News


దీర్ఘకాల లక్ష్యాలకు అనుకూలం

Monday 2nd December 2019
news_main1575262181.png-30000

ఈక్విటీ మార్కెట్లలో స్వల్పకాలం పాటు అనిశ్చితులు ఉన్నా కానీ, దీర్ఘకాలానికి చూసుకుంటే మెరుగైన పనితీరే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న చరిత్ర ఇదే తెలియజేస్తుంది. కనుక ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు దీర్ఘకాల దృష్టితోనే అడుగులు వేయడం మంచిది. మధ్య కాలం నుంచి దీర్ఘకాల (కనీసం ఐదేళ్లు, ఆ పైన) లక్ష్యాల కోసం పరిశీలించాల్సిన పథకాల్లో డీఎస్‌పీ ఈక్విటీ అపార్చునిటీస్‌ కూడా ఒకటి. ఈ పథకం లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ విభాగాల్లో ప్రధానంగా ఇన్వెస్ట్‌ చేస్తుంది. 

రాబడులు...
దీర్ఘకాలంలో ‘నిఫ్టీ లార్జ్‌ మిడ్‌క్యాప్‌ 250’ సూచీని మించి ఈ పథకం రాబడులను ఇచ్చింది. అలాగే, ఏడాది కాల ప్రదర్శన కూడా మెరుగ్గా ఉంది. ఏడాది కాలంలో ఈ పథకం 13.3 శాతం రాబడులను ఇచ్చింది. ఇదే కాలంలో నిఫ్టీ లార్జ్‌మిడ్‌క్యాప్‌ 250టీఆర్‌ఐ పెరుగుదల కేవలం 6.6 శాతంగానే ఉంది. ఇక ఐదేళ్ల కాలంలో ఈ పథకం వార్షికంగా ఇచ్చిన రాబడులు 10.9 శాతం. ఇదే కాలంలో నిఫ్టీ లార్జ్‌మిడ్‌క్యాప్‌ 250టీఆర్‌ఐ వృద్ధి 9.9 శాతానికి పరిమితమైంది. కేవలం మూడేళ్ల కాల సగటు రాబడుల విషయంలోనే బెంచ్‌ మార్క్‌సూచీతో ఈ పథకం ఒక శాతం వెనుకబడింది. 2018లో మార్కెట్ల ప్రతికూల ప్రదర్శన మూడేళ్ల కాల రాబడులపై ప్రభావం చూపించింది. కానీ, ఈ ఏడాది మాత్రం ఈ పథకం మంచి జోరు చూపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే 10 శాతం రాబడులను ఇవ్వడం​గమనార్హం. సాధారణంగా ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోదీర్ఘకాల పనితీరు విశ్లేషణకు కచ్చితత్వంగా ఉంటుంది. ఎందుకంటే స్వల్ప కాలంలో మార్కెట్లలో ఆటుపోట్లు, పనితీరు, ఆయా పథకాల పెట్టుబడుల ప్రాధమ్యాలు.. వీటి ఆధారంగా ఇన్వెస్టర్లు ఎంచుకునే పథకాల రాబడుల్లో వైరుధ్యం కనిపిస్తుంది. కానీ, దీర్ఘకాలంలో వీటన్నింటినీ అధిగమించి ఒక పథకం ఏ విధంగా పనిచేసిందన్నది తెలుస్తుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు చూపించిన పనితీరు ఈ పథకం పెట్టుబడుల వ్యూహాలను తెలియజేస్తుంది. కనుక దీర్ఘకాలం కోసం ఈ పథకాన్ని పరిశీలించొచ్చు.

పెట్టుబడుల విధానం
పోర్ట్‌ఫోలియోలో తగినంత వైవిధ్యాన్ని ఈ పథకం అనుసరిస్తోంది. ప్రధానంగా లార్జ్‌క్యా్‌ప్‌తోపాటు, రాబడుల కోసం కొంత మొత్తాన్ని మిడ్‌క్యాప్‌ కంపెనీల్లోనూ ఈ పథకం ఇన్వెస్ట్‌ చేస్తుంది. ప్రస్తుతానికి మొత్తం పెట్టుబడుల్లో లార్జ్‌క్యాప్‌ విభాగంలో 58 శాతం, మిడ్‌క్యాప్‌ విభాగంలో 39 శాతం, స్మాల్‌క్యాప్‌ విభాగంలో 3 శాతం వరకు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో మొత్తం స్టాక్స్‌ 62. వీటిల్లో టాప్‌ 10 స్టాక్స్‌లోనే 41 శాతం వరకు పెట్టుబడులు ఉన్నాయి. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో మిడ్‌క్యాప్‌ సూచీల రాబడులు నికరంగా 0.15 శాతం మైనస్‌లోనే ఉన్నాయి. ఇంత ప్రతికూల పరిస్థితుల్లోనూ గత ఏడాది కాలంలో ఈ పథకం 13 శాతం వరకు రాబడులను ఇవ్వడానికి ప్రధాన కారణం పోర్ట్‌ఫోలియోలోని లార్జ్‌క్యాప్‌ పెట్టుబడులే. దీర్ఘకాలం కోసం సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మరింత స్థిరమైన రాబడులను ఈ పథకం నుంచి ఆశించొచ్చు. 

 



You may be interested

జియో కాల్‌, డేటా ఛార్జీలు పెరగనున్నాయ్‌..!

Monday 2nd December 2019

ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా సంస్థలతో పాటు ‍ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో కూడా టారీఫ్‌లను పెంచేందుకు సిద్ధమైంది. ఇందుకు కోసం కొత్త ‘‘ఆల్‌ఇన్‌వన్‌ ప్లాన్‌’’ను డిసెంబర్‌ 6 నుంచి అమల్లోకి తీసుకువస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కోంది. ఈ కొత్త ప్లాన్‌లో భాగంగా అన్ని వాయిస్‌, డేటా ఛార్జీలను 40శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపింది. ఇతర మొబైల్‌ నెట్‌వర్క్‌కు కాల్స్‌పై విధించే ‘‘ఫెయిర్‌ యూసేజ్‌ పాలసీ’’ని పరిమితం చేస్తామని

మీ పోర్ట్‌ఫోలియోకు అస్సెట్‌ అలోకేషన్‌..!

Monday 2nd December 2019

దీర్ఘకాల సంపదలో కీలకం రాబడుల్లో అనిశ్చితి తొలగింపునకు వెసులుబాటు దీర్ఘకాలంలో సంపదను సమకూర్చుకోవాలనుకుంటే అందుకు కీలకంగా తోడ్పడే వాటిల్లో అస్సెట్‌ అలోకేషన్‌ కూడా ఒకటి. అస్సెట్‌ అలోకేషన్‌ అన్నది ఒక ఇన్వెస్టర్‌ తన పెట్టుబడులను ఏ మేరకు భిన్న సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేశారన్నది తెలియజేస్తుంది. ఇది రిస్క్‌ను పరిమితం చేయడంతోపాటు, రాబడుల్లో అనిశ్చితులను కూడా తగ్గిస్తుంది. సరైన విభాగానికి సరైన సమయంలో పెట్టుబడులను కేటాయించడం ప్రభావవంతమైన అస్సెట్‌ అలోకేషన్‌ అవుతుంది. ఎందుకంటే

Most from this category