News


బంగారం బాండ్లలో ఇన్వెస్ట్‌మెంట్‌ అవకాశం

Tuesday 3rd March 2020
personal-finance_main1583175465.png-32226

భారత ప్రభుత్వ సౌర్వభౌమ బంగారం బాండ్ల (ఎస్‌జీబీ) సిరీస్‌-10 ఇష్యూ ఈ నెల 2న ప్రారంభమైంది. ఈ ఏడాది తొలి ఇష్యూ ఇది. బంగారం ధరలు పెరుగుతుండడంతో గతేడాది చేపట్టిన ఇష్యూలకు మంచి స్పందన వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో, ప్రపంచ మాంద్యం భయాలతో ఇ‍న్వెస్టర్లు రిస్క్‌ తగ్గించుకునేందుకు బంగారంలో పెట్టుబడులు పెంచుకుంటున్నారు. కనుక బంగారం ధర కొత్త రికార్డులను సృష్టిస్తోంది. అయితే భౌతిక బంగారం కాకుండా, ఎస్‌జీబీలో ఇన్వె‍స్ట్‌ చేయడం వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కాకపోతే మెచ్యూరిటీ వరకు ఆగే ఓపిక ఉండాలి. 

 

ఒక గ్రాము బంగారం సమాన మొత్తం నుంచి ఎస్‌జీబీలో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. అంటే కనీస పెట్టుబడి ఒక గ్రాము. గరిష్ట పరిమితి అన్నది ఒక వ్యక్తికి ఒక ఆర్థిక సంవత్సరంలో 4 కిలోలు. తాజా ఇష్యూలో భాగంగా ఒక గ్రాము బంగారం ధరను ప్రభుత్వం రూ.4,260గా నిర్ణయించింది. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకుని, ఆన్‌లైన్‌లోనే చెల్లించే వారికి ఒక గ్రాము బంగారాన్ని రూ.4,210కే కేటాయించడం జరుగుతుంది. అంటే గ్రాముపై రూ.50 డిస్కౌంట్‌ పొందొచ్చు. ఈ బాండ్లు ఎనిమిదేళ్ల కాల వ్యవధితో వస్తాయి. మెచ్యూరిటీ సమయానికి మార్కెట్లో బంగారం రేటు ఎంత ఉంటే.. అదే రేటును ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. అంతేకాదు, ఏటా 2.5 శాతం వడ్డీని కూడా వార్షికంగా చెల్లిస్తుంది. ఒకవైపు వడ్డీ రాబడి, మరోవైపు బంగారంలో పెట్టుబడి అవకాశాలను కల్పిస్తున్నది ఎస్‌జీబీ. అందుకే ఇప్పటి వరకు ప్రతీ ఇష్యూకు ఆదరణ బాగానే వచ్చింది. తాజా ఇష్యూ ఈ నెల 6న ముగుస్తుంది. ఈ నెల 11న బాండ్లను జారీ చేయడం జరుగుతుంది.

 

‘‘గోల్డ్‌ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ కూడా బంగారంలో పెట్టుబడి అవకాశాలను కల్పిస్తున్నాయి. కానీ, వీటిల్లో చార్జీలు భరించాలి. కానీ, ఎస్‌జీబీలో ఎటువంటి చార్జీల్లేవు. పైగా వడ్డీని కూడా ఇన్వెస్టర్‌కు చెల్లించడం జరుగుతుంది. సెకండరీ మార్కెట్లో వీటికి లిక్విడిటీ తక్కువ కనుక మెచ్యూరిటీ పూర్తయ్యే వరకు వెచి ఉండేవారు ఎస్‌బీజీలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు’’ అని ప్లాన్‌రూపీ ఇన్వెస్ట్‌మెంట్‌ సర్వీసెస్‌ వ్యవస్థాపకుడు అమోల్‌జోషి సూచించారు. ఇటీవలి బంగారం ధరలు గణనీయంగా పెరగ్గా, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ‘‘వచ్చే 18 నెలల్లో బంగారం ధర 10 గ్రాములకు రూ.48,000 వరకు పెరగొచ్చు’’అని మోతీలాల్‌ ఓస్వాల్‌ కమోడిటీస్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నవనీత్‌ దమాని తెలిపారు. అయితే, బంగారం ధర పెరుగుతుందన్న అంచనాలతో కాకుండా, పోర్ట్‌ఫోలియో బ్యాలన్స్‌ కోసం.. పెట్టుబడుల్లో 5-10 శాతాన్ని బంగారంలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చన్నది నిపుణుల సూచన.You may be interested

ఇన్వెస్టర్లుగా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు..?

Tuesday 3rd March 2020

కరోనా వైరస్‌ సోమవారం మన మార్కెట్లలో లాభాలన్నింటినీ మింగేసింది. వరుసగా ఏడు ట్రేడింగ్‌ సెషన్లలో ప్రధాన సూచీలు 10 శాతం వరకు పడిపోవడానికి ఈ వైరస్‌ విజృంభణే కారణం. మరి ఈ సమయంలో సాధారణ ఇన్వెస్టర్లుగా భయంతో స్టాక్స్‌ను అమ్మేసుకుంటున్నారా..? లేక తెలివిగా మంచి పెట్టుబడి అవకాశాలను అందుకుంటున్నారా..? ఈ సమయంలో ఏం చేయాలన్నది ప్రముఖ మార్కెట్‌ నిపుణులు, శామ్కో సెక్యూరిటీస్‌ సీఈవో జిమీత్‌మోదీ సూచించారు.   ఈ తరహా సందర్భాలు తాత్కాలికమే.

జీడీపీ వృద్ధి అవుట్‌లుక్‌ను తగ్గించిన ఫిచ్‌రేటింగ్స్‌

Monday 2nd March 2020

ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు జీడీపి వృద్ధి అవుట్‌లుక్‌ను 4.9శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రముఖ రేటింగ్‌ ఫిచ్‌ సోమవారం తెలిపింది. దేశీయంగా నెలకొన్న బలహీనమైన డిమాండ్‌ పాటు కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తితో సప్లై చైన్‌కు అంతరాయం కలగవచ్చనే అంచానలతో అవుట్‌లుక్‌ తగ్గించినట్లు రేటింగ్‌ సంస్థ తెలిపింది. అయితే వ్యవస్థలో రికవరీ కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరం(2020-21) జీడీపీ వృద్ధి 5.4శాతం ఉండవచ్చని పేర్కోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గతంలో భారత

Most from this category