News


సగం మ్యూచువల్‌ ఫండ్స్‌ పనితీరు బాలేదు...!

Wednesday 4th September 2019
personal-finance_main1567620328.png-28193

యాక్టివ్‌ నిర్వహణతో కూడిన 228 ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో 45 శాతం పథకాల రాబడులు... వాటి బెంచ్‌ మార్క్‌తో పోలిస్తే ఐదేళ్ల కాలానికి తక్కువగా ఉండడం ఇన్వెస్టర్లను హతాశులను చేసేదే. ముఖ్యంగా ఈక్విటీ ఫండ్స్‌లో ఇలా పేలవ పనితీరు చూపించిన వాటిల్లో వ్యాల్యూ ఫండ్స్‌ విభాగం అత్యంత చెత్తగా ఉంది. ఎందుకంటే వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌తో కూడిన పథకాల్లో 67 శాతం పనితీరు ఐదేళ్ల కాలానికి బెంచ్‌ మార్క్‌ సూచీ కంటే వెనుకబడి ఉంది. అలాగే, 61 శాతం లార్జ్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు కూడా బెంచ్‌ మార్క్‌ కంటే అధిక రాబడులను ఇవ్వలేకపోయాయి. 

 

ఈ పరిస్థితి ఓ పెద్ద ప్రశ్నను ఇన్వెస్టర్ల ముందు ఉంచుతోంది. అదేమిటంటే... యాక్టివ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ కంటే పాసివ్‌ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేసుకుంటే పోదూ..? పాసివ్‌ ఫండ్స్‌ అంటే నిఫ్టీ ఈటీఎఫ్‌, నిఫ్టీ నెక్ట్స్‌ ఈటీఎఫ్‌ వంటి ఇండెక్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేసేవి. యాక్టివ్‌ ఫండ్స్‌ అంటే భిన్న సూచీల పరిధిలోని మంచి రాబడులకు అవకాశం ఉన్న స్టాక్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేసే పథకాలు. వీటి కంటే సూచీలే అధిక రాబడులు ఇస్తుండడం ఇన్వెస్టర్లను పునరాలోచింపజేసేదే అవుతుంది. గత 18 నెలలుగా మార్కెట్లో కరెక్షన్‌ చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఐదేళ్ల కాలంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు సూచీల కంటే వెనుకబడిపోవడానికి ఇది కూడా ఒక కారణమే. నిజానికి ఒకవైపు ప్రధాన సూచీలు ఈ ఏడాది నూతన శిఖరాలకు వెళ్లి ఆ తర్వాత కరెక్షన్‌కు లోనయ్యాయి. అయినా యాక్టివ్‌ ఫండ్స్‌ రాబడులు మెరుగుపడలేదు. 

 

ఇక గత 18 నెలల కాలంలో రాబడులను పరిశీలించినట్టయితే... మొత్తం యాక్టివ్‌ ఈక్విటీ ఫండ్స్‌లో 71 శాతం సూచీల కంటే తక్కువ రాబడులు ఇచ్చాయి. ఇక్కడ రాబడులు అంటే అవి సానుకూలం (లాభాలు), ప్రతికూలం (నష్టాలు) కూడా కావచ్చు. అంటే కేవలం 26 శాతం పథకాలే లాభాలను ఇచ్చాయి. మరీ ముఖ్యంగా డబుల్‌ డిజిట్‌ రిటర్నులు ఇచ్చినవి ఎనిమిది పథకాలు మాత్రమే. టెక్నాలజీ ఫండ్స్‌, ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌ రాబడుల్లో ముందున్నాయి. ఐదేళ్ల కాలానికి బెంచ్‌ మార్క్‌తో పోలిస్తే పనితీరు విషయంలో.. లార్జ్‌క్యాప్‌లో 61 శాతం పథకాలు, లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ విభాగంలో 42 శాతం పథకాలు, మల్టీక్యాప్‌ విభాగంలో 50 శాతం పథకాలు, ఈఎల్‌ఎస్‌ఎస్‌ విభాగంలో 48 శాతం, వ్యాల్యూ ఆధారిత విభాగంలో 67 శాతం పథకాలు వెనుకబడినట్టు ఏస్‌ ఈక్విటీ డేటా తెలియజేస్తోంది. అయితే, ఐదేళ్ల కాలానికి స్మాల్‌క్యాప్‌లో ఒక్క పథకం కూడా బెంచ్‌ మార్క్‌ కంటే వెనుకబడి పోలేదు. ఈక్విటీ విభాగంలో ఇన్వెస్ట్‌ చేసే వారు సాధారణంగా కనీసం 12-15 శాతం వార్షిక రాబడులను దీర్ఘకాలానికి ఆశించడం సహజం. కానీ ప్రస్తుత డేటా 248 పథకాల్లో కేవలం 57 పథకాలే ఇలా రెండంకెల రాబడులను ఇవ్వగా, మిగిలినవన్నీ ఇన్వెస్టర్ల అంచనాల మేరకు పనితీరు చూపించలేదని తెలియజేస్తోంది.  

 

ఎస్‌బీఐ స్మాల్‌క్యాప్‌, మిరే అస్సెట్‌ ఎమర్జింగ్‌ బ్లూచిప్‌ 16 శాతానికి పైగా వార్షిక రాబడులను ఐదేళ్ల కాలానికి అందించాయి. ఇంకా మోతీలాల్‌ ఓస్వాల్‌ మల్టీక్యాప్‌ 35, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్వెస్కో ఇండియా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఇండియా జెన్‌నెక్ట్స్‌ ఫండ్‌, కెనరా రొబెకో ఎమర్జింగ్‌ ఈక్విటీస్‌, కెనరా రొబెకో కన్జ్యూమర్‌ ట్రెండ్స్‌, యాక్సిస్‌ స్మాల్‌​‍క్యాప్‌, క్వాంట్‌ ట్యాక్స్‌ ప్లాన్‌, యాక్సిస్‌ ఫోకస్డ్‌ 25 ఫండ్‌ ఇవన్నీ కూడా ఐదేళ్ల కాలానికి 12 శాతానికి పైగా రాబడులను ఇచ్చినవే. అదే సమయంలో వీటిలో ఒక్కటి మినహా మిగిలిన అన్ని పథకాల రిటర్నులు గత ఏడాది కాలానికి నష్టాల్లోనే ఉండడం గమనార్హం. You may be interested

10,750కు దిగువన బలహీనత

Wednesday 4th September 2019

నిఫ్టీ బుధవారం 10,746 స్థాయిలో మద్దతు తీసుకుని కీలకమైన 10,800 స్థాయి పైన ముగిసింది. సూచీల్లో బలహీనత పెరగకూడదంటే నిఫ్టీ 10,800కు పైన గురువారం కూడా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. అలాగే, 10,900-10,950 అవరోధాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.    ‘‘గురువారం సెషన్‌కు 10,800 స్థాయి కీలకం. ఈ స్థాయి పైన కొనసాగడం సూచీకి కీలకం. గురువారం వీక్లీ ఆప్షన్ల కోజింగ్‌ కావడంతో సెషన్‌ ద్వితీయ భాగంలో సూచీలపై ప్రభావం పడే అవకాశం

ఎల్‌ఐసీ పోర్టుపోలియోలో రాణించిన స్టాకులివే!

Wednesday 4th September 2019

గత కొన్ని సెషన్‌ల నుంచి దేశియ మార్కెట్లో పెరుగుతున్న అమ్మకాల ఒత్తిడి వలన దేశియంగా అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్‌యిన లైఫ్‌ ఇన్సురెన్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్‌ఐసీ) పోర్టుపోలియోలోని 80 శాతానికి పైగా స్టాకులు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. కానీ ప్రస్తుత బేరిష్‌  మార్కెట్‌ దృక్పథాన్ని తట్టుకొని కూడా ఎల్‌ఐసీ పోర్టుపోలియోలో కొన్ని స్టాకులు అద్భుత పదర్శనను చేశాయి.     ఈ పోర్టుపోలియోలో ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ) అయిన షిప్‌బిల్డింగ్‌ సంస్థ గార్డెన్‌ రీచ్‌

Most from this category