News


ఈ ఫండ్స్‌లో రాబడుల పరిమళాలు

Sunday 15th March 2020
personal-finance_main1584296389.png-32487

ప్రతికూల అంశాలతో మార్కెట్లు కుదేలవుతున్నాయి. చాలా రకాల మ్యూచువల్‌ ఫండ్స్‌ రాబడులను గమనిస్తే గత మూడేళ్ల కాలంలో ఇచ్చిందేమీ లేదు. కానీ, ఐదు మ్యూచువల్‌ ఫండ్స్‌ కేటగిరీలను పరిశీలించినట్టయితే వాటిల్లో రాబడులు ఇన్వెస్టర్లు ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఈ విభాగంలో కొన్ని ఫండ్స్‌ రెండంకెల రాబడులను గడిచిన ఏడాది కాలంలో ఇచ్చినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

 

బంగారం ఫండ్స్‌ విభాగం ఏడాది కాలంలో రాబడుల పరంగా అగ్ర స్థానంలో ఉంది. ఈ విభాగం 35 శాతం రాబడులను ఇచ్చింది. 12 పథకాలు 35 శాతానికి పైగా రాబడులను ఇచ్చాయి. ఈ విభాగంలో ఇన్వెస్కో ఇండియా గోల్డ్‌ ఈటీఎఫ్‌ 38 శాతం రాబడులతో అగ్రస్థానంలో ఉంది. బంగారం ఫండ్స్‌ అన్నవి పెట్టుబడుల వైవిధ్యం పరంగా మంచివి. ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో కనీసం 5-10 శాతం పెట్టుబడులను బంగారం పథకాలకు కేటాయించుకోవాలని మ్యూచువల్‌ ఫండ్స్‌ సలహాదారులు సూచిస్తుంటారు. అనిశ్చిత పరిస్థితుల్లో, ఈక్విటీ మార్కెట్లలో కల్లోలం ఏర్పడిన సందర్భాల్లో బంగారంలో పెట్టుబడులు హెడ్జ్‌గా పనిచేస్తాయి.

 

రాబడుల పరంగా రెండో స్థానంలో లాంగ్‌ డ్యురేషన్‌ బాండ్‌ ఫండ్స్‌ నిలిచాయి. 2019 చివరి భాగంలో ఇవి ర్యాలీ చేశాయి. అయితే ఈ ఏడాది కూడా ఆ స్థాయి రాబడులు ఈ పథకాల్లో సాధ్యం కాకపోవచ్చని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే, అనిశ్చిత పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా రేట్ల తగ్గింపునకు దారితీస్తున్న నేపథ్యంలో లాంగ్‌డ్యురేషన్‌ ఫండ్స్‌ లాభపడొచ్చన్నది అంచనా వేస్తున్నారు. చమురు ధరల పతనం 10 ఏళ్ల ప్రభుత్వ సెక్యూరిటీల ఈల్డ్‌ తగ్గిపోవడానికి కారణమవడం ఈ పథకాలకు ప్రయోజనం కలిగించింది. ఈ పథకాల్లో ఏడాది రాబడులు 19 శాతంగా ఉన్నాయి. నిప్పన్‌ ఇండియా నివేష్‌ లక్ష్య 21 శాతం, ఐసీఐసీఐ లాంగ్‌టర్మ్‌ బాండ్‌ ఫండ్‌ 18 శాతం రాబడులతో గత ఏడాది కాలంలో మంచి పనితీరుతో ముందున్నాయి.

 

ఆర్‌బీఐ రేట్ల కోత అంచనాలతో ఈల్డ్స్‌ తగ్గడం గిల్ట్‌ ఫండ్స్‌కు ప్రయోజనం కలిగించేదే. యూఎస్‌ ఫెడ్‌ బాటలో ఆర్‌బీఐ కూడా నడవొచ్చని చాలా మంది అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇది గిల్ట్‌ ఫండ్స్‌లో రాబడుల వృద్ధికి అవకాశం కల్పించనుంది. అలాగే, బ్యాంకింగ్‌ అండ్‌ పీఎస్‌యూ డెట్‌ ఫండ్స్‌ కూడా రాబడుల పరంగా మెరుగ్గానే ఉన్నాయి. క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌కు ఇవి మంచి ప్రత్యామ్నాయమన్నది నిపుణుల అభిప్రాయం. వీటిల్లో అస్థిరతలు తక్కువ. ఏడాది కాలంలో ఈ పథకాల రాబడులు 10.69 శాతం వరకు ఉన్నాయి. ఎడెల్‌వీజ్‌ బ్యాంకింగ్‌ అండ్‌ పీఎస్‌యూ డెట్‌ ఫండ్‌ గడిచిన ఏడాదిలో 15.91 శాతం రాబడులను ఇవ్వడం గమనార్హం.



You may be interested

‘యస్‌’ ఏటీ-1 బాండ్‌హోల్డర్లకు ‘నో’

Sunday 15th March 2020

యస్‌బ్యాంకు అడిషినల్‌ టైర్‌-1 (ఏటీ-1) బాండ్లలో రూ.8,415 కోట్ల పెట్టుబడులు పూర్తిగా రద్దు చేసినట్టేనని బ్యాంకు అడ్మినిస్ట్రేటర్‌ ప్రశాంత్‌కుమార్‌ స్పష్టతనిచ్చారు. ఇది మార్కెట్లకు రుచించని అంశమే. దీంతో ఏటీ-1 బాండ్లకు అమ్మకాల సెగ తప్పదని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.    ఏటీ1 సెక్యూరిటీలు అన్నవి అనిశ్చిత కన్వర్టబుల్‌ బాండ్స్‌. బ్యాంకు సంక్షోభంలో పడితే ఇన్వెస్టర్ల పెట్టుబడులు రిస్క్‌లో పడినట్టే. ‘‘ఇతర బ్యాంకుల నిధుల సమీరణ ప్రయత్నాలపై ఈ ప్రభావం పడుతుంది. ఈ

మార్కెట్‌ బాటమ్‌ కోసం ఎదురుచూడకండి

Saturday 14th March 2020

దలాల్‌స్ట్రీట్‌ను బేర్స్‌ను స్వాధీనం చేసుకోవడంతో ఈ వారంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లుతో పాటు మనదేశ మార్కెట్లు  భారీ నష్టాన్ని చవిచూశాయి. మార్కెట్లో ఇది బ్లాక్‌ స్వాన్‌ కేటగిరి విధ్వంసం అని,  ఇలాంటి పతనాలు చాలా అరుదైనవని, మానవజాతి మనుగడకు ప్రమాదమని శామ్‌కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమిత్‌ మోడీ అభిప్రాయపడ్డారు. ఆయన రాసిన ఒక కాలమ్‌లో వ్యక్తంచేసిన అభిప్రాయాలివి.... సూచీలు చాలా అరుదుగా లోయర్‌ సర్కూ‍్యట్‌ పరిమితిని తాకడం, ట్రేడింగ్‌ ఫ్రీజ్‌నును ప్రారంభించడం చాలా

Most from this category