News


ఇప్పుడే ఎందుకు కొనాలి?

Friday 25th January 2019
personal-finance_main1548411266.png-23808

మార్కెట్లలో అస్థిరత కొనసాగుతున్న తరుణంలో చాలామంది ఇన్వెస్టర్లు పొజిషన్లు వదిలించుకునేందుకు తయారవుతున్నారు. కానీ నాణ్యమైన మేనేజ్‌మెంట్‌, బలమైన మూలాలు ఉన్న స్టాకులను కొనుగోలు చేయడానికి ఇదే మంచి తరుణమని ఆనంద్‌ రాఠీ బ్రోకింగ్‌ సంస్థ సలహా ఇస్తోంది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయాన ప్రైవేట్‌ వినిమియం మరింత విస్తరిస్తుందని అంచనా వేసింది. వేతనాల్లో బలమైన వృద్ధి, చమురు ధరలు దిగిరావడం, ప్రభుత్వవ్యయం పెరగడంతో వినిమయం మరింత జోరు చూపుతుందని తెలిపింది. ఇలాంటి వేళ నాణ్యమైన కంపెనీలు మంచి రాబడులు ఇస్తాయని పేర్కొంది. అతిత్వరలో బడ్జెట్‌ రానుందని, ఈ బడ్జెట్‌ను ఇన్వెస్టర్లంతా చాలా నిశితంగా గమనిస్తారని వెల్లడించింది. ప్రస్తుత ఫలితాల సీజన్లో వినిమయ కంపెనీలు మంచి ఫలితాలు ఇస్తున్న సంగతి గుర్తు చేసింది. అందరూ అమ్మకాలు జరిపే వేళ తెలివిగా మంచి స్టాకులను కొనాలని సలహా ఇచ్చింది. ఇటీవల ఐఎంఎఫ్‌ సైతం 2019లో భారత్‌ ఎకానమీ దూసుకుపోతుందని ప్రకటించింది. రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణ ఒత్తిడి ఉపశమించి రేట్ల పెంపు జోరు తగ్గుముఖం పడుతుందని ఐఎంఎఫ్‌ అభిప్రాయపడింది. భారత జీడీపీ అంచనాలను పది బీపీఎస్‌ పెంచి 7.5 శాతంగా ప్రకటించింది. ఇదే సమయంలో ప్రపంచ ఎకానమీ క్రమంగా మందగమనం బారిన పడే అవకాశం ఉందని తెలిపింది. ఇలాంటి సమయం భారత్‌లో పెట్టుబడులకు అనువైనది ఆనంద్‌ రాఠీ అభిప్రాయపడింది. You may be interested

మిడ్‌సెషన్‌ అ‍మ్మకాలు -నష్టాల ముగింపు

Friday 25th January 2019

10800 దిగువకు నిఫ్టీ మిడ్‌సెషన్‌ అనంతరం జరిగిన అ‍మ్మకాలు మార్కెట్‌ను ముంచేశాయి. మారుతీ సుజుకీ, జీఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్,  ఐసీఐసీఐ, అల్ట్రాటెక్‌ షేర్లలో నెలకొన్న అమ్మకాలు సూచీలు... ఈ వారంలో కనిష్టస్థాయి వద్ద ముగిసాయి. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఈ షేర్ల క్షీణత కారణంగా నిఫ్టీ 10800 మార్కును కోల్పోయింది.  సెన్సెక్స్‌ 169.56 పాయింట్ల నష్టంతో 36, 025 వద్ద, నిఫ్టీ 69 పాయింట్ల క్షీణతతో 10,780 వద్ద స్థిరపడ్డాయి. ఐసీఐసీఐ,

బడ్జెట్‌ టైంలో ఎఫ్‌పీఐలు ఏం చేస్తున్నాయి?

Friday 25th January 2019

గత ఐదేళ్ల కాలంలో బడ్జెట్‌కు నెల రోజుల ముందు, తర్వాత ఎఫ్‌పీఐల ధోరణిని పరిశీలిస్తే బడ్జెట్‌కు ముందు తర్వాత కొనుగోళ్లకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ముందుగా ప్రీబడ్జెట్‌ నెలను పరిశీలిస్తే ఐదేళ్లలో మూడు సార్లు విదేశీ మదుపరులు నికర కొనుగోలుదారులుగా, రెండు దఫాలు నికర అమ్మకందారులుగా నిలిచారు. ఎఫ్‌పీఐలు 2016 బడ్జెట్‌కు నెల ముందు 11వేల కోట్ల రూపాయలు, 2017లో వెయ్యికోట్ల రూపాయల అమ్మకాలు జరిపారు. 2014, 2015, 2018లో

Most from this category