News


రాబడుల్లో మేటి పనితీరు

Monday 21st October 2019
personal-finance_main1571631332.png-29021

-యాక్సిస్‌ బ్లూచిప్‌ ఫండ్‌
-డి.జయంత్‌కుమార్‌, థర్డ్‌పార్టీ ప్రొడక్ట్స్‌ హెడ్‌, కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌

   ఈక్విటీ ఇన్వెస్టర్లకు గడిచిన ఏడాది, రెండేళ్లు పరీక్ష కాలం వంటిది. ఎన్నో అనిశ్చితులు, ఆందోళనలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. సూచీల్లో పెరుగుదల ఉన్నా కానీ, రిటైల్‌ ఇన్వెస్టర్లు రాబడులు పొందింది లేదు. కొందరు నష్టాలు కూడా చవిచూశారు. మార్కెట్‌ అంతటా పెరుగుదల లేకపోవడమే దీనికి కారణం. కేవలం కొన్ని కంపెనీలే మార్కెట్‌ పెరుగుదలకు దోహదపడ్డాయి. అందుకే అనిశ్చిత పరిస్థితుల్లో మార్కెట్‌ లీడర్లుగా ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం తెలివైన వ్యూహం అవుతుంది. కనుక భిన్న మార్కెట్‌ పరిస్థితుల్లో అద్భుత పనితీరు చూపించిన లార్జ్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలనేది మా సూచన. యాక్సిస్‌ బ్లూచిప్‌ ఫండ్‌ దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్‌కు అనుకూలంగా ఉంటుంది.  
పెట్టుబడుల విధానం
యాక్సిస్‌ బ్లూచిప్‌ అన్నది లార్జ్‌క్యాప్‌ ఫండ్‌. మంచి వ్యాపార నాణ్యత కలిగిన లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో ఈ పథకం ఇన్వెస్ట్‌ చేస్తుంది. పోర్ట్‌ఫోలియో పరంగా వైవిధ్యాన్ని కూడా గమనించొచ్చు. 2016 నవంబర్‌ నుంచి ఈ పథకాన్ని శ్రేయాష్‌ దేవల్కర్‌ నిర్వహిస్తున్నారు. బోటమ్‌ అప్‌ విధానంలో స్టాక్స్‌ను, ఫండమెంటల్స్‌ (వ్యాపార మూలాలు), వృద్ధి అవకాశాలు, ఆయా కంపెనీలకు పోటీ పరంగా ఉన్న అనుకూలతలు తదితర అంశాల ఆధారంగా ఈ పథకం పెట్టుబడుల కోసం ఎంపిక చేసుకుంటుంది. పథకం నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 80-100 శాతం వరకు అధిక నాణ్యత కలిగిన పెద్ద స్థాయి కంపెనీల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తుంది. సాధారణంగా లార్జ్‌క్యాప్‌ కంపెనీలు ఇన్వెస్టర్‌ పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వాన్ని అందిస్తాయి. ఎందుకంటే వ్యాపార కార్యకలాపాలు భారీ స్థాయిలో ఉండడం, నిధుల వ్యయాలు తక్కువగా ఉండడం వల్ల ఆర్థిక మందగమన ప్రభావం వీటిపై తక్కువగా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ పథకం ఫైనాన్షియల్‌, టెక్నాలజీ స్టాక్స్‌లో ఎక్కువ వెయిటేజీ కలిగి ఉంది. ఈ రెండు రంగాల స్టాక్స్‌లో వరుసగా 45 శాతం, 14 శాతం చొప్పున ఇన్వెస్ట్‌ చేసి ఉంది. 
రాబడుల పనితీరు 
ఈ పథకం నిర్వహణలో సెప్టెంబర్‌ నాటికి రూ.8,050 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. రాబడులకు సంబంధించి మంచి చరిత్ర ఉంది. గడిచిన మూడేళ్ల కాలంలో వార్షికంగా 15.95 శాతం రాబడులను ఇచ్చింది. ఐదేళ్లలో చూసుకుంటే వార్షిక పనితీరు 12.30 శాతంగా ఉంది. కానీ, ఇదే కాలంలో పోటీ పథకాలు ఇచ్చిన రాబడులు మూడేళ్ల కాలంలో 10.57శాతం, ఐదేళ్లలో 9.26 శాతంగానే ఉన్నాయి. ఈ పథకం ప్రారంభం నాటి నుంచి ప్రతీ నెలా రూ.5,000 చొప్పున ఇన్వెస్ట్‌ చేస్తూ వచ్చి ఉంటే 2019 సెప్టెంబర్‌30 నాటికి రూ.11.9 లక్షల సంపద సమకూరేది. ఇందులో అసలు పెట్టుబడి రూ.5.8 లక్షలు. ఈ పథకంలో ఒకేసారి ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే కనీసం రూ.5,000 నుంచి.. సిప్‌ రూపంలో అయితే ప్రతీ నెలా కనీసం రూ.500 మొత్తంతో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. సిప్‌ రూపంలో కనీసం ఆరు నెలల పాటు ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాల కోసం, దీర్ఘకాలంలో సంపద సమకూర్చుకోవాలనుకునే వారు కనీసం ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలానికి ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.  
టాప్‌ హోల్డింగ్స్‌

కంపెనీ  పెట్టుబడుల శాతం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 9.17
కోటక్‌ మహీంద్రా బ్యాంకు  8.99
ఇన్ఫోసిస్‌ 8.71
బజాజ్‌ ఫైనాన్స్‌ 8.42
ఐసీఐసీఐ బ్యాంకు 8.01
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 6.62
అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ 5.41
హెచ్‌డీఎఫ్‌సీ 4.3
ఏషియన్‌ పెయింట్స్‌ 4.13
టీసీఎస్‌  3.76
టాప్‌ 10లో పెట్టుబడులు 67.52


    
 



You may be interested

టెక్నాలజీని చెడుగా చూపించే ప్రయత్నాలు

Monday 21st October 2019

టెక్నాలజీ వారధిలా పనిచేస్తుంది: ప్రధాని మోదీ న్యూఢిల్లీ: టెక్నాలజీని చెడుగా చూపించే ప్రయత్నాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ హెచ్చరించారు. భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. తన అధికారిక నివాసంలో ఆదివారం ప్రధాని మోదీ ‘బ్రిడ్‌జిటల్‌ ఇండియా’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడారు. ‘‘కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) వల్ల ప్రమాదాలు లేదా రోబోలు మానవులను మించిన మేథస్సును చూపిస్తే అన్న వాటిపై చర్చ కాదు కావాల్సింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం రూ.6,638 కోట్లు

Monday 21st October 2019

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం రూ.6,638 కోట్లు 25 శాతం వృద్ధి  రూ.36,131 కోట్లకు మొత్తం ఆదాయం  స్వల్పంగా పెరిగిన మొండి బకాయిలు  న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో రూ.6,638 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఆర్జించిన నికర లాభం, రూ. 5,322 కోట్లుతో పోల్చితే 25 శాతం వృద్ధి సాధించామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది. నికర వడ్డీ ఆదాయం 15 శాతం

Most from this category