News


ఈ వ్యూహంతో ఆప్షన్‌ బయర్స్‌లాభాలు పొందొచ్చు!

Monday 9th December 2019
personal-finance_main1575886179.png-30131

అసిత్‌ బరాన్‌ పతి సూచనలు, సలహాలు


అసిత్‌ బరాన్‌ పతి... ఆప్షన్‌ బయింగ్‌తో కూడా అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించిన ట్రేడర్‌. సాధారణంగా ఆప్షన్‌ సెల్లర్స్‌కు మాత్రమే మార్కెట్‌ న్యాయం చేస్తుందని, ఆప్షన్స్‌ కొన్నవాళ్లు లాభపడడం తక్కువ సందర్భాల్లోనే జరుగుతుందని మార్కెట్‌లో అందరూ భావించే విషయం. కానీ ఆప్షన్‌ బయింగ్‌ కూడా లాభాల పంటనిస్తుందని ఈ మాజీ బ్యాంకు ఉద్యోగి చూపించాడు. ట్రేడింగ్‌లో మజా తెలిసాక చేస్తున్న ఉద్యోగం  వదిలి మరీ పూర్తి స్థాయి ట్రేడర్‌ అవతారం ఎత్తాడు.

ఆప్షన్‌ ట్రేడింగ్‌, బయింగ్‌ తదితర అంశాలపై ఆయన అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఇలా ఉన్నాయి...
= కొత్తలో యావరేజ్‌ చేయడమనే సూత్రం చాలావరకు నా లాభాలను హరించివేసింది. ఈ సూత్రం ఫాలో కావడం వల్ల దాదాపు నా మొత్తం పెట్టుబడి సున్నాకి వచ్చింది. ఇదే సమయంలో ట్రేడింగ్‌పై పూర్తిగా సమయం వెచ్చించేందుకు ఉన్న ఉద్యోగం వదిలివేయడం జరిగింది. ఒకపక్క ఉద్యోగం లేదు, మరోపక్క ట్రేడింగ్లో నష్టాలు ఆగని పరిస్థితి. దీంతో కోపంతో మరింత ఎక్కువ ట్రేడ్‌ చేయడం మరింత ఎక్కువ నష్టం పొందడం జరిగేది. డబ్బులు పోవడంతో ఇగో సమస్య తలెత్తి పునరాలోచించుకోనిచ్చేది కాదు. రికవరీ చెందేందుకు వీలయిన అన్ని ప్రయత్నాలు చేశాను, కానీ ఏ ప్రయోజనం లేదు. ఇవన్నీ నాకు సరైన గుణపాఠం నేర్పాయి. ఏవి మార్కెట్లో మంచివి కావు, ఏవి సత్ఫలితం ఇవ్వవు తెలిసివచ్చింది. ఈ పరిస్థితి నాలో టెక్నికల్స్‌ను లోతుగా నేర్చుకునేలా చేసింది. ట్రేడింగ్‌ ఫర్‌ ఏ లివింగ్‌ అనే పుస్తకం నాపై చాలా పాజిటివ్‌ ప్రభావం చూపింది. దీంతోపాటు ద డిసిప్లైన్డ్‌ ట్రేడర్‌, ట్రేడింగ్‌ ఇన్‌ ద జోన్‌ పుస్తకాలు కూడా గొప్ప ప్రభావం చూపాయి. ఈ సమయంలో ఉన్న సొమ్మంతా అయిపోయినా నా కుటుంబం తోడుగా నిలబడింది. తిరిగి నేను జీవనోపాధి కోసం ఉద్యోగంలో చేరాను. తర్వాత కొన్నినెలల పొదుపు అనంతరం కొంత మూలధనం సమకూర్చుకున్నాను. ట్రేడింగ్‌ అనేది మానసికమైనది, క్రమశిక్షణ అవసరమైనది అని తెలుసుకున్నాను. 
= ట్రేడింగ్‌లో సరైన ఇండికేటర్‌ను ఎంచుకోవడం చాలా కీలకం. చాలా కేసుల్లో బహుళ ఇండికేటర్లు మాత్రమే ఒక ట్రెండ్‌ను సూచించగలవు. ఒకేఒక్క ఇండికేటర్‌ సరైన సంకేతం ఇవ్వలేకపోఉవచ్చు. నేను సాధారణంగా 15-40- 75 నిమిషాల నుంచి 1-3-6 గంటల వ్యవధి ఉండే ఇండికేటర్లను వాడతాను. ఇండికేటర్లలో వచ్చే సంకేతాల ఆధారంగా ర్యాంకింగ్‌లు ఇచ్చుకుంటారు. ఉదాహరణకు నేను 15 ఇండికేటర్లు వాడుతుంటే వాటిలో 12పైన ఇండికేటర్లు పాజిటివ్‌గా ఉంటే కాల్స్‌ కొంటాను, 12 దిగువన ఉంటే పుట్స్‌ కొంటుంటాను. అయితే ఒక్కోసారి మన చేతిలో లేకుండా పరిస్థితులు రాత్రికి రాత్రి మారుతుంటాయి. అలాంటప్పుడు లాస్‌ బుకింగ్‌ తప్పదు, కానీ తిరిగి వీలయినంత త్వరగా నష్టాలు పూడ్చుకునే ట్రేడ్స్‌ చేయాలి. ట్రేడింగ్‌ అంటే గ్యారెంటీ లాభం అని కాదు.. లాభం వచ్చే అవకాశాలు ఎక్కువని మాత్రమే అర్దం చేసుకోవాలి. స్కాల్పింగ్‌ ట్రేడ్స్‌కు నేను ఎంఏసీడీ, సూపర్‌ట్రెండ్‌, ఏడీఎక్స్‌, ఈఐఎస్‌ ఇండికేటర్లను వాడతాను. వీటిలో కనీసం రెండు ఇండికేటర్లలో సెల్‌ సిగ్నల్‌ వచ్చేవరకు పొజిషన్‌ కొనసాగిస్తాను. 
= సాధారణంగా పీఓపీ(ప్రాపబులిటీ ఆఫ్‌ ప్రాఫిట్‌) ఆప్షన్‌ బయ్యర్స్‌కు 30 శాతం మాత్రమే ఉంటుంది. అందుకే ఎక్కువమంది మరింత పీఓపీ ఉన్న ఆప్షన్‌ సెల్లింగ్‌కు మొగ్గు చూపుతారు. బయ్యర్‌కు పీఓపీ రోజురోజుకీ తగ్గుతుంటే, సెల్లర్‌కు పెరుగుతుంది. అందువల్ల బయ్యర్‌ తప్పకుండా వీలయినంత త్వరగా ప్రాఫిట్‌బుక్‌ చేయాలి. అదేవిధంగా బయ్యర్‌ కొనుగోలు చేసే ఆప్షన్‌కు బహిర్గత విలువ కన్నా అంతర్గత విలువ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంటే ఇన్‌ ద మనీ కాంట్రాక్ట్‌కు దగ్గరలోవి ఎంచుకోవాలి. నేను ఎంచుకునే ఆప్షన్‌కు డెల్టా విలువ 0.3- 0.6 మధ్య ఉండేలా చూస్తాను. ఎక్కువమంది రిటైలర్లు అవుట్‌ ఆఫ్‌ మనీ ఆప్షన్స్‌ కొని, ఎక్స్‌పైరీ వరకు కొనసాగించి నష్టపోతుంటారు. ఆప్షన్‌ బయింగ్‌లో కీలక సూత్రం ఆప్షన్‌ సెల్లర్ల వలలో పడకుండా ఉండడమే! నిజానికి ఆప్షన్‌ సెల్లర్లకు వచ్చే లాభాలు పోవడానికి కార్పొరేట్‌ టాక్స్‌ ప్రకటన లాంటి ఒక్క రోజు చాలు. అందువల్ల నాదృష్టిలో సెల్లింగ్‌ చాలా డేంజర్‌. బయ్యర్‌కు కోలుకునే అవకాశం తర్వాతైనా ఉంటుంది. 
= ఆప్షన్‌ బయింగ్‌లో సరైన స్ట్రైక్‌ ప్రైస్‌ ఎంచుకోవడం, ఐవీ(ఇంప్లైడ్‌ వొలటిలిటీ) ఎక్కువ లేకుండా చూడడం, ఏటీఎం కన్నా ఐటీఎం ఆప్షన్స్‌ ఎంచుకోవడం, సరైన టైమ్‌ ఎంట్రీని నిర్ధారించుకోవడం.. చాలా కీలకాంశాలు. నేను సాధారణంగా 1.30- 2.00 గంటల మధ్య పొజిషన్‌ తీసుకుంటాను. నేను అనుకునే దిశలో ఆప్షన్‌ కదిలితే ఓకే, లేదంటే వెంటనే వదిలించుకుంటాను. ప్రతిరోజు నేను ఒక నిర్ధిష్ట లాభం, కచ్ఛితమైన నష్ట టార్గెట్‌ నిర్దారించుకుంటాను. వీటినిటచ్‌ చేస్తే ఆ రోజుకు ఇక ఎంటర్‌కాను. ట్రేడింగ్‌ 20 శాతం థియరీ, 80 శాతం ప్రాక్టికల్‌ కూడిన అంశం. ఎన్ని పుస్తకాలు చదివినా, సెమినార్లు విన్నా, సొంత అనుభవాన్ని మించిన ప్రయోజనం ఇవ్వవు. ఆప్షన్‌ ట్రేడింగ్‌లోకి దిగాలంటే సొంతంగా పోరాటం చేయడం వచ్చి ఉండాలి. సరైన ప్రణాళికతో దిగాలి. అనుభవం పెరిగిన కొద్దీ దాన్ని ఉపయోగించుకోవాలి. అప్పుడే ఆప్షన్‌ బయింగ్‌లో సక్సెస్‌ చూడొచ్చు. You may be interested

అక్కడక్కడే ముగిసిన మార్కెట్‌

Monday 9th December 2019

ట్రేడింగ్‌ ఆద్యంతం పరిమితి శ్రేణిలో కదలాడిన సూచీలు చివరికి స్వల్ప లాభంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 42 పాయింట్లు పెరిగి 40, 487 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 15 పాయింట్ల లాభంతో 11937 వద్ద ముగిసింది. తద్వారా సూచీల రెండురోజుల నష్టాలకు ముగింపు పడినట్లైంది. అటో, ఆర్థిక, మెటల్‌, ఫార్మా, ప్రైవేట్‌ రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఐటీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌, రియల్టీ రంగ షేర్లు అమ్మకాల

వోడాఫోన్‌ ఐడియా 12 శాతం పతనం

Monday 9th December 2019

ప్రభుత్వ సాయం లేకపోతే వ్యాపారాన్ని మూసివేస్తామని వోడాఫోన్‌ ఐడియా ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా వ్యాఖ్యాలతో ఈ కంపెనీ షేరు సోమవారం ట్రేడింగ్‌లో దాదాపు 12శాతం నష్టపోయింది. నేడు బీఎస్‌ఈలో ఈ షేరు రూ.6.58 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  కేంద్రానికి చెల్లించాల్సిన పాత బకాయిలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఊరట చర్యలేమీ తీసుకోకపోతే వోడాఫోన్‌ ఐడియా సం‍స్థ మూసివేయాల్సి ఉంటుందని బిర్లా శుక్రవారం ఒక సదస్సులో తెలిపారు.  ఈ సెప్టెంబర్‌

Most from this category