News


మ్యూచువల్‌ ఫండ్స్‌ సురక్షితమేనా?

Sunday 9th December 2018
personal-finance_main1544378486.png-22778

దేశంలో మ్యూచువల్‌ ఫండ్స్‌కు ఎంతో చరిత్ర ఉంది. కానీ, గత కొన్నేళ్ల నుంచి వీటి పట్ల ఆదరణ పెరుగుతూ వస్తోంది. నేటి తరం యువత మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ, ఇతర సంప్రదాయ పెట్టుబడి సాధనాల్లో రాబడులు తక్కువగా ఉండడం వంటి ఎన్నో అంశాలు ఇందుకు కారణమని చెప్పొచ్చు. మరి వీటిల్లో భదత్ర ఏ మేరకు? అన్న సందేహం చాలా మంది ఇన్వెస్టర్లను వేధిస్తుంటుంది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం డెట్‌ ఫండ్స్‌పై గణనీయమైన ప్రభావం చూపించడం కూడా మ్యూచువల్‌ ఫండ్స్‌లో రిస్క్‌ విషయమై ఇన్వెస్టర్లను ఆలోచనలో పడేసింది. ఈ నేపథ్యంలో ఫండ్స్‌లో పెట్టుబడులు సురక్షితమేనా? అన్న ప్రశ్నకు డబ్ల్యూజీసీ వెల్త్‌ సీఐవో రాజేష్‌ చెరువు తెలియజేశారు. 

 

క్రమబద్ధీకరణ
నియంత్రణ సంస్థ సెబీ ఇటీవలి కాలంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్ల ప్రయోజనాల కోణంలో ఎన్నో చర్యల్ని తీసుకుంటోంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ కేటగిరీల్లో, వాటి పెట్టుడుల తీరులో మార్పులు చేయడం, ఫండ్స్‌లో పెట్టుబడిదారుల నుంచి వసూలు చేసే ఎక్స్‌పెన్స్‌ రేషియోను గణనీయంగా తగ్గించడం వంటి చర్యలు వీటిల్లో ఉన్నాయి. ఇవన్నీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల రిస్క్‌ను తగ్గించడంలో భాగమే. 

 

వైవిధ్యం
మార్కెట్లలో రిస్క్‌ లేకుండా రాబడులన్నవి సంప్రదాయ సాధనాలకే పరిమితం. కానీ, మ్యూచువల్ ఫండ్స్‌ను ఆశ్రయిస్తున్నారంటే... అధిక రాబడులు ఆశిస్తున్నట్టుగానే భావించాలి. మ్యూచువల్‌ ఫండ్స్‌ రిస్క్‌ అంశాల ఆధారంగా పలు రకాల ఫండ్స్‌ పథకాలను నిర్వహిస్తుంటాయి. ఈ రిస్క్‌ను తగ్గించుకోవడానికి పోర్ట్‌ఫోలియో పరంగా వైవిధ్యంతో కూడిన పథకాలను ఎంచుకోవచ్చు. రిస్క్‌ భరించే స్థాయి, రాబడుల అంచనాలు ఇన్వెస్టర్లలో వేర్వేరుగా ఉంటాయి. రిస్క్‌ భరించలేని ఇన్వెస్టర్లు అధిక బీటా, సెక్టోరల్‌, థీమాటిక్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయకుండా ఉండడమే నయం. రిస్క్‌ తక్కువ ఆశించేవారికి లార్జ్‌క్యాప్‌ లేదా మల్టీక్యాప్‌ ఫండ్స్‌ అనుకూలంగా ఉంటాయి. 

 

పారదర్శకత
అక్రమాలకు అవకాశం లేకుండా, ఇన్వెస్టర్ల రక్షణ కోణంలో ఒకవైపు సెబీ, మరోవైపు యాంఫి పలు చర్యలు చేపట్టాయి. ఫండ్‌ లేదా పథకం డేటా, వంటి పూర్తి సమాచారాన్ని ఇన్వెస్టర్లకు తెలియజేయాల్సి ఉంటుంది. మ్యూచుల్‌ ఫండ్స్‌ సంస్థలు ప్రతీ పథకానికి సంబంధించి పోర్ట్‌ఫోలియో వివరాలను నెలవారీగా ఇన్వెస్టర్లకు తెలియజేయడాన్ని సెబీ తప్పనిసరి చేసింది. ఇది పారదర్శకత పెంపు కోసం చేపట్టిన చర్యే. ఫండ్‌ మేనేజర్లు మార్కెట్‌ అంశాల ఆధారంగా పోర్ట్‌ఫోలియోలో మార్పులు, చేర్పులు చేస్తుంటారు. కనుక ఇన్వెస్టర్లు తాము ఇన్వెస్ట్‌ చేస్తున్న ఫండ్స్‌ విషయమై సందేహాలు ఉంటే అడ్వైజర్లను సం‍ప్రదించి తగిన మార్పులు, చేర్పులు చేసుకోవడం మంచి నిర్ణయమే అవుతుంది.You may be interested

ప్రతీ రూపాయి రెట్టింపు అవుతుంది.. తొందరపడొద్దు: పొరింజు

Sunday 9th December 2018

దేశీయ స్టాక్‌ మార్కెట్లో ఇప్పుడున్న ప్రతీ రూపాయి ఏడాది క్రితం రెండు రూపాయలతో సమానమని, సెప్టెంబర్‌-అక్టోబర్‌లో వచ్చిన కరెక్షన్‌ వందలాది స్టాక్స్‌ విలువను హరించి వేసిందని స్మాల్‌క్యాప్‌ ఇన్వెస్టర్‌, ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ ఇండియా అధినేత పొరింజు వెలియాత్‌ అన్నారు. తన నిర్వహణలోని పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సేవల ద్వారా ఇన్వెస్ట్‌ చేసిన వారికి ఆయన తాజాగా ఒక లేఖ రాశారు. ఇప్పుడు వెనక్కి తీసుకునే ప్రతీ రూపాయిని అలాగే ఉంచేస్తే, సమీప

బీమా కొనుగోలు సరిగ్గా ఉందా..?

Sunday 9th December 2018

ఎవరైనా కానీ జీవితంలో సంపాదన ప్రారంభించిన తర్వాత చేయాల్సిన మొదటి పని బీమా పాలసీ తీసుకోవడం. అయితే, ఎంత మంది బీమా తీసుకుంటున్నారు? తీసుకునే వారిలోనూ ఎంత మంది సరిగ్గా తీసుకుంటున్నారు? అని ప్రశ్నిస్తే కనుక సమాధానం సంతృప్తిగా ఉండకపోవచ్చు. నష్టం జరిగితే (అది ప్రాణ, ఆస్తి నష్టం కావచ్చు) అందుకు చెల్లించే పరిహారం బీమా. బీమా కంపెనీ అందిస్తున్న అన్ని ఉత్పత్తులూ అందరికీ సరిపడకపోవచ్చు. ప్రకటనలు, ఏజెంట్ల మాటలు,

Most from this category