News


ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ కళ తప్పుతున్నాయా..?

Tuesday 11th February 2020
personal-finance_main1581445078.png-31702

ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పథకాల్లోకి పెట్టుబడులు ఎక్కువగా జనవరి-మార్చి త్రైమాసికంలో వస్తుంటాయి. కానీ, యాంఫి తాజా గణాంకాలను పరిశీలిస్తే.. జవనరి నెలలో ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు తగ్గినట్టు తెలుస్తోంది. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు 10 నెలల గరిష్ట స్థాయిలో ఉంటే, ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో పెట్టుబడులు తగ్గడాన్ని ఇన్వెస్టర్లు గమనించాలి. 2019 జనవరిలో ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లోకి రూ.1,244 కోట్ల నికర పెట్టుబడులు రాగా, అంతకుముందు ఏడాది 2018 జనవరి నెలలో రూ.1,986 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కానీ, 2020 జనవరిలో వచ్చిన పెట్టుబడులు రూ.931 కోట్లుగా ఉన్నాయి. 2018 నుంచి మూడేళ్లలో క్రమంగా తగ్గినట్టు ఈ గణాంకాలు ‍స్పష్టం చేస్తున్నాయి.

 

పన్ను ఆదా కోసం ఈ సీజన్‌లో ఇన్వెస్టర్లు ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాలను ఆశ్రయించడం తగ్గిందని, ఈ పథకాల రాబడులు ఇటీవలి సంవత్సరాల్లో ఆశావహంగా లేకపోవడమే కారణమై ఉండొచ్చని మ్యూచువల్‌ ఫండ్స్‌ అడ్వైజర్లు పేర్కొంటున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ విభాగం రాబడులు 2.18 శాతంగా ఉన్నాయి. ‘‘మంచి రాబడులు, పెట్టుబడుల పరంగా సౌలభ్యం కారణంగా ట్యాక్స్‌ ఆదా ఫండ్స్‌ను అత్యంత లాభదాయకంగా పరిగణిస్తున్నారు. అయితే, ఈ విడత ఈ పథకాల వార్షిక రాబడులు ఇన్వెస్టర్లను ఆకట్టుకునే విధంగా లేవు. అందుకే ఈ పథకాల్లోకి పెట్టుబడుల రద్దీ కనిపించడం లేదు’’ అని ఫిన్‌షెర్పా అధినేత బాబు కృష్ణమూర్తి అన్నారు. మార్చితో ఆర్థిక సంవత్సరం ముగిస్తుంది కనుక చివరి మూడు నెలల్లో పన్ను ఆదా కోసం ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లోకి వచ్చే పెట్టుబడుల ప్రవాహం సహజంగానే ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు.

 

జనవరిలోనే ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లోకి పెట్టుబడుల ప్రవాహం తగ్గిందనుకోవద్దు. 2017 డిసెంబర్‌లో ఈఎల్‌ఎస్‌ఎస్‌ స్కీముల్లోకి రూ.1.166 కోట్లు రాగా, 2018 డిసెంబర్‌లో రూ.841 కోట్లు, 2019 డిసెంబర్లో రూ.479 కోట్లుగా ఉన్నాయి. అంటే డిసెంబర్‌ నెలలోనూ తగ్గుముఖం పట్టాయని తెలుస్తోంది. అయితే, వచ్చే రెండు నెలల్లో (ఫిబ్రవరి, మార్చి) ఈ పరిస్థితి మారొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. ‘‘పన్ను ఆదా పెట్టుబడులకు మార్చి అనేది చివరి నెల. కనుక ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లోకి వచ్చే పెట్టుబడులు ఇప్పటి నుంచి తగ్గకపోవచ్చు. కాకపోతే క్రితం సంవత్సరాలతో పోలిస్తే తక్కువగానే ఉండొచ్చు’’ అని కృష్ణమూర్తి పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ పరిస్థితి మరింత దిగజారొచ్చన్న ఆందోళన మ్యూచువల్‌ ఫండ్స్‌ అడ్వైజర్లలో వ్యక్తమవుతోంది. ఎందుకంటే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నూతన పన్ను శ్లాబు రేట్లను ఒక ఆప్షనల్‌గా ప్రతిపాదించారు. ఎటువంటి పన్ను మినహాయింపులు క్లెయిమ్‌ చేసుకోని వారు తక్కువ పన్ను రేట్లు చెల్లిస్తే సరిపోతుంది. దీంతో ఒక వర్గం వారు పన్ను ఆదా కోసం ఈఎల్‌ఎస్‌ఎస్‌ తరహా పథకాలకు దూరం కావచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.



You may be interested

స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు కరోనా కష్టాలు..

Wednesday 12th February 2020

చైనా నుంచి పరికరాల సరఫరా సమస్యలు దేశీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం ఈ వారం పరిస్థితి చక్కబడొచ్చని ఆశలు న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ .. దేశీ స్మార్ట్‌ఫోన్స్ పరిశ్రమను కూడా కలవరపెడుతోంది. పరికరాలు, సబ్-అసెంబ్లీస్ కోసం చైనాపై ఆధారపడిన దేశీ కంపెనీలకు .. సరఫరాపరమైన సమస్యలతో క్రమంగా సెగ తగులుతోంది. చైనాలో మూతబడిన ఫ్యాక్టరీలు మళ్లీ తెరుచుకుని, ఈ వారంలోనైనా ఉత్పత్తుల సరఫరా ప్రారంభమవుతుందేమోనని స్మార్ట్‌ఫోన్ సంస్థలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. "దేశీ

టాటా స్టీల్‌కు బై రేటింగ్‌

Tuesday 11th February 2020

యూరోపియన్‌ కార్యకలాపాల్లో నింబంధనలు బలహీనంగా ఉండడం, విక్రయాలు తగ్గడంతో టాటా స్టీల్‌ డిసెంబర్‌తో ముగిసిన క్యూ3లో కన్సాలిడేటెడ్‌ నికర నష్టం రూ.1,22.53 కోట్లుగా ప్రకటించింది. అంతేగాక గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే స్టాండేలోన్‌ నికర లాభం తగ్గి రూ,2,456.09 కోట్ల నుంచి రూ.1,803.83 కోట్లకు చేరింది. చైనాలో కరోనా వైరస్‌ ప్రభావంతో చైనాలో ఉత్పత్తులు పడిపోతాయిని ఎమ్‌కే గ్లోబల్‌ ఫైనాన్సియల్‌ సర్వీస్‌ భావిస్తోంది. దీంతో స్టీల్‌ కొరత

Most from this category