News


ఈ సమయంలో అనుకూలమైన పథకం

Monday 23rd September 2019
personal-finance_main1569212130.png-28486

స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో పెట్టుబడులకు ఆసక్తితో ఉన్నవారు ప్రస్తుత సమయంలో తప్పకుండా తమ పెట్టుబడులు కొనసాగించడం ఎంతో అనుకూలం. ఎందుకంటే గత ఏడాదిన్నర కాలంలో స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ ఎంతో దిద్దుబాటుకు గురయ్యాయి. దీంతో వాటి విలువలు అత్యంత ఆకర్షణీయమైన స్థాయికి చేరాయి. ఫలితంగా ఈ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే స్మాల్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్ల ధరలు కూడా తగ్గాయి. స్మాల్‌క్యాప్‌ విభాగంలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు ఇప్పటి నుంచి ఆరంభించడం మంచిదే అవుతుంది. ఈ విభాగంలో యాక్సిస్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ ఒకానొక మంచి పనితీరు చూపిస్తున్న పథకం. ఈ పథకం 2018 నవంబర్‌ నుంచి ఓపెన్‌ ఎండెడ్‌ పథకంగా మారింది. అంతకుముందు వరకు క్లోజ్‌ ఎండెడ్‌ ఫండ్‌ ఇది. ఓపెన్‌ ఎండెడ్‌కు మారినందున ఎప్పుడైనా ఇన్వెస్ట్‌ చేయవచ్చు. పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు.
రాబడులు..
బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ టీఆర్‌ఐ గతేడాది కాలంలో 25.5 శాతం పడిపోయింది. అంటే ఈ విభాగం ఎంత ఆకర్షణీయంగా మారిందో తెలుస్తోంది. దీంతో అధిక రిస్క్‌ తీసుకునే వారికి పెట్టుబడుల పరంగా ఇది అనుకూల సమయమే అవుతుంది. స్మాల్‌క్యాప్‌ విభాగంలో పెట్టుబడులు అధిక రిస్క్‌తో కూడుకుని ఉంటాయి. కాకపోతే సిప్‌ మార్గంలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలంలో రిస్క్‌ లేకుండా చూసుకోవచ్చు. ఈ పథకం పనితీరు గడచిన ఐదేళ్ల కాలంలో ఆకర్షణీయంగా ఉంది. గత ఏడాది కాలంలో నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 100 టీఆర్‌ఐ 27.4 శాతం పడిపోయింది. అయినా కానీ, ఈ కాలంలో యాక్సిస్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ 2.4 శాతం రాబడులను ఇచ్చి సాటిలేని పనితీరు చూపించింది. అలాగే, మూడేళ్ల కాలంలో నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 100 3.4 శాతం మేర నష్టపోయింది. కానీ, ఈ మూడేళ్ల కాలంలో యాక్సిస్‌ స్మాల్‌ క్యాప్‌ పథకం ఏటా సగటున 8.6 శాతం రిటర్నులు ఇచ్చింది. ఐదేళ్ల కాలంలో నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 100 వార్షికంగా 2.1 శాతం రాబడులనే ఇస్తే, యాక్సిస్‌ స్మాల్‌క్యాప్‌ పథకం వార్షికంగా 11.7 శాతం చొప్పున రాబడులు ఇచ్చింది. క్లిష్ట సమయాల్లోనూ మంచి పనితీరు చూపించిన ఈ పథకాన్ని దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేసే వారు తప్పకుండా పరిశీలించొచ్చు. 
పెట్టుబడుల విధానం..
మంచి వృద్ధికి అవకాశం ఉన్న కంపెనీల్లో యాక్సిస్‌ స్మాల్‌క్యాప్‌ ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది. ప్రస్తుతానికి తన నిర్వహణలోని మొత్తం ఆస్తుల్లో 85 శాతాన్నే స్టాక్స్‌లో కలిగి ఉండగా, మిగిలిన మొత్తం డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసి ఉంది. ఈక్విటీల్లోనూ... స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో 57 శాతం పెట్టుబడులు, మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో 43 శాతం మేర పెట్టుబడులు పెట్టింది. బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రంగ కంపెనీలు, కన్‌స్ట్రక్షన్‌, కెమికల్స్‌ రంగాలకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చింది. ఈ రంగాల కంపెనీల్లోనే 49 శాతం మేర పెట్టుబడులు పెట్టడం గమనార్హం. ఆ తర్వాత టెక్నాలజీ, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో ఎక్కువ శాతం ఇన్వెస్ట్‌ చేసింది. 



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ లాభం 1000 పాయింట్లు

Monday 23rd September 2019

కేంద్ర ప్రభుత్వం, కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి శుక్రవారం తగ్గించిన విషయం తెలిసిందే. దీని ఫలితంగా శుక్రవారం దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు ఆల్‌టైం గరిష్ఠాలకు చేరుకున్నాయి. బుల్స్‌ సోమవారం ట్రేడింగ్‌లో కూడా తమ పట్టును బిగిస్తున్నారు. ట్రేడింగ్‌ ప్రారంభంలో దేశీయ సూచీలు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.49 సమయానికి నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1060.20 పాయింట్లు లాభపడి 30 వేల మార్కును(30051.35 పాయింట్ల వద్ద

వరదల సమయంలో వాహనానికి రక్షణ..

Monday 23rd September 2019

(సంజయ్‌దత్తా, అండర్‌రైటింగ్‌, క్లెయిమ్స్‌ చీఫ్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌) మన దేశంలోని చాలా పట్టణాల్లో గట్టిగా వర్షం పడితే వరద పారే పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఏడాది ముంబై నగరంలో 48 గం‍టల్లోనే 540 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వందలాది ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు వరద నీటిలో మునిగిపోయాయి. రోడ్డు పక్కన, ఫ్లైవోటర్ల కింద కార్లు నిలిచిపోయాయి. యజమానులు వాటిని విడిచిపెట్టేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. వాహనాన్ని, మరీ ముఖ్యంగా

Most from this category