News


పెట్టుబడి సలహాల్ని గుడ్డిగా నమ్మొద్దు!

Monday 17th February 2020
personal-finance_main1581933530.png-31861

ఫైనాన్షియల్‌ పెట్టుబడుల్లో ఇదే కీలకం
ధీరేంద్ర కుమార్‌ సూచన
స్టాక్‌మార్కెట్లో కొత్త సలహాలు, సూచనలను గుడ్డిగా పాటించడం మంచిది కాదని ప్రముఖ నిపుణుడు ధీరేంద్ర కుమార్‌ సూచిస్తున్నారు. ఒక ఫైనాన్షియల్‌ సర్వీస్‌ను కొనడమనేది ఒక భౌతిక వస్తువు కొనడం కన్నా వేరైన విధానమని చెప్పారు. ఒకరు మనకు ఒక ఫైనాన్షియల్‌ సర్వీస్‌ అమ్ముతున్నారంటే అందులో వాళ్లకు ఏదో ఒక లాభం ఉంటుందని అనుకోవాలన్నారు. విత్తసేవల విక్రయంలో అంతిమంగా ధనార్జనే కీలకమన్నారు. ఈ వ్యాపారంలో ఒకరి నష్టమే మరొకరికి లాభమవుతుందని గుర్తించాలన్నారు. అదే భౌతిక వస్తువుల విషయంలో కొనుగోలు చేసిన వస్తువు ఖరీదు ఎక్కువైనా కనీసం ఒక వస్తువు మిగిలిన తృప్తి ఉంటుందన్నారు. ఉదాహరణకు ఒక కారును లక్ష రూపాయలతో కొన్నా, కోటి రూపాయలతో కొన్నా కారనే వస్తువు మన వద్ద ఉంటుందన్నారు. కానీ ఒక విత్తసేవ విషయంలో ఇది జరగదని చెప్పారు.

ఫైనాన్షియల్‌ సర్వీస్‌ విక్రయందారు నుంచి మనం ఒక సర్వీస్‌ను ధనార్జన ఉద్దేశంతో కొంటాము, కానీ మనకు ఎంత తక్కువ లాభం వస్తే మనకు సదరు సర్వీసును అమ్మిన వ్యక్తికి అంత లాభం మిగులుతుంది. కాబట్టి మనకు ఒక ఫైనాన్షియల్‌ సర్వీస్‌ అమ్మిన విక్రయందారు మనకు సాధ్యమైనంత వరకు తక్కువలో తక్కువ లాభం లేదా అసలు ఎలాంటి లాభం రాకుండా ఉండేందుకే యత్నిస్తాడు. బ్యాంకు, బీమా, స్టాక్‌మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్‌.. ఇలా ఏ ఫైనాన్షియల్‌ సర్వీస్‌లోనైనా కొనుగోలుదారుకు ఎంత తక్కువ ప్రయోజనం కలిగితే విక్రయందారుకు అంత మేలు జరుగుతుందనేది కామన్‌ అంశమని, కానీ సాధారణ ఇన్వెస్టర్‌ ఎవరూ దీన్ని గుర్తించరని ధీరంద్రే చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి రెగ్యులేటరీలు, నిబంధనలు కొనుగోలుదారులను రక్షించలేవన్నారు. మన దగ్గర నియంత్రణా సంస్థలన్నీ ఒక మోసం జరిగిన తర్వాత గుర్తించి స్పందించే లక్షణంతో ఉంటాయన్నారు. ఈ పరిస్థితిని తప్పించుకోవాలంటే లోతైన అధ్యయనం, ఫైనాన్షియల్‌ నాలెడ్జ్‌ కీలకమన్నారు. ఈ విషయంలో కొత్తవారి సలహాలు, మధ్యవారి సూచనలు పాటించడం శుద్ధ దండుగన్నారు. 

పైవన్నీ నిపుణుడి అంచనాలు, అభిప్రాయాలు మాత్రమే!



You may be interested

ఐటీ షేర్లు ఆప్‌

Monday 17th February 2020

సోమవారం బలహీనంగా ఉన్న మార్కెట్లో ఐటీ షేర్లు పెరిగాయి. నిఫ్టీ​ఐటీ ఇండెక్స్‌ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 0.03 శాతం పెరిగి 16,647.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది.ఈ ఇండెక్స్‌లో భాగమైన మైండ్‌ట్రీ 2.35 శాతం పెరిగి 982.50 వద్ద, టీసీఎస్‌ 1.09 శాతం పెరిగి 2,207.97 వద్ద, ఇన్ఫోసిస్‌ 0.36 పెరిగి 789.25 వద్ద, విప్రో 0.31 పెరిగి 243.65 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. టెక్‌మహీంద్ర లిమిటెడ్‌, హెక్సావేర్‌ టెక్నాలజీస్‌,

బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ హైజంప్‌- గ్రాఫైట్‌ బోర్లా

Monday 17th February 2020

క్యూ3 ఫలితాల ప్రభావం బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ 10 శాతం అప్‌ గ్రాఫైట్‌ ఇండియా 5.5 శాతం పతనం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతోపాటు.. వచ్చే ఏడాది(2020-21)కి ఆశావహ అంచనాలు(గైడెన్స్‌) ప్రకటించడంతో ఆఫ్‌రోడ్‌ టైర్ల తయారీ దిగ్గజం బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. అయితే మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో రివర్స్‌ టర్న్‌ అరౌండ్‌ ఫలితాలు ప్రకటించడంతో గ్రాఫైట్‌ ఇండియా కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి బాలకృష్ణ

Most from this category