News


35 శాతం రెండేళ్లకు పైగా కొనసాగుతున్నవారే..

Tuesday 19th November 2019
personal-finance_main1574105269.png-29681

ఈక్విటీ మార్కెట్లలో గత ఏడాదిన్నర కాలంగా తీవ్ర అస్థిరతలు కొనసాగుతుండగా, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో ఇన్వెస్టర్లు మూడింట ఒక వంతు మంది తమ పెట్టుడులను అలాగే స్థిరంగా కొనసాగిస్తున్నారు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులను గమనిస్తే.. ఈక్విటీయేతర ఆస్తులతో పోల్చినప్పుడు ఇన్వెస్టర్లు ఈక్విటీ ఆస్తుల్లోనే ఎక్కువ కాలం కొనసాగేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. దీర్ఘకాలంలో ఈక్విటీ పెట్టుబడులు అధిక రాబడులను ఇస్తాయన్న అవగాహనే దీనికి కారణంగా అర్థమవుతోంది.

 

2018 నాటికి ఉన్న ఈక్విటీ ఆస్తుల్లో 28.4 శాతం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా 12-24 నెలలకు పైగా ఈక్విటీల్లో కొనసాగుతున్న ఆస్తులు 31.7 శాతంగా ఉన్నాయి. ఏడాది క్రితం ఉన్న 22 శాతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. ఈ విధంగా ఈక్విటీ పెట్టుబడులను స్థిరంగా కొనసాగించడం అన్నది ఇన్వెస్టర్ల ప్రవర్తనలో మార్పునకు, వారి విజ్ఞానం పెరిగిందనేందుకు నిదర్శనంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమలోని భాగస్వాములు అందరూ సంయుక్తంగా చేస్తున్న కృషికి ఇవి సానుకూల ఫలితాలుగా చెబుతున్నారు. 

 

‘‘2008-09 సమయంలో అధిక శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లు ఈక్విటీ ఫండ్స్‌లో ఎక్కువ కాలం పాటు కొనసాగేవారు కాదు. సంపద సృష్టికి దీర్ఘకాలంలో ఈక్విటీ పెట్టుబడులు ఎంతో ముఖ్యమన్న అవగాహన గత పదేళ్లలో మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లలో పెరిగింది’’ అని క్యాష్‌రిచ్‌ వ్యవస్థాపకుడు సౌగతబసు పేర్కొన్నారు. డెట్‌ విభాగంలో మాత్రం పెట్టుబడిదారుల ధోరణి ఏమాత్రం మారలేదు. 2019 సెప్టెంబర్‌ నాటికి మొత్తం ఆస్తుల్లో 23.1 శాతం రెండేళ్లకు పైగా కొనసాగుతున్నవి కావడం గమనార్హం. ఏడాది క్రితం ఇది 24.5 శాతంగా ఉంది. ‘‘ఈక్విటీయేతర ఫండ్స్‌లో ఇది ఊహించిందే. స్వల్పకాల అవసరాల కోసమే లిక్విడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. అలాగే, లిక్విడ్‌ ఫండ్స్‌లో ఏకమొత్తంలో ఇన్వెస్ట్‌ చేసి సిప్‌ ద్వారా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకుంటుంటారు’’ అని కువేరా సీఈవో గౌరవ్‌ తెలిపారు. You may be interested

మొ‘‘బిల్‌’’ మోతే..!

Tuesday 19th November 2019

డిసెంబరు నుంచీ ఐడియా, ఎయిర్‌టెల్‌ ఛార్జీల పెంపు భారీ నష్టాలు, అప్పులకు కేంద్ర బకాయిలు తోడు ఏ మేరకు పెంచుతామన్నది వెల్లడించని సంస్థలు చెల్లింపులపై మారటోరియానికి సీఏఓఐ అభ్యర్థన న్యూఢిల్లీ: భారీ నష్టాలు, పేరుకుపోయిన రుణాలు... వాటికి తోడు సుప్రీం కోర్టు తాజా తీర్పుతో కేంద్రానికి వేల కోట్లు చెల్లించాల్సి రావటం... ఈ సంక్షోభం నుంచి కొంతైనా గట్టెక్కాలంటే వినియోగదారులపై భారం మోపాల్సిందేనని టెలికం కంపెనీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా  కాల్‌ చార్జీలను పెంచబోతున్నాయి. డిసెంబర్‌

క్రెడిట్‌ కార్డుతో పన్ను చెల్లింపులు?!

Monday 18th November 2019

త్వరలో క్రెడిట్‌ కార్డులు, యూపీఐలు, మొబైల్‌ వాలెట్లతో ఆదాయపన్ను కట్టే వెసులుబాటు రానుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కేవలం నెట్‌ బ్యాంకింగ్‌ మరియు ఆరు బ్యాంకులకు చెందిన డెబిట్‌ కార్డుల ద్వారా మాత్రమే ఐటీ చెల్లింపులు చేసే అవకాశం ఉంది. కెనెరాబ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండియన్‌ బ్యాంకు, పీఎన్‌బీ, ఎస్‌బీఐకు చెందిన డెబిట్‌ కార్డుల ద్వారా ఐటీ చెల్లించవచ్చు. త్వరలో యూపీఐ(యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేజ్‌) ద్వారా

Most from this category