News


క్రెడిట్‌ కార్డుతో పన్ను చెల్లింపులు?!

Monday 18th November 2019
personal-finance_main1574073724.png-29680

త్వరలో క్రెడిట్‌ కార్డులు, యూపీఐలు, మొబైల్‌ వాలెట్లతో ఆదాయపన్ను కట్టే వెసులుబాటు రానుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కేవలం నెట్‌ బ్యాంకింగ్‌ మరియు ఆరు బ్యాంకులకు చెందిన డెబిట్‌ కార్డుల ద్వారా మాత్రమే ఐటీ చెల్లింపులు చేసే అవకాశం ఉంది. కెనెరాబ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండియన్‌ బ్యాంకు, పీఎన్‌బీ, ఎస్‌బీఐకు చెందిన డెబిట్‌ కార్డుల ద్వారా ఐటీ చెల్లించవచ్చు. త్వరలో యూపీఐ(యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేజ్‌) ద్వారా పన్ను చెల్లింపులకు అవకాశం కల్పిస్తామని రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే చెప్పారు. ఈ విషయమై పరిశీలన జరుపుతున్నామని, త్వరలో కార్యరూపంలోకి తెస్తామని వివరించారు. కేవలం యూపీఐ మాత్రమే కాకుండా మరిన్ని ఎలక్ట్రానిక్‌ పేమెంట్‌ ఆప్షన్స్‌ను కూడా పన్ను చెల్లింపునకు తీసుకువచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. చిన్న చిన్న పన్ను చెల్లింపులు మొబైల్‌ వాలెట్లతో చెల్లించడం సౌకర్యవంతంగా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. యూపీఐ సేవలను ఎన్‌పీసీఐ మూడేళ్ల క్రితం తీసుకువచ్చింది. 



You may be interested

35 శాతం రెండేళ్లకు పైగా కొనసాగుతున్నవారే..

Tuesday 19th November 2019

ఈక్విటీ మార్కెట్లలో గత ఏడాదిన్నర కాలంగా తీవ్ర అస్థిరతలు కొనసాగుతుండగా, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో ఇన్వెస్టర్లు మూడింట ఒక వంతు మంది తమ పెట్టుడులను అలాగే స్థిరంగా కొనసాగిస్తున్నారు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులను గమనిస్తే.. ఈక్విటీయేతర ఆస్తులతో పోల్చినప్పుడు ఇన్వెస్టర్లు ఈక్విటీ ఆస్తుల్లోనే ఎక్కువ కాలం కొనసాగేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. దీర్ఘకాలంలో ఈక్విటీ పెట్టుబడులు అధిక రాబడులను ఇస్తాయన్న అవగాహనే దీనికి కారణంగా అర్థమవుతోంది.   2018 నాటికి ఉన్న

వడ్డీ రేట్లు తగ్గితే మరింత ర్యాలీ!

Monday 18th November 2019

‘వడ్డీ రేట్లు మరింతగా తగ్గితే కార్పొరేట్లకు లబ్ది చేకూరుతుంది. దీంతోపాటు, అధిక వృద్ధి అంచనాలు వలన వచ్చే ఏడాది పీఈ విస్తరణ జరుగుతుంది. ఫలితంగా మార్కెట్లు పెరగడం కొనసాగుతుంది’ అని మార్కెట్‌ విశ్లేషకుడు అజయ్‌ బగ్గా ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు.  బాటమ్‌ ఔట్‌కు దగ్గర్లో ఆర్థిక వ్యవస్థ .. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌లపై ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగింది. ప్రస్తుత ర్యాలీని బ్యాంక్‌ షేర్లు నడిపిస్తున్నాయి. బ్యాంక్‌ల ట్రెజరీ లాభాలు స్థిరంగా పెరుగుతున్నాయి. అంతేకాకుండా బ్యాంక్‌ ఎన్‌పీఏలు

Most from this category