News


యాక్సిస్‌ నుంచి మనీ మార్కెట్‌ ఫండ్‌

Saturday 27th July 2019
personal-finance_main1564206182.png-27356

ముంబై: యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ‘యాక్సిస్‌ మనీ మార్కెట్‌ ఫండ్‌’ను ఆవిష్కరించింది. ఇన్వెస్టర్ల స్వల్ప కాల అవసరాల కోసం ఉద్దేశించిన నిధులను సమర్థవంతంగా ఈ పథకం కింద నిర్వహిస్తామని సంస్థ తెలిపింది. ఇది ఓపెన్‌ఎండెడ్‌ పథకం. పెట్టుబడులను మనీ మార్కెట్‌ ఇనుస్ట్రుమెంట్లలో ఇన్వెస్ట్‌ చేస్తుంది. నూరు శాతం పెట్టుబడులను ఏఏఏ రేటింగ్‌ సాధనాల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఈ పథకం శుక్రవారం ఆరంభం కాగా, ఆగస్ట్‌ 1 వరకు సబ్‌స్క్రిప్షన్‌ కోసం అందుబాటులో ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.5,000. ఎగ్జిట్‌ చార్జీలు ఉండవు. ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌ అయినందున ఆఫర్‌ ముగిసిన కొన్ని రోజుల తర్వాత కూడా పెట్టుబడులకు అందుబాటులోకి వస్తుంది. మనీ మార్కెట్‌ ఇనుస్ట్రుమెంట్లు అన్నవి షార్ట్‌ టర్మ్‌ డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. వ్యాపార సంస్థలు తమ స్వల్ప కాల నిధుల అవసరాలను వీటి ద్వారా తీర్చుకుంటాయి. ఇన్వెస్టర్లు మూడు నుంచి ఆరు నెలల పాటు తమ నిధులను పార్క్‌ చేసుకునేందుకు ఈ పథకాలు అనుకూలంగా ఉంటాయి. 



You may be interested

యూపీఐ ద్వారానే ఐపీవోల్లో పెట్టుబడులు

Saturday 27th July 2019

- సెబీ సర్క్యులర్‌ న్యూఢిల్లీ: మధ్యవర్తిత్వ సంస్థల ద్వారా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్‌ (ఐపీవో)లో ఇన్వెస్ట్ చేసే రిటైల్ ఇన్వెస్టర్లు ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ద్వారానే చెల్లింపులు జరపాల్సి ఉంటుందని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించింది. రెండో విడత యూపీఐ చెల్లింపుల విధానాన్ని జూలై 1 నుంచి అమల్లోకి తెచ్చినట్లు ఒక సర్క్యులర్‌లో తెలిపింది. యూపీఐ విధానంలో ఐపీవోలకు దరఖాస్తు చేసుకునేందుకు 45 బ్యాంకుల జాబితాను కూడా వెల్లడించింది.

కరెన్సీ మార్పిడి రేట్లు సరిగ్గా ఉండేలా ఐఎంఎఫ్‌ చూడాలి

Saturday 27th July 2019

అమెరికా వంటి దేశాలకు సంబంధం లేదు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ న్యూఢిల్లీ: కరెన్సీ మార్పిడి రేట్లు సక్రమంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) పై ఉంది తప్పితే అమెరికా వంటి దేశాలపై లేదని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అన్నారు. ఒక దేశం మరో దేశంపై కరెన్సీ మానిప్యులేషన్‌ (కృత్రిమంగా రేట్లను ప్రభావితం చేయడం) ఆరోపణలు చేయడం ద్వైపాక్షిక ఆధిపత్యం కోసం అన్నట్టుగా ఉన్నాయని పేర్కొన్నారు. చైనా, భారత్‌ దేశాలను

Most from this category