా మారతాయని మార్కెట్‌ అంచనా వేస్తోంది.  

 

బుల్‌ మార్కెట్‌?
జీడీపీ వృద్ధి 2003 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 4 శాతానికి పడిపోగా, స్టాక్‌ మార్కెట్‌ 2003లో రెట్టింపైంది. అంతేకాదు ఆ తర్వాత బుల్‌మార్కెట్‌ ఆరంభమై 2008లో గరిష్ట స్థాయికి చేరింది. అయితే ఒక వర్గం ఆశావాదులు తదుపరి బుల్‌ మార్కెట్‌ ఆరంభంలో ఉన్నామని భావిస్తున్నారు. 2003 నుంచి 2007 మధ్య బుల్‌ మార్కెట్‌.. అంతర్జాతీయంగా కమోడిటీలు, స్టాక్‌ మార్కెట్లతో కూడిన సమకాలిక ర్యాలీ కారణంగా చోటు చేసుకుంది. కానీ, ప్రస్తుత వాతావరణం దేశీయంగా, అంతర్జాతీయంగా అటువంటి ర్యాలీకి ఆరంభంలో లేదని మేం భావిస్తున్నాం. కనుక అటువంటి ర్యాలీ పునరావృతం అవుతుందని అనుకోవడం లేదు. కనుక అంచనాలు తక్కువగా ఉంచుకోవడమే మంచిది. 

 

పరిస్థితులు మెరుగుపడతాయా..?
ఆర్థిక వృద్ధి క్షీణతలో కనిష్ట స్థాయి ముగిసిందా, రానున్న త్రైమాసికాల్లో పురోగతి ఉంటుందా? లేక ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో, ఉద్యోగాల కల్పన, ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం, రుణాల్లో తక్కువ వృద్ధి వంటి సవాళ్ల నేపథ్యంలో వృద్ధి రేటు 5 శాతం వద్దే ఉంటుందా? అన్నది ప్రశ్న. మార్కెట్లు మాత్రం పరిస్థితులు ఇప్పటి నుంచి మెరుగుపడతాయనే ఆశిస్తున్నాయి. 2019లో తక్కువ బేస్‌, డిమాండ్‌లో స్వల్ప మెరుగుదల, తక్కువ రుణ వ్యయాలు, తక్కువ పన్ను రేట్లు వంటివి 2020లో కంపెనీల మంచి ఎర్నింగ్స్‌కు కారణమవుతాయి. అయితే, మార్కెట్లు నిలకడగా ఉండాలంటే, ఆర్థిక వ్యవస్థ పరంగా, పెట్టుబడుల రాక పరంగా పరిస్థితులు కొంత మెరుగుపడాలి. వ్యక్తిగత పన్ను ఆదాయం తగ్గింపు సహా ప్రభుత్వం పలు చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందన్నది స్పష్టం. మల్టీక్యాప్‌ ఫండ్స్‌కు మేం ప్రాధాన్యం ఇస్తాం. ఫార్మా, కెమికల్స్‌, యుటిలిటీల పట్ల అధిక వెయిటేజీతో ఉన్నాం. ఎఫ్‌ఎంసీజీ, ఆటోరంగానికి మా ప్రాధాన్యం తక్కువ.  You may be interested

కొత్త ఏడాదిలో పండుగ చేసుకోవచ్చా.?

Tuesday 31st December 2019

మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఎప్పుడు ర్యాలీ చేస్తాయి..? అని ఆశగా ఎదురు చూస్తున్న ఇన్వెస్టర్లు గుడ్‌ న్యూస్‌. 2020లో నాణ్యమైన మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ మంచి ర్యాలీ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు భావిస్తు‍న్నారు. 2019 పూర్తిగా ఇండెక్స్‌లోని నాణ్యమైన స్టాక్స్‌దే హవా అని చెప్పుకోవాలి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌లో లాభాలు ఇచ్చినవీ ఉన్నాయి. కానీ వాటి సంఖ్య చాలా తక్కువ. దీంతో బ్రోడర్‌ మార్కెట్లు ర్యాలీలో పాల్గొనలేదు. ప్రభుత్వం ఆర్థిక

రూ.100 లక్షల కోట్ల ఇన్‌ఫ్రా ప్రణాళిక ఇదిగో: నిర్మలా సీతారామన్‌

Tuesday 31st December 2019

మరో రూ. 3 లక్షల కోట్ల ప్రాజెక్టులు రెడీ చేస్తాం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జాతీయస్థాయిలో చేపట్టే 102 లక్షల కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రణాళికను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆవిష్కరించారు. ప్రధాని పేర్కొన్న 2024 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీని సాధించే దిశగా ఈ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. ఈ ప్రణాళిక రూపకల్పన కోసం ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నేతృత్వంలో ఒక టాస్క్‌ఫోర్స్‌

Most from this category