News


స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ ఎంపికకు ఆరు పరీక్షలు

Sunday 4th August 2019
personal-finance_main1564940960.png-27528

స్మాల్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో 2017 నుంచి ఇన్వెస్ట్‌ చేస్తున్న వారికి మింగుడు పడని అంశం... ఇప్పటికీ పెట్టుబడులపై రాబడులు కనిపించని పరిస్థితి. కానీ, చారిత్రకంగా చూస్తే దీర్ఘకాలంలో ‍స్మాల్‌క్యాప్‌ పథకాలు మంచి రాబడులను ఇచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఏడేళ్లు అంతకంటే ఎక్కువ కాలం పాటు ఇన్వెస్ట్‌ చేసుకోవాలనుకునే వారు ఇప్పటికీ వీటిని పరిశీలించొచ్చు. అయితే, స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ ఎంపిక కోసం చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి.

 

రాబడులు
బుల్‌ దశలో కాకుండా, మార్కెట్‌ పతనాల్లో సంబంధిత పథకం పనితీరు ఎలా ఉందీ చూడాలి. 2008, 2013, 2019లో రాబడులను పరిశీలించడం మంచిది. ఓ మార్కెట్‌ సైకిల్‌ మొత్తంలో అంటే సాధారణంగా ఏడెనిమిదేళ్లు. మార్కెట్‌ కరెక్షన్లతో ఓ మంచి పథకం పనితీరు కూడా ఏడాది, మూడేళ్ల కాలంలో ప్రతికూలతలు ఎదుర్కోవచ్చు. అయితే, అదే సమయంలో బెంచ్‌మార్క్‌, ఆ విభాగం సగటు రాబడులతో పోలిస్తే ఎంచుకునే పథకం మెరుగ్గా ఉండాలి.  

 

ఫండ్‌ మేనేజర్‌
ఎంపిక చేసుకునే ఫండ్‌ మేనేజర్‌ సంబంధిత విభాగంలో కనీసం పదేళ్ల అనుభవమైన కలిగి ఉన్నారా? అని చూడడం ఒకటి. అంతేకాదు, సంబంధిత స్మాల్‌క్యాప్‌ పథకానికి కనీసం ఐదేళ్ల నుంచి నిర్వహణ బాధ్యతలు చూస్తుంటే అది సానుకూలం అవుతుంది.

 

పరిశోధన...
స్మాల్‌క్యాప్‌ ఇన్వెస్టింగ్‌లో విజయం అన్నది అంత సునాయాసంగా రాదు. బుల్‌ మార్కెట్లో ఆకర్షించే స్టాక్స్‌ కాకుండా, సరైన పరిశోధన సాయంతో సత్తా ఉన్న వాటిని ఎంచుకోవాలి. అప్పుడే రాబడులు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇందుకు పరిశోధన టీమ్‌ అవసరం అవుతుంది.  

 

పోర్ట్‌ఫోలియో టర్నోవర్‌
స్మాల్‌క్యాప్‌ పథకాల్లో స్టాక్స్‌ను తరచుగా మారుస్తుండడం మంచి సంకేతం కాదు. ఇది వ్యయాలపై, రాబడులపై పెద్ద ప్రభావాన్నే చూపుతుంది. కొనే ముందే పూర్తి స్థాయి అధ్యయనం చేయాలి. పెట్టుబడులు పెట్టిన తర్వాత నిర్ణీత కాలం వేచి చూడాలి. పోర్ట్‌ఫోలియో టర్నోవర్‌ రేషియో ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు. విజయవంతమైన ఫండ్స్‌ పోర్ట్‌ఫోలియో టర్నోవర్‌ రేషియో 50 అంతకంటే తక్కువగానే ఉంటుంది. 

 

పోర్ట్‌ఫోలియో పీఈ
పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్‌ వ్యాల్యూషన్‌ ఎక్కువగా ఉందంటే నష్టాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవి చిన్న షేర్లు. కనుక ఫండ్‌ పీఈ రేషియో తక్కువగా ఉంటే మంచిది.

 

ఫండ్‌సైజు
స్మాల్‌క్యాప్‌ పథకం నిర్వహణలో వేలాది కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు ఉండడం మంచి సంకేతం కాదు. ఎందుకంటే ఈ విభాగంలో నాణ్యమైన స్టాక్స్‌ తక్కువగా ఉంటాయి. అదే సమయంలో ఒకే కంపెనీకి పెట్టుబడుల పరంగా భారీగా కేటాయింపులు చేయలేని పరిస్థితులు ఉంటాయి. కనుక అధిక పెట్టుబడులు వచ్చి పడితే ఫండ్‌ మేనేజర్లు మిడ్‌, లార్జ్‌క్యాప్‌లోనూ ఎక్స్‌పోజర్‌కు వెళతారు. దాంతో అచ్చమైన స్మాల్‌క్యాప్‌ పనితీరు ప్రతిబింబించదు. You may be interested

సోమవారం వార్లల్లోని షేర్లు

Monday 5th August 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా సోమ‌వారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు జుబిలెంట్ లైఫ్‌:- క‌మ‌ర్షియ‌ల్ పేప‌ర్ల జారీ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.40 కోట్ల నిధుల‌ను స‌మీక‌రించింది. కాక్స్ అండ్ కింగ్స్‌:-  రూ.100 కోట్ల క‌మ‌ర్షియ‌ల్ పేప‌ర్ల చెల్లింపుల విఫ‌లమైంది.  మ‌న్‌ప‌సంద్ బేవ‌రీజెస్‌:- కంపెనీ ఆడిట‌ర్లుగా బాట్లిబాయ్ పురోహిత్ నియ‌మితుల‌య్యారు  పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్:- ఫెయిర్‌డీల్ స‌ప్లై ప్రైవేట్ లిమిటెడ్ రూ.40.50 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆర్‌బీఐకి స‌మాచారం ఇచ్చింది. అదానీ ప‌వ‌ర్:-  జీఎంఆర్ చ‌త్తీస్‌ఘ‌డ్ ఎన‌ర్జీ లిమిటెన్

ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయొచ్చు: జగన్నాథం

Sunday 4th August 2019

ఆటోమొబైల్‌ రంగంలో మూడు నాలుగేళ్ల కాలంలో మంచి రాబడులకు అవకాశం ఉందే కానీ, అది మూడు నాలుగు నెలల్లో మాత్రం కాదని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ హెడ్‌ జగన్నాథం తూనుగుంట్ల పేర్కొన్నారు. పలు అంశాలపై ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.    ఆటోమొబైల్‌ రంగం గురించి మాట్లాడుతూ... ఆటోమొబైల్‌ రంగంలో మార్కెట్‌ లీడర్లుగా ఉన్న కంపెనీల షేర్ల ధరలు ఇప్పటికీ తక్కువ విలువల వద్ద లేవని, 50 శాతం వరకూ

Most from this category