News


ఫండ్స్‌లో వేటిల్లోకి అధిక పెట్టుబడులు?

Tuesday 26th November 2019
personal-finance_main1574707748.png-29845

పనితీరే గీటురాయి.. మ్యూచువల్‌ ఫండ్స్‌కు కూడా ఇదే వర్తిస్తుంది. పథకాల రాబడుల పనితీరును ఇన్వెస్టర్లు పరిశీలించి, సంతృప్తి చెందిన తర్వాతే ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. గతంలో అయితే ఏజెంట్లు, బ్రోకర్లు చెప్పిన వాటిల్లో ఇన్వెస్ట్‌ చేసే వారు. యాక్టివ్‌ నిర్వహణతో కూడిన ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకాల్లోకి వస్తున్న పెట్టుబడుల ప్రవాహాన్ని పరిశీలించినట్టయితే.. నిలకడైన రాబడుల చరిత్ర ఉన్న వాటిల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. 

 

39 అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు (ఏఎంసీలు) యాక్టివ్‌ ఈక్విటీ ఫండ్స్‌ను నిర్వహిస్తున్నాయి. వీటిల్లో కోటక్‌, మిరే అస్సెట్‌, యాక్సిస్‌ ఏఎంసీలు సగం మేర పెట్టుబడులను ఆకర్షిస్తుండడం గమనార్హం. అక్టోబర్‌ నెలలో రూ.6,027 కోట్లు ఈక్విటీ పథకాల్లోకి రాగా, ఇందులో సగానికంటే ఎక్కువ ఈ మూడు ఏఎంసీలకు చెందిన పథకాలే ఆకర్షించాయి. ఆస్తుల నిర్వహణ పరంగా టాప్‌-5 అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల్లో ఈ మూడింటిలో ఒక్కటీ లేదు. అయినా అధిక పెట్టుబడులను ఆకర్షించగలుగుతున్నాయని అనలిస్టులు పేర్కొంటున్నారు. అంటే ఇన్వెస్టర్లు పథకాల పనితీరును దగ్గరగా పరిశీలిస్తూ పెట్టుబడులపై నిర్ణయం తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ‘‘ఈ ఫండ్స్‌ సంస్థలు పరీక్షా కాలాలను తట్టుకుని నిలబడ్డాయి. గత కొన్ని సంవత్సరాల్లో నాణ్యమైన స్టాక్స్‌ బాగా పెరగ్గా, మిడ్‌క్యాప్‌, స్మాల్ క్యాప్స్‌లో అది లేదు’’ అని మార్నింగ్‌స్టార్‌ ఇండియా రీసెర్చ్‌ హెడ్‌ కౌస్తభ్‌ బేలపుర్కార్‌ అన్నారు. ర్యాలీ కేవలం కొన్ని స్టాక్స్‌కే పరిమితమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

 

లార్జ్‌క్యాప్‌ విభాగంలో యాక్సిస్‌ బ్లూచిప్‌ ఫండ్‌, మిరే లార్జ్‌క్యాప్‌ ఫండ్‌ మూడు, ఐదేళ్ల కాలంలో మెరుగైన పనితీరు చూపించాయి. లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ విభాగాల్లోనూ మిరే పనితీరుతో అగ్రస్థానంలో ఉంది. ఏడాది కాల పనితీరు విషయంలో యాక్సిస్‌ గ్రోత్‌ అపార్చునిటీస్‌ నంబర్‌ 1గా నిలిచింది. లార్జ్‌క్యాప్‌ కేటగిరీలో యాక్సిస్‌ బ్లూచిప్‌, ఐసీఐసీఐ ప్రు బ్లూచిప్‌, మిరే అస్సెట్‌ లార్జ్‌క్యాప్‌ ఎక్కువ పెట్టుబడులను అక్టోబర్‌లో ఆకర్షించాయి.

 

లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ విభాగంలో మోతీలాల్‌ ఓస్వాల​ లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌, మిరే అస్సెట్‌ ఎమర్జింగ్‌, ఇన్వెస్క గ్రోత్‌ అపార్చునిటీస్‌ ఎక్కువ పెట్టుబడులను రాబట్టాయి.  మిడ్‌క్యాప్‌లో ఎల్‌అండ్‌టీ మిడ్‌క్యాప్‌, కోటక్‌ ఎమర్జింగ్‌, యాక్సిస్‌ మిడ్‌క్యాప్‌ పథకాల్లోకి అధిక పెట్టబబడులు వచ్చాయి. స్మాల్‌క్యాప్‌లో హెచ్‌డీఎఫ్‌సీ స్మాల్‌క్యాప్‌, ఎస్‌బీఐ స్మాల్‌క్యాప్‌, నిప్పన్‌ ఇండియా స్మాల్‌క్యాప్‌ టాప్‌లో ఉన్నాయి. మల్టీక్యాప్‌ విభాగంలో కోటక్‌ స్టాండర్డ్‌ మల్టీక్యాప్‌, ఫ్రాంక్లిన్‌ ఈక్విటీ, యాక్సిస్‌ బల్టీక్యాప్‌లోకి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. ఫోకస్డ్‌ ఫండ్స్‌ విభాగంలో మిరే ఫోకస్డ్‌, ఎస్‌బీఐ ఫోకస్డ్‌, ఐఐఎఫ్‌ఎల్‌ ఫోకస్డ్‌ ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించాయి. ఈఎల్‌ఎస్‌ఎస్‌ కేటగిరీలో ఏబీఎస్‌ఎల్‌ ట్యాక్స్‌ సేవర్‌, మిరే ట్యాక్స్‌ సేవర్‌, డీఎస్‌పీ ట్యాక్స్‌ సేవర్‌ పథకాలు అధిక పెట్టుబడులను రాబట్టాయి. You may be interested

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ చైర్మన్‌గా సుభాష్ చంద్ర రాజీనామా

Tuesday 26th November 2019

- బోర్డు పునర్‌వ్యవస్థీకరణ న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ (జీఈఈఎల్‌) చైర్మన్ పదవికి సుభాష్ చంద్ర రాజీనామా చేశారు. ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సంస్థ తెలిపింది. కంపెనీ ఎండీ, సీఈవోలతో చైర్‌పర్సన్‌కు బంధుత్వం వంటివి ఉండకూడదన్న సెబీ నిబంధనలకు లోబడి చంద్ర రాజీనామా చేసినట్లు జీఈఈఎల్‌ వివరించింది. ఆయన నాన్‌-ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా కొనసాగుతారు. అలాగే బోర్డును పునర్‌వ్యవస్థీకరించినట్లు, కొత్తగా ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు (ఆర్‌ గోపాలన్‌, సురేంద్ర

నిఫ్టీ-50లో సగానికి పైగా చౌకగానే..!

Tuesday 26th November 2019

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ తన చరిత్రలోనే నూతన గరిష్టాల వద్ద సోమవారం ముగిసింది. నిఫ్టీ కూడా నూతన గరిష్టాలకు దగ్గర్లోనే ఉంది. కానీ, తరచి చూస్తే నిఫ్టీ-50 సూచీలోని 50 కంపెనీల్లో సగానికి పైనే స్టాక్స్‌ తక్కువ వ్యాల్యూషన్ల వద్దే ట్రేడవుతున్నాయి. అంటే కొన్ని స్టాక్స్‌లోనే ర్యాలీ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ సమయంలో ఇన్వెస్టర్లు ఏ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలన్న సంశయాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కాకపోయినా, ఆర్థిక రంగం రికవరీ

Most from this category