News


ఈ అపోహలు సంపద సృష్టికి అడ్డంకి

Saturday 13th July 2019
Markets_main1563011492.png-27044

‘ఈక్విటీ మార్కెట్లలలో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇది జూదం అని నమ్మేవారు దీని నుండి దూరంగా ఉండటానికి  ప్రయత్నిస్తుంటారు. స్టాక్ మార్కెట్లపై అవగాహన కలిగి ఉన్నవారు త్వరగా డబ్బు సంపాదించే మార్గంగా దీనిని భావిస్తారు. చాలామందికి ఈక్విటీ మార్కెట్లపై కొన్ని అపోహలున్నాయి’ అని ఎడల్‌వెయిస్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రాహుల్‌ జైన్‌ అన్నారు. ఈ అపోహలపై స్పష్టతనిచ్చేందుకు ప్రయత్నించారు. ముఖ్యమైన విషయాలు ఆయన మాటల్లోనే....

అపోహ 01- మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలంటే ధనవంతులై ఉండాలి.
 పెట్టుబడులు పెట్టాలనుకుంటే భారీ మొత్తంలో నగదు అవసరమని అనుకుంటారు. కానీ రూ.500 కంటే తక్కువ మొత్తంలో పెట్టుబడులను ప్రారంభించవచ్చు. రిస్క్ ప్రొఫైల్‌కు సరిగ్గా సరిపోయే ఫండ్‌ను ఎంచుకోని సామర్థ్యం ప్రకారం మొత్తాన్ని (వార / నెలవారీ / త్రైమాసిక) ఆదా చేయడానికి వీలవుతుంది. ప్రతి సంవత్సరం సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌) ని 5-7 శాతం పెంచడం వల్ల దీర్ఘకాలంలో అధిక రాబడిని పొందవచ్చు.

అపోహ 02- నేను పాతకాలం వాడిని. సరియైన రీతిలో పెట్టుబడులు పెట్టలేనేమో.
సరైన కంపెనీలను గుర్తించి పెట్టుబడి పెట్టడం శ్రమతో కూడుకున్నది. దీనికి సమయం, నిబద్ధత, సరైన ప్రణాళిక అవసరమవుతుంది. సంస్థ వ్యాపారాన్ని అర్థం చేసుకోవడంతోపాటు ఆ కంపెనీ అవకాశాలు, ప్రమాదాలను అంచనావేయగలగాలి. స్నేహితుడు చెప్పాడనో, సహోద్యోగులు చెప్పారనో లేదా ఆ కంపెనీ వార్తల్లో ఉందనో అందులో పెట్టుబడి పెట్టడం సరియైన విశ్లేషణ కాదు. సరైన లక్ష్యాలు, ప్రణాళికలతో పెట్టుబడులు పెట్టడానికి వయుసు అడ్డంకి కాదు. పెట్టుబడి సలహాదారులను సంప్రదిస్తే వయసుకు తగిన, రాబడిని పెంచగలిగే సలహాలను అందిస్తారు.

అపోహ03 - ధరలు పడిపోయిన స్టాకులు రెండింతల లాభాలనిస్తాయి. 
స్పల్పకాలంలో (మూడు నుంచి ఐదేళ్ల లోపు) పెట్టుబడి పెట్టిన నగదును తిరిగి తీసుకోవాలనుకుంటే ఈక్విటీ మార్కెట్లు సరియైన లాభాలను ఇవ్వలేకపోవచ్చు. కానీ దీర్ఝ కాలంలో పెట్టుబడులకు ఇది సరియైన వేదిక. ఇటువంటి పెట్టుబడులు పెట్టే ముందు రోజువారి అంశాలను కాకుండా కంపెనీ దీర్ఘకాల ఆలోచనలను అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలి. స్టాకులను ఎంచుకునేటప్పుడు కంపెనీ క్రమ శిక్షణతో పాటు వాటి విలువలను పరిగణలోకి తీసుకోవాలి. లాభాలు అన్ని సమయాలలో  ధరలపై  ఆదారపడి ఉండవు.

అపోహ04 - అస్థిరత వలన పోర్ట్‌ఫోలియో క్షీణిస్తుంది
ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లపై చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే కొన్ని ఏళ్ల నుంచి సంపాదించిన లాభాలను ఒకే రోజులో పొగట్టుకునే అవకాశం కూడా ఇందులో ఉంటుంది. భవిష్యత్తులో ఎదురు కాబోయే మార్కెట్‌ తిరోగమన అంశాలను ఇన్వెస్టర్లు ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటారు. అలాంటి అంచనాలకు గుడ్డిగా కట్టుబడి ఉండనవసరం లేదు. ప్రస్తుతం, రాబోయే ఆర్థిక అంశాల ప్రభావలను విశ్లేషించాలి. అంతేకాకుండా మార్కెట్ల దిశను మార్చగలిగే కారకాలను అర్థం చేసుకోవాలి. సరియైన ఆస్తి నాణ్యత ఉన్న స్టాకులు మార్కెట్లు ఒడిదుడుకులున్న నిలబడగలవు. You may be interested

వారంలో 10-20శాతం నష్టాలను చవిచూసిన 18 షేర్లివే...

Saturday 13th July 2019

మోదీ 2.0 ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. ఫలితంగా బెంచ్‌మార్క్‌ సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్‌ ఈ వారంలో 2శాతం క్షీణించాయి. ఈ ఐదు ట్రేడింగ్‌ సెషన్స్‌లో రూ.3.27లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. గతవారం ఆర్థికమంత్రి ప్రతిపాదించిన బడ్జెట్‌లో భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ వైపు తీసుకెళ్లడానికి అన్ని అంశాలు ఉన్నాయి. అయితే, సంపన్న వర్గాలపై పన్ను విధించాలనే ప్రతిపాదన, భారత్‌తో ఇన్వెస్ట్‌ చేస్తున్న  2000కు పైగా

పసిడికి వడ్డీరేట్ల కోత అంచనాల జోష్‌..!

Saturday 13th July 2019

పసిడి ధర రాత్రి అమెరికా మార్కెట్లో 11డాలర్లు లాభపడి 1,412.20 డాలర్ల వద్ద స్థిరపడింది. ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు మరింత బలపడటం ఇందుకు కారణమైంది. వడ్డీరేట్లపై ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ మెతక ధోరణి వాఖ్యలు పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మద్దతినిస్తున్నాయి. ప్రొడ్యూసర్ ప్రైజెస్‌ గణాంకాలు అంచనాలకు మించి నమోదుకావడంతో పాటు, అమెరికా సూచీలు గరిష్టస్థాయిని అందుకున్న నేపథ్యంలో ఉదయం అక్కడి మార్కెట్లో కొంత అ‍మ్మకాల ఒత్తిడిని

Most from this category