News


స్థిరమైన రాబడులు ఆశిస్తుంటే..

Monday 24th February 2020
personal-finance_main1582514773.png-32029

  • కోటక్‌ ‍స్టాండర్డ్‌ మల్టీక్యాప్‌ ఫండ్‌

రెండేళ్లుగా స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులతో కొనసాగుతుండడాన్ని చూస్తున్నాం. కొన్ని రోజులు ర్యాలీ చేయడం, కొన్ని రోజులు నష్టాల పాలు కావడం సాధారణంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులను సమర్థంగా నెగ్గుకొచ్చే మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను ఇవ్వగలుగుతాయి. ముఖ్యంగా గత రెండేళ్లుగా లార్జ్‌క్యాప్‌లో నాణ్యమైన స్టాక్స్‌ అద్భుత రాబడులను ఇచ్చాయి. స్మాల్‌, మిడ్‌క్యాప్‌ నేలచూపులు చూశాయి. లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ చాలా ఆకర్షణీయమైన, చౌక వ్యాల్యూషన్లకు దిగివచ్చాయి. దీంతో 2020లో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌లో నాణ్యమైన స్టాక్స్‌ (మంచి వ్యాపార మూలాలు, ఉత్తమ యాజమాన్యం) మంచి రాబడులను ఇచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ ఇంకా గాడిన పడలేదు కనుక ఇప్పటికీ లార్జ్‌క్యాప్‌ సురక్షితమైనవిగా కొందరు నిపుణులు చెబుతున్నారు. కనుక అన్ని రకాల పరిస్థితుల్లోనూ.. లార్జ్‌, మిడ్‌, స్మాల్‌క్యాప్‌ విభాగంలోని లాభదాయక అవకాశాల్లో పెట్టుబడులకు అవకాశం కల్పించేవి మల్టీక్యాప్‌ ఫండ్స్‌. ఈ విభాగంలో కోటక్‌ స్టాండర్డ్‌ మల్టీ‍క్యాప్‌ ఫండ్‌ కూడా ఒకటి. 2008-09 మార్కెట్‌ పతనం తర్వాత ఈ మ్యూచువల్‌ ఫండ్‌ పథకం ప్రారంభమైంది. 2011, 2013, 2015, 2016 సంవత్సరాల్లో వచ్చిన మార్కెట్‌ కరెక్షన్లలో ఈ పథకం నష్టాలను తక్కువకు పరిమితం చేసి చూపించింది. 
పెట్టుబడి విధానాలు...
మార్కెట్‌ కరెక్షన్లలో, ఒడిదుడుకుల సమయాల్లో నగదు నిల్వలు పెంచుకోవడం లేదా డెట్‌ విభాగంలో పెట్టుబడులను అధిగం చేయడం వంటి విధానాలతో నష్టాలను తగ్గించడంపై ఈ ఫండ్‌ మేనేజర్లు దృష్టి సారిస్తుంటారు. అదే సమయంలో అస్థిరతలు తక్కువగా ఉండే రంగాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. ఉదాహరణకు 2011 కరెక్షన్‌ సమయంలో ఈ పథకం నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 8-12 శాతం నగదు, డెట్‌ రూపంలోనే ఉన్నాయి. ఆ సమయంలో  ఫార్మా, నాన్‌ డ్యుబుల్స్‌కు ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో ప్రధాన సూచీలతో పోలిస్తే కేవలం 4 శాతం నష్టాలకే పరిమితం అయింది. లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం ఈ పథకం పనితీరులో భాగం. ప్రస్తుతానికి మెగా, లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో 74 శాతం పెట్టుబడులు ఉన్నాయి. 2013, 2015, 2016 కరెక్షన్లలో మిడ్‌, స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులను తగ్గించుకోవడం ద్వారా నష్టాలను పరిమితం చేసింది. ప్రస్తుతం మిడ్‌క్యాప్‌లో 25 శాతం, స్మాల్‌క్యాప్‌లో ఒక శాతం పెట్టుబడులు కలిగి ఉంది. 
రాబడులు...
ఈ తరహా విధానాల కారణంగా బుల్‌ ర్యాలీల్లో పనితీరు అద్భుతంగా లేకపోయినప్పటికీ మెరుగైన రాబడులను ఇస్తోంది. ఏడాది కాలంలో ఈ పథకం 19 శాతం రాబడులను ఇవ్వగా, ఇదే కాలంలో బీఎస్‌ఈ 500 సూచీ పెరుగుదల 14 శాతంగానే ఉంది. మూడేళ్ల కాలంలో ఈ పథకం రాబడులు వార్షికంగా 12 శాతం, ఐదేళ్ల కాలంలో వార్షికంగా 10 శాతం, ఏడేళ్ల కాలంలో 16.68 శాతం, పదేళ్ల కాలంలో 14.31 శాతం వార్షిక రాబడులను ఇచ్చింది. బెంచ్‌మార్క్‌ బీఎస్‌ఈ 500 సూచీతో పోల్చి చూస్తే అన్ని కాలాల్లోనూ ఈ పథకంలో రాబడులు 4 శాతం వరకు అధికంగా ఉండడం గమనార్హం.  You may be interested

కరోనా ఎఫెక్ట్‌: సెన్సెక్స్‌ 400 పాయింట్ల క్రాష్‌..!

Monday 24th February 2020

11950 దిగువును ప్రారంభమైన నిఫ్టీ వృద్ధి భయాలతో మెటల్‌ షేర్లలో మంటలు  24 పైసలు కరిగిపోయిన రూపాయి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లల్లో కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి భయాలు మరోసారి తెరపైకి సోమవారం సెన్సెక్స్‌ 400 పాయింట్లు నష్టంతో 40770 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మరో ప్రధాన ఇం‍డెక్స్‌ నిఫ్టీ సైతం 131 పాయింట్లను కోల్పోయి 11950 దిగువను 11,949 వద్ద మొదలైంది. వరుసగా మూడు సెలవురోజుల అనంతరం ప్రారంభమైన దేశీయ మార్కెట్‌కు అంతర్జాతీయ

భారీ నష్టాలతో ఓపెనింగ్‌ నేడు?!

Monday 24th February 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 141 పాయింట్లు పతనం నేడు నిఫ్టీకి 12051 వద్ద సపోర్ట్‌ భారీ నష్ఠాలలో యూఎస్‌ ఇండెక్సుల ఫ్యూచర్స్‌ నేడు(సోమవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం  8.30  ప్రాంతం‍లో 141 పాయింట్లు పతనమై 11,940 వద్ద ట్రేడవుతోంది. మహాశివరాత్రి పర్వదినం​సందర్భంగా శుక్రవారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు సెలవుకాగా.. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,081 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ

Most from this category