News


పెట్టుబడులు ఎక్కడ పెట్టామన్నదే ముఖ్యం!

Thursday 24th January 2019
personal-finance_main1548269003.png-23760

సూక్ష్మ, స్థూల ఆర్థిక అంశాలు 2018లో అస్థిరతలకు దారితీశాయని, అంతర్జాతీయంగా చమురు ధరలు, వాణిజ్య రక్షణాత్మక విధానాలు, బలమైన డాలర్‌ వర్ధమాన ఆర్థిక వ్యవస్థలను అయోమయానికి గురి చేసినట్టు ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఏఎంసీ తెలిపింది. ఇక దేశీయంగా ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ రుణ చెల్లింపుల్లో వైఫల్యం, ప్రభుత్వరంగ బ్యాంకు ఎన్‌పీఏలు పెరగడం, బలహీన రూపాయి, రాష్‌ట్రాల ఎన్నికలు మార్కెట్లపై ప్రభావం చూపించినట్టు పేర్కొంది. అయితే, 2019 మాత్రం మంచి ఆశాజనకంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. చమురు ధరల పెరుగుదల, అమెరికా వడ్డీ రేట్ల పెంపు, వాణిజ్య ఘర్షణలు ఉపశమించాయని, ప్రపంచ ఆర్థిక రంగానికి ఆది సానుకూలంగా పేర్కొంది. చమురు ధరల క్షీణత, రూపాయి బలపడడం వల్ల మన ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రయోజనకరమని, ద్రవ్య, కరెంటు ఖాతా లోటు నిర్వహణ సులభమవుతుందని వ్యాఖ్యానించింది. ఐఎంఎఫ్‌ సైతం భారత ఆర్థిక వృద్ధి పట్ల సానుకూలంగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. ఈ అంశాలతో ఈ ఏడాది మన దేశం లాభపడుతుందని అంచనా వేసింది. 

 

‘‘వినియోగం అనేది మన ఆర్థిక వ్యవస్థకు చోదకశక్తి వంటిది. ముఖ్యంగా ప్రైవేటు వినియోగం కీలకంగా నడిపిస్తుంది. ఐబీసీ తర్వాత బ్యాంకు బ్యాలన్స్‌ షీట్లు ప్రక్షాళన జరుగుతోంది. ఇది ఆర్థిక వ్వవస్థకు మరింత మేలు చేస్తుంది. కంపెనీల ఫలితాల విషయంలో కొన్ని తాత్కాలిక అవాంతరాలు ఉన్నప్పటికీ, కచ్చితంగా రికవరీలో ఉన్నాయి. మొత్తం మీద ఎర్నింగ్స్‌ మార్కెట్లకు మద్దతునిచ్చే విధంగానే ఉన్నాయి. జీఎస్టీ స్థిరపడితే రేట్లు మరింత దిగొస్తాయి. ఇది వినియోగాన్ని పెంచడమే కాకుండా పన్నుల ఆదాయం కూడా పెరుగుతుంది. సాధారణ ఎన్నికల ముందు బడ్జెట్‌లో ఆదాయపన్ను తగ్గించే అవకాశం కూడా లేకపోలేదు. పన్నులు చెల్లించే వారి సంఖ్య పెరుగుతోంది. మరింత పెరగాల్సి కూడా ఉంది. ఈ ప్రయోజనాన్ని కార్పొరేట్లకు, వ్యక్తులకు పన్ను తగ్గింపు ద్వారా ప్రయోజనాన్ని బదిలీ చేస్తే... ఇది వినియోగాన్ని పెంచడమే కాకుండా, మొత్తం మీద ఆర్థిక వృద్ధికి చేయూతనిస్తుంది’’ అని ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఏఎంసీ తెలిపింది. 

 

పెట్టుబడుల కేటాయింపు ముఖ్యం...
విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు తిరిగి వస్తాయని, దేశీయంగా సిప్‌ పెట్టుబడులు కూడా పెరుగుతాయని ఆదిత్య బిర్లా ఏఎంసీ అంచనా వేసింది. దీనికితోడు ఎన్‌పీఎస్‌, ఈపీఎఫ్‌వో పెట్టుబడులు కూడా పెరగొచ్చని అంచనా వేసింది. దీంతో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులకు మెరుగైన మార్గమని సూచించింది. ‘‘ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాలు ప్రతి ఒక్కరి పోర్ట్‌ఫోలియోలో కీలక పాత్ర పోసిస్తాయి. బ్యాంకుల్లో ఎఫ్‌డీల రూపంలో రూ.69 లక్షల కోట్లు ఉన్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ పిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇవి మెరుగైన రాబడుతోపాటు పన్ను ప్రయోజనాలు కూడా కల్పిస్తాయి’’ అని ఈ సంస్థ అభిప్రాయపడింది. You may be interested

ఈ స్టాక్స్‌లో రెండేళ్లుగా ఫండ్స్‌ కొనుగోళ్లు

Thursday 24th January 2019

గడిచిన రెండేళ్లలో దేశీయ ఇనిస్టిట్యూషన్లు ఈక్విటీల్లో రూ.2లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ వందలాది కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినప్పటికీ... కొన్ని స్టాక్స్‌కు మాత్రం ప్రత్యేకత ఉంది. 20 కంపెనీల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు గడిచిన ఎనిమిది త్రైమాసికాల్లో కొనుగోళ్లు చేస్తూనే ఉన్నాయి.    2016 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం నుంచి 2018 డిసెంబర్‌ త్రైమాసికం వరకు గణాంకాలను పరిశీలించినట్టయితే... కనీసం 5 శాతం అంతకంటే ఎక్కువ మేర మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల

సూచీలకు ఐటీసీ షాక్‌

Wednesday 23rd January 2019

10850దిగువకు నిఫ్టీ 336 పాయింట్ల నష్టపోయిన సెన్సెక్స్‌ సూచీలను నష్టాల్లోకి నెట్టిన ఐటీసీ క్యూ3 ఫలితాలు ఐటీసీ మూడో త్రైమాసిక ఫలితాలు సూచీలకు షాక్‌ ఇచ్చాయి. ఐటీసీ కంపెనీ ఫలితాలు ఈ క్యూ3లో విశ్లేషకుల అంచనాలను అందుకోవడంలో విఫలం కావడం మార్కెట్లో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తా‍్తయి. ఫలితంగా సూచీలు రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 336.17 పాయింట్ల నష్టంతో 36108 వద్ద, నిఫ్టీ 91.30 పాయింట్ల పతనంతో 10831.50 వద్ద ముగిసింది.  నిఫ్టీ

Most from this category