News


12న ఆరంభం కానున్న బాండ్‌ ఈటీఎఫ్‌

Tuesday 10th December 2019
personal-finance_main1575918651.png-30134

కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌కు సెబీ సోమవారం అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 12న ఈటీఎఫ్‌ ఇష్యూ ప్రారంభమవుతుంది. ఈ నెల 20వ తేదీ వరకు ఇన్వెస్ట్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గత వారమే కేంద్ర ప్రభుత్వం భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ ప్రారంభానికి అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. 

 

భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ మార్గంలో 12 వరకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిధులు సమీకరించొచ్చని తెలుస్తోంది. వీటిల్లో నాబార్డ్‌, హడ్కో, ఎన్‌హెచ్‌ఏఐ, పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ, ఎంఆర్‌పీఎల్‌, గెయిల్‌, పీజీసీఐఎల్‌, ఐఆర్‌ఎఫ్‌సీ తదితర సంస్థలున్నాయి. ఏదేనీ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ తన నిధుల అవసరాల కోసం రుణ మార్కెట్‌ను ఆశ్రయించడం సహజం. భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ ప్రారంభమైతే.. ఈ మార్గంలోనూ తక్కువ రేటుకే కేంద్ర సంస్థలు నిధులు సమీకరించుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇది ప్రభుత్వరంగ కంపెనీలకు మెరుగైన నిధుల సమీకరణ మార్గం కానుంది. భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ మూడేళ్లు (2023), పదేళ్ల (2030) కాల వ్యవధితో రెండు రకాలుగా ఉంటుంది. 

 

ఎన్‌ఎస్‌ఈ గత వారమే భారత్‌ బాండ్‌ ఇండెక్స్‌ సిరీస్‌ను ఆరంభించింది. ప్రభుత్వ సంస్థలు జారీ చేసే ఏఏఏ రేటెడ్‌ బాండ్ల పోర్ట్‌ఫోలియో పనితీరును ఈ సూచీ ప్రతిబింబిస్తుంది. ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసే సెక్యూరిటీల్లో భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఒక ఈటీఎఫ్‌ అన్నది నిర్దేశిత సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది. ఉదాహరణకు నిఫ్టీ-50 ఈటీఎఫ్‌... నిఫ్టీ ప్రధాన సూచీలోని 50 స్టాక్స్‌లో వాటి వెయిటేజీ ప్రకారం ఇన్వెస్ట్‌ చేస్తుంది. అదే విధంగా భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ సైతం ప్రభుత్వరంగ సంస్థ రుణ పత్రాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. తద్వారా ప్రభుత్వరంగ సంస్థలకు నిధుల లభ్యత అందుబాటులోకి వస్తుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు రూ.1,000 నుంచి భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. పైగా ఈటీఎఫ్‌లు స్టాక్‌ ఎక్సేంజ్‌లో ట్రేడ్‌ అయ్యేవి కనుక.. మార్కెట్‌ పనిచేసే రోజుల్లో ఎప్పుడైనా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఇందులో పెట్టుబడులపై చార్జీలు కూడా చాలా తక్కువే. కేవలం 0.0005 శాతం వసూలు చేస్తారు. ఎడెల్‌వీజ్‌ ఏఎంసీ భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ నిర్వహణ చూడనుంది.



You may be interested

బీమా రంగంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా..?

Tuesday 10th December 2019

దేశీయ బీమా రంగ లిస్టెడ్‌ కంపెనీలు ఇప్పటి వరకు మంచి ర్యాలీ చేశాయి. ముఖ్యంగా ఈ ఏడాది బీమా కంపెనీల స్టాక్స్‌ గణనీయంగా పెరిగాయి. సంప్రదాయ సాధనాలతో పోలిస్తే అధిక రాబడులను ఆఫర్‌ చేయడం ద్వారా బీమా కంపెనీలు అధికంగా వ్యాపారం చేసుకున్నాయని.. ఒక్కసారి వడ్డీ రేట్ల సైకిల్‌ పెరుగుదల మొదలైందంటే బ్యాంకు డిపాజిట్లు ఇన్వెస్టర్లకు మరింత ఆకర్షణీయంగా మారతాయని గ్లోబల్‌ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్‌ అంటోంది. ఈ రంగం

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ఫైనాన్స్‌ 5 శాతం క్రాష్‌

Monday 9th December 2019

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ఫైనాన్స్‌ షేరు వరుసగా 5రోజూ నష్టాల్లో ముగిసింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.275.00 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభమైనప్పటి ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ఫైనాన్స్‌ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒకదశలో షేరు 6.75శాతం నష్టపోయి రూ.254.00 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మార్కెట్‌ ముగిసే సరికి 4.75 శాతం నష్టపోయి రూ.259.50 వద్ద స్థిరపడింది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.168.00లు, రూ.919.00లుగా

Most from this category