News


ఆర్థిక మందగమనంలో సురక్షిత మార్గాలు

Monday 14th October 2019
personal-finance_main1570991465.png-28851

ఆర్థిక మందగమనం... నేడు ఎక్కడ చూసినా వినిపిస్తున్న పదం. ఎందుకంటే దేశ ఆర్థిక వృద్ధి ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరింది. జూన్‌ త్రైమాసికంలో కేవలం 5 శాతం ఆర్థిక వృద్ధే నమోదైంది. దేశంలో వినిమయ డిమాండ్‌ తగ్గింది. ఆటోమొబైల్‌ రంగంలో వాహనాలకు డిమాండ్‌ దారుణంగా పడిపోయింది. ఇవన్నీ అంతర్జాతీయ ఆర్థిక మందగమనానికి తోడు, దేశీయంగా చేపట్టిన పలు సంస్కరణల ప్రభావాలే. అయితే, ఆర్థిక మందగమనం ఇన్వెస్టర్లకు ఎన్నో పాఠాలు నేర్పుతుందనడంలో సందేహం లేదు. ఈ తరహా ప్రతికూల పరిస్థితుల ప్రభావం పెట్టుబడులపై కచ్చితంగా ఉంటుంది. కనుక ఇన్వెస్టర్లు ఆర్థిక మందగమనంలోనూ తమ పెట్టుబడులపై రాబడులు ప్రభావితం చెందకుండా చూసుకునేందుకు పలు మార్గాలు ఉన్నాయి. వాటి గురించి ఎడెల్‌వీజ్‌ పర్సనల్‌ వెల్త్‌ అడ్వైజరీ హెడ్‌ రాహుల్‌జైన్‌ వెల్లడించారిలా...

 

సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌)
ధరల పరంగా అస్థిరతలను అధిగమించేందుకు ఉపకరించే సాధనం సిప్‌. మందగమనం సమయంలో దీన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. మార్కెట్లు పడిపోయినప్పుడు అధిక యూనిట్లను కొనుగోలు చేసుకునేందుకు సిప్‌ వీలు కల్పిస్తుంది. మార్కెట్లు పడిపోయిన సమయంలోనూ సిప్‌ను కొనసాగించడం ద్వారా, తిరిగి మార్కెట్లు రికవరీ అయిన తర్వాత గణనీయమైన రాబడులు అందుకునేందుకు వీలుంటుంది. అలా కాకుండా సిప్‌ను ఈ సమయంలో నిలిపివేస్తే తక్కువ ధరల్లో అధిక యూనిట్లను సమకూర్చుకునే అవకాశాన్ని కోల్పోతారు. తిరిగి మీరు పెట్టుడులు ఆరంభించే సమయానికి మార్కెట్లు గరిష్టాలకు చేరతాయి. దీనివల్ల కొనుగోలు ధర అధికమవుతుంది. అది రాబడులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. 

 

లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌
లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌లో (యాక్టివ్‌) కొన్ని ఈ మధ్య కాలంలో బెంచ్‌ మార్క్‌ సూచీల కంటే వెనుకబడినప్పటికీ, మందగమనంలో ఇవి పెట్టుబడులకు కుషన్‌గా పనిచేస్తాయి. ఎందుకంటే లార్జ్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు బలమైన వ్యాపార మూలాలు కలిగిన కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. మార్కెట్‌ పతనాలను సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా వీటి పెట్టుబడుల విధానం ఉంటుంది. అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ లార్జ్‌క్యాప్‌ పథకాలను ఎంచుకోవచ్చు. ఇవి తగినంత మేర డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. సాధారణంగా ఇవి 65-35 నిష్పత్తిలో ఈక్విటీలు, డెట్‌కు కేటాయిస్తుంటాయి. 

 

పెట్టుబడుల్లో వైవిధ్యం
పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని పాటించడం ద్వారా నష్టాలకు చెక్‌ పెట్టొచ్చు. లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడంతోపాటు స్థిరమైన ఆదాయన్నిచ్చే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వంటి సాధనాలను ఎంచుకోవాలి. అలాగే, గోల్డ్‌ ఈటీఎఫ్‌ వంటిని కూడా ఎంచుకోవచ్చు. విదేశాల్లో ఇన్వెస్ట్‌ చేసే ఈక్విటీ పథకాల్లోనూ కొంత ఇ‍న్వెస్ట్‌ చేయడం వైవిధ్యంలో భాగమే అవుతుంది. You may be interested

క్యూ2 ఫలితాలే నడిపిస్తాయ్‌ .....!

Monday 14th October 2019

ఈ వారంలో దిగ్గజ కంపెనీల క్యూ2 ఫలితాలు  సానుకూల ప్రభావం చూపనున్న అమెరికా-చైనాల పాక్షిక ఒప్పందం  నేడు ద్రవ్యోల్బణ గణాంకాలు  ఈ వారంలోనే ఆర్‌బీఐ పాలసీ మినట్స్‌ ఈ వారం మార్కెట్‌ ప్రభావిత అంశాలు  ఈ వారంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హిందుస్తాన్‌ యూనిలివర్‌, విప్రో, అంబుజా,  తదితర దిగ్గజ సంస్థలు తమ క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. కంపెనీల క్యూ2 ఫలితాలతో పాటు ప్రపంపవ్యాప్తంగా చోటు చేసుకునే పరిణామాలు కూడా ఈ వారం మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు.

అల్యూమినియం స్టాక్స్‌ ర్యాలీ ఎప్పుడు..?

Sunday 13th October 2019

లండన్‌ మెటల్‌ ఎక్సేంజ్‌ (ఎల్‌ఎంఈ)లో మూడేళ్ల కనిష్ట స్థాయికి అల్యూమినియం ధరలు చేరాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలకుతోడు, ఆటోమొబైల్‌ రంగం నుంచి డిమాండ్‌ తగ్గడం వంటి అంశాలు అల్యూమినియంపై చూపిస్తున్నాయి. అమెరికా-చైనా ఒకరిపై ఒకరు టారిఫ్‌లు వేసుకోవడం మొదలైన తర్వాత.. 2018 మధ్య నుంచి ఇప్పటి వరకు ఎల్‌ఎంఈలో అల్యూమినియం ధరలు 28 శాతం పడిపోయాయి. ఇక అంతర్జాతీయంగానూ వృద్ధి పరిస్థితులు సన్నగిల్లుతుండడం, మాంద్యం వచ్చే అవకాశాలున్నాయన్న ఆందోళనలను

Most from this category