News


ఆపరేషన్‌ క్లీన్‌ మనీ కేసులు.. విచారణ తీరు ఇదీ

Monday 17th December 2018
personal-finance_main1545036401.png-23004

పెద్ద నోట్ల రద్దు సమయంలో బ్యాంకు ఖాతాల్లో నగదు డిపాజిట్‌ చేసిన వారి సమాచారాన్ని ఆదాయ పన్ను శాఖ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. 2016-17 ఆర్థిక సంవత్సరం నవంబర్‌ 8 నుంచి డిసెంబర్‌ 30 వరకు వివిధ బ్యాంకుల్లో నగదు డిపాజిట్‌ చేసినవారి సమాచారాన్ని ఆరా తీస్తోన్న ఆదాయపన్ను శాఖ.. రిటర్నులు వేసినవారందని పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా కోరుతోంది. 31-3-2017 నాటికి పేర్కొన్న ఆర్థిక సంవత్సరంలో జరిగిన లావాదేవీల వివరాలు, రిటర్నులు వేసినవారికి మొత్తం ఎన్ని బ్యాంకు ఖాతాలున్నాయి.. ఏ ఏ ఖాతాల్లో ఎంతంత డిపాజిట్‌ చేశారనే విషయాలను కోరుతోంది.

పాన్‌ నెంబర్‌ ఉండి.. డీమోనిటైజేషన్‌ జరిగిన సంవత్సరంలో ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయనివారు వెంటనే రిటర్నులు దాఖలు చేయామంటూ నోటీసులు పంపించింది. తద్వారా మీ బ్యాంకు అకౌంట్లను, ఆయా అకౌంట్లలో మీరు ఎంత మొత్తంలో డిపాజిట్‌ చేశారనే అంశాలపై ఆరా తీయటమే ఆపరేషన్‌ క్లీన్‌ మనీ (ఓసీఎం) కేసుల విచారణ ముఖ్య ఉద్దేశ్యం.
♦ ఒక అస్సెస్సీ రూ.2,00,000 లోపు డిపాజిట్‌ చేసినట్లయితే ఇటువంటి వారికి నోటీసులు రావడంలేదు. 
♦ ప్రస్తుతానికి ఒకే అకౌంట్‌లో రూ.2,00,000 మించి డిపాజిట్‌ చేసినవారికి మాత్రమే నోటీసులు వస్తున్నాయి. తరువాత కాలంలో అన్ని బ్యాంకులలో కలిపి ఈ మొత్తం దాటితే నోటీసులు వచ్చే అవకాశం ఉంది.
♦ మీరు మీ బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేసిన మొత్తం ఎంతో ఒకసారి పరిశీలనచేయండి.
♦ డిపాజిట్లలో రూ.500, రూ.1000 నోట్లు ఉంటే ఆ ఖాతాలను పరిగణలోనికి తీసుకుంటున్నారు. సాధరణ పరిస్థితుల్లో రూ.100.. అంతకంటే తక్కువగా ఉంటే పర్వాలేదు.

ఇక పేర్కొన్న మొత్తానికి మించి బ్యాంకులలో డిపాజిట్‌ చేసినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విచారణకు సిద్ధంగా ఉంటే సరిపోతుంది. ఇది ఏవిధంగా ఉంటుంది.. ఇందుకు సంబంధించిన పలు ఉదాహరణల ద్వారా చూద్దాం.
♦ నవంబర్‌కు ముందు మీ బ్యాంకు ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేశారు.
♦ నవంబర్‌ 7 వరకు వచ్చిన ఆదాయం, అమ్మకం, ఇతరాత్ర విక్రయాల నిమిత్తం తీసుకున్నటువంటి డబ్బు/ అడ్వాన్సుగా తీసుకున్న మొత్తం వివరాలు.
♦ మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే.. ఆ వ్యక్తి మీకు తిరిగి చెల్లించిన వివరాలు.
♦ మీ దగ్గర బంధువులు.. మీ ఇంట్లో ఏదేనీ సందర్భాల్లో నగదు ఇవ్వడం వంటి సమాచారం.
♦ విదేశాల్లో ఉన్న పిల్లలు వచ్చి నగదు ఇవ్వడం.
♦ వైద్య ఖర్చులు, ఇతర అత్యవసరాల కోసం దాచుకున్నటువంటి ముందు జాగ్రత్త నగదు వివరాలు.
♦ వ్యాపార పరంగా నిర్వహణ కోసం నగదు తప్పనిసరికావడం.
♦ వ్యవసాయ లావాదేవీల్లో భాగంగా మిగిలిన మొత్తం నిల్వ.
♦ స్త్రీధనం కింద ఆడవారి నగదు.
♦  కుటుంబ ఆచారంగా పూజ నిమిత్తం/ దేవుడి కోసం దాచుకున్న నగదు.
♦ ఇంటి నిర్వహణ నిమిత్తం చేతిలో ఉన్నటువంటి సేవింగ్స్‌. దేవుడి పెళ్లి వంటి అంశాలు.
♦ ఎన్నో సంవత్సరాలుగా దాచి ఉంచిన ధనం.

ఇటువంటి ఏ విధమైన వివరాలనైనా విచారణలో వెల్లడించవచ్చు. అయితే, మీరు చెప్పే ప్రతి దానికి రుజువు, సమాచారం ఉండాలి. అవసరమైతే వృత్తి నిపుణుల సహాయం తీసుకోండి. అధికారులకు ఓపికగా సమాధానం ఇవ్వండి. మీవంతుగా మీరు సహకారం అందించండి.


 You may be interested

మెటల్‌ షేర్ల మెరుపులు

Monday 17th December 2018

అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధ సంధి కుదరవచ్చని ఆశాహనంతో సోమవారం మెటల్‌ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ 2శాతం లాభపడింది. గతంలో చైనాకు దిగుమతయ్యే అమెరికా వాహనాలు, వాహన విడిభాగాల దిగుమతులపై అదనంగా విధించిన 25శాతం అదనపు పన్నును జనవరి 1, 2019 నాటికి నుంచి రద్దు చేస్తున్నట్లు చైనా ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించినట్లు వార్తలు వెలువడ్డాయి. మరోవైపు అమెరికా కూడా చైనా దేశపు ఉత్పత్తులపై

అటో షేర్ల ర్యాలీ

Monday 17th December 2018

టాటా మోటార్స్‌ అండతో సోమవారం అటోరంగ షేర్లు హుషారుగా ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 1శాతం ఎగిసింది. టాటామోటర్స్‌ బ్రిటన్‌ అనుబంధ సం‍స్థ జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌ వ్యయనియంత్రణలో భాగంగా వచ్చే ఏడాదిలో వేలాది ఉద్యోగాల కోత విధిస్తన్నట్లు వార్తలువడటంతో టాటామోటర్స్‌ షేరు 6శాతం ర్యాలీ చేసింది. అలాగే టాటామోటర్స్‌ డీవీఆర్‌ 5శాతం లాభపడింది. అశోక్‌ లేలాండ్‌ 3శాతం, ఎంఆర్‌ఎఫ్‌, టీవీఎస్‌ మోటర్స్‌,

Most from this category