News


యాంఫీ ప్రచార కర్తలుగా సచిన్‌, ధోని

Friday 31st January 2020
personal-finance_main1580444699.png-31358

  • ‘మ్యూచువల్ ఫండ్స్ సాహి హై’ క్యాంపైన్‌కు ప్రచారం

న్యూఢిల్లీ: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, టీమిండియా లెజండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిలు ‘మ్యూచువల్ ఫండ్స్ సహి హై’ క్యాంపైన్‌కు ప్రచారం చేయనున్నారని అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా(యాంఫీ) ప్రకటించింది. మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులను ప్రోత్సహించడం కోసం.. ఈ క్యాంపైన్‌కు తొలిసారిగా క్రికెటర్లను ఎంపికచేసినట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై సంతకాలు పూర్తిచేసినట్లు చైర్మన్ నీలేష్ షా ప్రకటించారు. ఈ పరిశ్రమలోని ప్రొడక్ట్‌ల గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రచారం కొనసాగుతుందని వివరించారు. ఈ సందర్భంగా భారత్ రత్న అవార్డు గ్రహీత సచిన్ మాట్లాడుతూ.. ‘క్రమశిక్షణ, దీర్ఘకాలిక వ్యూహం అనేవి విజయానికి మూలస్తంభాలుగా భావిస్తున్నాను. అది ఏ క్రీడైనా, వ్యక్తిగత పెట్టుబడి అయినా సరే’ అని వ్యాఖ్యానించారు. లక్ష్య-ఆధారిత విధానం, సరైన ప్రారంభం, క్రమశిక్షణ, ఒడిదుడుకులను తట్టుకోగలిగేలా ఉండడం అనేవి క్రికెట్‌కు అయినా, వ్యక్తిగత నగదు నిర్వహణకైనా అత్యంత కీలక అంశాలుగా తాను నమ్ముతూ వస్తున్నట్లు ఎం ఎస్ ధోని అన్నారు. 



You may be interested

బడ్జెట్‌ వేళ ఆప్షన్‌ వ్యూహాలు!

Friday 31st January 2020

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈదఫా నూతనంగా శనివారం బడ్జెట్‌ రోజున ట్రేడింగ్‌ జరపనున్నాయి. బడ్జెట్‌ రోజు సూచీల్లో ఆటుపోట్లు అధికంగా ఉండొచ్చన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్షన్‌ ప్లేయర్లు బడ్జెట్‌ రోజున అవలంబించాల్సిన కొన్ని వ్యూహాలను ప్రముఖ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి... 1. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌: నిఫ్టీ రాబోయే వారాల్లో 12500 పాయింట్ల దిశగా కదలవచ్చు. ఈ సమయంలో కాల్‌ రేషియో వ్యూహం అవలంబించడం ద్వారా లాభం పొందొచ్చు. ఇందులో ఫిబ్రవరి

నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు

Friday 31st January 2020

హిందూస్థాన్‌ యూనిలివర్‌, ఐటీసీ, ఎస్‌బీఐ, టెక్‌ మహీంద్రా, వేదాంత, జమ్మూ&కాశ్మీర్‌ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌, అలెంబిక్‌ ఫార్మా, అరవింద్‌, బాలకృష్ణ పేపర్‌ మిల్స్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, భరత్‌ ఇమ్మునాలాజికల్‌&బయోలాజికల్‌ కార్పోరేషన్‌, బిర్లాసాఫ్ట్‌, యూనిటెక్‌, వీ-గార్డ్‌ ఇండస్ట్రీస్‌, కాస్ట్రోల్‌ ఇండియా, కామధేను, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌, జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలతో పాటు బీఎస్‌ఈలో సుమారు 185 కంపెనీలు తమ మూడో త్రైమాసిక గణాంకాలు విడుదల చేయనున్నాయి. 

Most from this category