News


అక్టోబర్‌ 1 నుంచి ఎస్‌బీఐ చార్జీల్లో మార్పులు

Friday 13th September 2019
personal-finance_main1568398367.png-28361

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ అక్టోబర్‌ 1 నుంచి పలు సేవల చార్జీల్లో సవరణలు తీసుకురానుంది. నగదు ఉపసంహరణలు, సగటు నెలవారీ బ్యాలన్స్‌ తదితర వాటిల్లో ఈ మార్పులు చోటు చేసుకోనున్నాయి. కనుక ఎస్‌బీఐ ఖాతాదారులు వీటిపై ఓ సారి దృష్టి సారించాల్సిందే...

 

ఎస్‌బీఐ ఖాతాదారులకు ఉపశమనం కల్పించే నిర్ణయంగా నెలవారీ కనీస బ్యాలన్స్‌ (ఏఎంబీ)ను తగ్గించడాన్ని చెప్పుకోవాలి. అక్టోబర్‌ 1 నుంచి పట్టణాల్లో సేవింగ్స్‌ ఖాతాల్లో కనీస బ్యాలన్స్‌ 5,000 నుంచి 3,000కు తగ్గనుంది. ఒకవేళ సగటున నెల వారీ బ్యాలన్స్‌ను 3,000 ఉంచకపోతే... కొంత చార్జీలను భరించాల్సి ఉంటుంది. ఒకవేళ కనీస బ్యాలన్స్‌ 50 శాతమే, రూ.1500 మాత్రమే ఉంటే, అప్పుడు రూ.10తోపాటు దీనిపై జీఎస్టీని ఖాతాదారుల నుంచి వసూలు చేస్తుంది బ్యాంకు. ఒకవేళ కనీస బ్యాలన్స్‌లో 75 శాతం వరకు ఉంచకపోతే అప్పుడు రూ.15తోపాటు దీనిపై జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. 

 

చిన్న పట్టణాల్లో (సెబీ అర్బన్‌) నెలవారీ కనీస బ్యాలన్స్‌ అక్టోబర్‌ నుంచి రూ.2,000కు తగ్గుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని శాఖల్లో సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాదారుల కనీస బ్యాలన్స్‌ రూ.1,000 అవుతుంది. సెబీ అర్బన్‌ శాఖల్లో 50 శాతం కంటే బ్యాలన్స్‌ తగ్గితే అప్పుడు రూ.7.50, అదనంగా జీఎస్టీ చెల్లించాలి. 50-75 శాతం వరకు బ్యాలన్స్‌ తగ్గితే రూ.10, జీఎస్టీ చెల్లించాలి. 75 శాతానికి పైగా తగ్గితే పెనాల్టీ చార్జీ రూ.12. గ్రామీణ శాఖల్లో ఈ చార్జీలు రూ.5,  రూ.7.5, రూ.10, వీటికి అదనంగా జీఎస్టీ ఉంటుంది. 

 

ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్‌ చార్జీలు కూడా మారనున్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా చేసే నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్‌పై ఎటువంటి చార్జీలు ఉండవు. కానీ, బ్యాంకు శాఖల ద్వారా చేస్తే వీటిపై చార్జీలు చెల్లించాలి. బ్యాంకు శాఖ నుంచి నెఫ్ట్‌ లావాదేవీ రూ.10,000 వరకు ఉంటే, రూ.2, జీఎస్టీ చెల్లించాలి. రూ.2లక్షలు మించిన నెఫ్ట్‌ లావాదేవీలపై రూ.20, అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు శాఖల ద్వారా నిర్వహించే ఆర్‌టీజీఎస్‌ లావాదేవీలు రూ.2-5 లక్షల మధ్య ఉంటే రూ.20, జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. రూ.5లక్షలకు పైబడి విలువ కలిగిన లావాదేవీలపై చార్జీ రూ.40. దీనికి జీఎస్టీ అదనం.

 

డిపాజిట్లు, ఉపసంహరణలపై కొత్త నిబంధనలను పరిశీలిస్తే... సేవింగ్స్‌ ఖాతాల్లో ఒక నెలలో మూడు నగదు డిపాజిట్లు ఉచితం. ఆ తర్వాత ప్రతీ లావాదేవీపై రూ.50 సర్వీస్‌ చార్జీ, దీనికి జీఎస్టీ అదనం చెల్లించాల్సి ఉంటుంది. హోమ్‌ బ్రాంచ్‌ కాకుండా ఇతర శాఖల్లో ఒక రోజులో గరిష్టంగా రూ.2లక్షల వరకు డిపాజిట్‌ చేసుకోవచ్చు. అంతకుమించితే స్వీకరించాలా లేదా అన్నది బ్యాంకు మేనేజర్‌ ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. తమ ఖాతాల్లో నెలవారీగా సగటు బ్యాలన్స్‌ను రూ.25,000 కొనసాగిస్తే, నెలలో రెండు సార్లు ఉచితంగా నగదు ఉపసంహరణలు చేసుకోవచ్చు. రూ.25,000-50,000 మధ్య బ్యాలన్స్‌ ఉంచిన వారికి నెలలో  ఉచిత నగదు ఉపసంహరణలు లభిస్తాయి. ఆ తర్వాత ప్రతీ ఉపసంహరణపై రూ.50, జీఎస్టీ చెల్లించాలి. రూ.50,000-1,00,000 మధ్య బ్యాలన్స్‌ ఉంచితే 15 నగదు ఉపసంహరణలపై ఒక నెలలో చార్జీలు ఉండవు. 



You may be interested

బీపీసీఎల్‌.. మళ్లీ ‘విదేశీ’ పరం!

Saturday 14th September 2019

53.3 శాతం వాటా విక్రయించనున్న కేంద్రం  ఆసక్తి చూపుతున్న విదేశీ చమురు దిగ్గజాలు  జాబితాలో సౌదీ ఆరామ్‌కో, బీపీ తదితర కంపెనీలు న్యూఢిల్లీ: భారత్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌)ను విదేశీ చమురు సంస్థకు విక్రయించాలని కేంద్రం భావిస్తోందని సమాచారం. దేశంలోనే రెండో అతి పెద్ద రిఫైనరీ, ఇంధన రిటైల్‌ సం‍స్థ, బీపీసీఎల్‌లో తనకున్న నియంత్రిత వాటాను విక్రయించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగానే బీపీసీఎల్‌లో తన వాటా(53.3 శాతం)ను విదేశీ

నిఫ్టీలో తదుపరి చోటు వీటికే..!

Friday 13th September 2019

బీమా రంగ స్టాక్స్‌కు ఇప్పటి వరకు నిఫ్టీలో చోటు లేదు. కానీ రానున్న సంవత్సరాల్లో బీమా రంగ కంపెనీలు తప్పకుండా నిఫ్టీలోకి వచ్చి చేరతాయని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణమైన సంకేతాలను, విశ్లేషణను కూడా వారు వినిపిస్తున్నారు. విదేశీ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఇప్పటికే బీమా రంగ కంపెనీల భవిష్యత్తు వృద్ధి అవకాశాలను గుర్తించారు. దీనికి నిదర్శనమా అన్నట్టు.. ఈ ఏడాది ఇప్పటికే లిస్టెడ్‌ బీమా కంపెనీల్లో ఎఫ్‌పీఐలు

Most from this category