News


5రోజుల కోసం కాదు.. 5ఏళ్ల కోసం చూడాలి

Thursday 23rd May 2019
personal-finance_main1558600710.png-25897

దేశీయ మార్కెట్లో గురువారం వచ్చిన ర్యాలీ క్రమంగా చప్పబడుతోంది. పలువురు ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌కు దిగడంతో మార్కెట్లు జీవితకాల గరిష్ఠాల నుంచి దిగివచ్చాయి. నిఫ్టీ, సెన్సెక్స్‌ ఆరంభలాభాలను పోగొట్టుకుని కేవలం స్వల్ప లాభంతో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌ చేయడం అనవసరమని, సుస్థిర ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో మార్కెట్లో మరింత ర్యాలీ ఉంటుందని, అందువల్ల ఐదేళ్ల కాలానికి వేచిచూడాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. స్థూల ఆర్థికాంశాలపై ఆందోళనలతో చాలామంది ఇన్వెస్టర్లు లాభాలస్వీకరణకు దిగుతున్నారు. కాకపోతే ఎకానమీపై ఆందోళనలు అనవసరమని, మార్కెట్లు వచ్చే 18- 24 నెలల్లో మంచి ప్రదర్శన ఇస్తాయని నిపుణులు భరోసా ఇస్తున్నారు. దీర్ఘకాలిక ధృక్పథంతో నిలిస్తే అద్భుత ఫలితాలు పొందవచ్చంటున్నారు. లాంగ్‌టర్మ్‌ ఆలోచన ఉన్న ఇన్వెస్టర్లు ప్రస్తుతం లాభాల స్వీకరణదిశగా ఆలోచించాల్సిన పనిలేదన్నారు. గత ఎన్నికల ఫలితాల వేళ 7వేల వద్ద ఉన్న నిఫ్టీ ఐదేళ్లలో 12వేలకు వచ్చిందని, అందువల్ల లాంగ్‌టర్మ్‌ ధృక్పథమే ఉత్తమమని చెబుతున్నారు.

నిఫ్టీ గత కొన్ని రోజులుగా మంచి ర్యాలీ జరుపుతోంది. ఈ రోజు ఫలితాల వేళ నిఫ్టీ 12వేల పాయింట్లను, సెన్సెక్స్‌ 40వేల పాయింట్లను తాకాయి. కానీ ఈ స్థాయిలను మధ్యాహ్న సమయానికి నిలుపుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో షార్ట్‌టర్మ్‌ ట్రేడింగ్‌పై దృష్టి వద్దని, దీర్ఘకాలానికి పెట్టుబడులు కొనసాగించాలని ఎన్‌విజన్‌ క్యాపిటల్‌ సలహా ఇచ్చింది. రాబోయే ఐదేళ్లలో సూచీలు ఎంత రాబడినిస్తాయో అంచనా వేయలేమని, అందువల్ల సాధ్యమైనంత వరకు పెట్టుబడులను కొనసాగించాలని సూచించింది. మధ్యాహ్న సమయానికి ఎన్‌డీఏ 343 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. చాలామంది ఈ విజయంతో ఇక మార్కెట్లలో పరుగు తీసే సత్తా అయిపోయిందని భావిస్తారని, కానీ నిజమైన పరుగు ఇకపైనే ఉంటుందని సుందరం మ్యూచువల్‌ అభిప్రాయపడింది. సూచీల్లో మరో రెండేళ్ల పాటు మంచి ర్యాలీ ఉంటుందని అంచనా వేసింది. 



You may be interested

దౌడు తీస్తున్న అదానీ గ్రూప్‌ షేర్లు

Thursday 23rd May 2019

కేంద్రంలో తిరిగి ఎన్‌డీఏ ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఫలితాలు వస్తున్న నేపథ్యంలో గురువారం అదానీ గ్రూప్‌ షేర్లు భారీగా ర్యాలీ చేస్తున్నాయి. ఈ గ్రూప్‌ కంపెనీ షేర్లైన అదానీ పోర్ట్స్‌, స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పవర్‌, అదానీ టాన్స్‌మిషన్స్‌, అదానీ గ్యాస్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ షేర్లు 7శాతం నుంచి 14శాతం వరకు లాభపడ్డాయి. వీటిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌,  అదానీ

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 12 శాతం అప్‌

Thursday 23rd May 2019

గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బ్యాంకు ఆఫ్‌ బరోడా నిరుత్సాహకరమైన ఫలితాలను ప్రకటించినప్పటికీ.., ఈ కంపెనీ షేర్లు గురువారం 12 శాతం లాభపడ్డాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ. 128.95ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నేడు ప్రభుత్వరంగ షేర్ల ర్యాలీలో భాగంగా ఈ కంపెనీ షేర్ల కొనుగోళ్లకు మద్దతు లభించింది. ఫలితంగా షేరు 12 శాతం లాభపడి రూ.143.60ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం

Most from this category