STOCKS

News


క్వాలిటీ స్టాకులు.. కనిపెట్టడమే కష్టం!

Saturday 19th October 2019
personal-finance_main1571479621.png-29010

రామ్‌దేవ్‌ అగర్వాల్‌
ప్రతిఒక్కరూ మార్కెట్లో నాణ్యమైన స్టాకుల్లో పెట్టుబడులు పెట్టాలని సలహా ఇస్తుంటారు. అయితే నాణ్యమైనవి అనుకున్న చాలా షేర్లు చాలా సందర్భాల్లో ఇన్వెస్టర్ల చేతులు కాల్చిన సంఘటనలున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ ఇన్వెస్టర్‌ రామ్‌దేవ్‌ అగర్వాల్‌ వ్యంగ్యంగా స్పందించారు. ‘‘నాణ్యత అంటే ఎంటో మార్కెట్లో అందరికీ నిర్వచనం తెలిసిపోయింది, కానీ కేవలం నాణ్యమైన స్టాకులను ఎంచుకొని పోర్టుఫోలియో నిర్మించడమే అసలు సవాలు.’’ అని అగర్వాల్‌ వ్యాఖ్యానించారు. చాలా సార్లు తాను కూడా నాణ్యమైన స్టాకుల వెంటపడి నష్టపోయానన్నారు. మేనేజ్‌మెంట్స్‌ నైతిక వర్తనను అంచనా వేయడంలో పలుమార్లు విఫలమయ్యానన్నారు. ఉదాహరణకు కన్జూమర్‌ అవకాశాలను చూసి మన్‌పసంద్‌ బెవెరేజెస్‌లో పెట్టుబడి పెట్టానని, కానీ ఈ ఏడాదిలో సదరు స్టాకు దాదాపు 93 శాతం పతనమైందని చెప్పుకొచ్చారు. అలాగే ఫైనాన్షియల్‌ టెక్నాలజీస్‌ కంపెనీపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టానని, కానీ ఈ షేరు కూడా తనకు నష్టాలిచ్చిందని తెలిపారు. 
మార్కెట్లు గరిష్ఠాల వద్ద ఉన్నప్పుడు తాపీగా మార్కెట్లోకి ఎంటరయ్యే క్లయింట్లను చూస్తే బాధనిపిస్తుందని, ఇలాంటి వాళ్లు సాధారణంగా నష్టాలే మూటకట్టుకుంటారని రామ్‌దేవ్‌ చెప్పారు. అందువల్ల అత్యంత లోతైన అధ్యయనం తర్వాతే సూచీల్లో ఎంటర్‌కావాలని సూచించారు. మార్కెట్‌ పెట్టుబడులకు సంబంధించి నిర్వహించిన ఒక సదస్సులో ఆయన మాట్లాడారు. మేనేజ్‌మెంట్‌ నాణ్యతను బేరీజు వేయడం ఒ‍క్కమారుగా అయ్యేది కాదని, కాలానుగతంగా వారి ప్రవర్తనను బట్టి అంచనా వేయాలని మరో నిపుణుడు భరత్‌ షా చెప్పారు. గరిష్ఠాలను తాకే షేర్లు, కనిష్ఠాలను చేరే షేర్లను పరిశీలిస్తే కార్పొరేట్‌ మేనేజ్‌మెంట్‌ను అవగతం చేసుకోవచ్చని చెప్పారు. ప్రస్తుతం ఎకానమీలో అత్యద్భుతమైన ప్రక్షాళన ప్రక్రియ ఆరంభమైందని, ఇందులో భాగమే ఇటీవలి పలు సంస్కరణలని తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇంత పకడ్బందీగా, క్రమశిక్షణాయుతంగా ప్రక్షాళన జరగలేదని ప్రశంసించారు. You may be interested

ఎస్‌బీఐ టార్గెట్‌ రూ.350: మోతీలాల్‌ ఓస్వాల్‌

Saturday 19th October 2019

స్థూల వ్యవస్థలో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ ఎస్‌బీఐ షేరు 32శాతం రాబడిని ఇస్తుందని మోతిలాల్‌ ఓస్వాల్‌ బ్రోకరేజ్‌ సంస్థ అభిప్రాయపడింది. ఈ బ్రోకరేజ్‌ సంస్థ ఇప్పటికే ఎస్‌బీఐ షేర్లపై బుల్లిష్‌ రేటింగ్‌ను ఇచ్చింది. ‘‘గత మూడు నెలల్లో షేరు 29శాతం వరకు కరెక‌్షన్‌ గురైంది. ఇది అనుకూలమైన రిస్క్-రివార్డ్‌ను తెలియజేస్తుంది. ఆర్థిక సంవత్సరం 2021నాటికి ఆస్తులపై రాబడి (ఆర్‌ఓఏ) 0.7శాతం, ఈక్విటీలపై రాబడి (ఆర్‌ఓఈ) 12.7శాతం మెరుగుపడేందుకు అవకాశాలున్నాయి. కాబట్టి గతంలో తాము ఈ

బ్రెగ్జిట్‌ డీల్‌పై నేడు పార్లమెంట్‌లో ఓటింగ్‌

Saturday 19th October 2019

  గత రెండెళ్లుగా బ్రిటన్‌ రాజకీయ, ఆర్థిక పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేసిన బ్రెగ్జిట్‌ (బ్రిటన్‌ ఎగ్జిట్‌...యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడం) డీల్‌పై ..నేడు బ్రిటన్‌ పార్లమెంట్‌ ఓటింగ్‌ జరగనున్నది.  ఇందుకు సంబంధించిన పార్లమెంటు సమావేశాలు భారత్‌ కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యాయి. ఓటింగ్‌ ఫలితంగా సాయంత్రం 6.30 గంటల తర్వాత వెలువడవచ్చన్నది అంచనా. 1982 తర్వాత మొదటి సారిగా హౌస్‌ ఆఫ్‌ కామర్స్‌ శనివారం నాడు సమావేశం

Most from this category