STOCKS

News


తర్వాత తరాలకు అద్భుత పోర్టుఫోలియో అందించండి ఇలా!

Thursday 14th November 2019
personal-finance_main1573721951.png-29588

మీ రాబోయే తరాలకు ఈక్విటీల్లో మంచి సంపదనందించేందుకు రెండు సులభమార్గాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీలయినంత తొందరగా పొదుపును ఆరంభించడం, సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌లో క్రమానుగత పెట్టుబడులు మరవకుండా పెట్టడం.. అనే రెండు సూత్రాలు కచ్చితంగా పాటిస్తే తర్వాత తరానికి మంచి సంపదను, అద్భుత పోర్టుఫోలియోను అందించినవారైతారు. కనీసం పది, పదిహేనేళ్లు సిప్‌ను కొనసాగించేలా ప్లాన్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు పెరిగేకొద్దీ వారి అవసరాలు పెరుగుతుంటాయి. అందువల్ల పెట్టుబడికి ముందే సదరు పెట్టుబడి లక్ష్యాన్ని తప్పక నిర్దేశించుకోవాలని చెబుతున్నారు. ఉదాహరణకు పిల్లలు ఎదిగాక మంచి చదువు అందించాలనో, మంచి ఇల్లు ఇవ్వాలనో.. ఇలా ఒక లక్ష్యంతో పెట్టుబడి పెడితే తప్పక పెట్టుబడి క్రమాన్ని ఫాలో అవుతారని వారి విశ్లేషణ. 
ఈక్విటీలంటే రిస్కని ఎక్కువమంది భావిస్తుంటారు. కానీ గతాన్ని పరిశీలిస్తే అన్నిరకాల పెట్టుబడుల్లో ఈక్విటీలే దాదాపు 12- 15 శాతం సగటు వార్షిక రాబడిని అందించాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. అందుకని స్వల్పకాలానికి ఈక్విటీ గతిని పట్టించుకోకుండా లాంగ్‌టర్మ్‌ ధృక్పథంతో పెట్టుబడులు పెడితే మంచి రాబడి వస్తుందని సూచిస్తున్నారు. సిప్‌కు బదులు మ్యూచువల్‌ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే దాదాపు 50 శాతం లార్జ్‌, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లో పెట్టాలని, అదే నేరుగా ఈక్విటీలను ఎంచుకుంటే ఫైనాన్షియల్‌ రంగంలో క్వాలిటీ స్టాకులను ఎంచుకోవాలని కొందరి నిపుణుల సూచన. దీర్ఘకాలానికి వెయిట్‌ చేయగలిగినప్పుడు నేరుగా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టవచ్చని, అయితే అందుకు ముందుగా సరైన నిపుణుల సలహా లేదా సొంత అధ్యయనం తప్పక ఉండాలని నిపుణులు గుర్తు చేస్తున్నారు. You may be interested

రఫేల్‌ కేసులో మోదీ ప్రభుత్వానికి సుప్రీం క్లీన్‌చిట్‌

Thursday 14th November 2019

రివ్యూ పిటీషన్ల కొట్టివేత రాఫెల్ కుంభకోణ ఆరోపణలపై ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలయిన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాఫెల్ పై కోర్టు పర్యవేక్షణలో విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈమేరకు సమీక్ష కోరుతూ వచ్చిన పిటిషన్లన్నింటిని కోర్టు తిరస్కరించింది. సుమారు రూ.59,000 కోట్ల విలువైన యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను అణచిపెట్టి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై 2018లో

నష్టాల మార్కెట్లో మెటల్‌ షేర్లకు కష్టాలు

Thursday 14th November 2019

3శాతం నష్టపోయిన నాల్కో మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి స్వల్పంగా నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. మెటల్‌ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మెటల్‌ ఉత్పత్తిదారు చైనా ఈ అక్టోబర్‌ ఆర్థిక గణాంకాలు ఆశించినస్థాయిలో నమోదుకాకపోవడం, అమెరికాతో మొదటి దశ వాణిజ్య చర్చలు సఫలంపై అనుమానాలు వ్యక్తం కావడంతో అంతర్జాతీయంగా మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఈ ప్రతికూల ప్రభావం దేశీయ మెటల్‌ షేర్ల ట్రేడింగ్‌పై పడింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో

Most from this category