STOCKS

News


మరోసారి సార్వభౌమ గోల్డ్‌ బాండ్‌ ఇష్యూ

Monday 21st October 2019
personal-finance_main1571680463.png-29034

పండుగల సందర్భంగా బంగారానికి డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పౌర్వభౌమ బంగారం బాండ్ల ఇష్యూను ఈ నెల ఆరంభంలో ఒకసారి తీసుకురాగా, తాజాగా మరో ఇష్యూను కూడా చేపట్టింది. ఈ నెల 7 నుంచి 11 వ తేదీ వరకు సౌర్వభౌమ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2019-20 - సిరీస్‌-5 ఇష్యూను తీసుకొచ్చింది. మళ్లీ పది రోజుల వ్యవధిలోనే మరో ఇష్యూను ప్రకటించి ఆశ్చర్యపరించింది. దీనికి ప్రధాన కారణం దీపావళి, ధంతేరస్‌ సందర్భంగా బంగారం కొనుగోళ్లకు ఉండే అధిక డిమాండే. ఏటా దసరా, దీపావళి పండుగల సందర్భంలో బంగారానికి సహజంగా డిమాండ్‌ అధికంగా ఉంటుంది. ఈ సందర్భాల్లో పెట్టుబడుల కోణంలోనూ బంగారాన్ని కొనే వారుంటారు. కనుక ఈ అవకాశాలను గమనించిన కేంద్ర ప్రభుత్వం మలివిడత సౌర్వ భౌమ బంగారం బాండ్ల ఇష్యూను చేపట్టింది. సౌర్వభౌమ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2019-20 - సిరీస్‌-6 ఇష్యూ ఈ నెల 21న ఆరంభం కాగా, ధంతేరస్‌ రోజు అంటే ఈ నెల 25న వరకు సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉంటుంది. 

 

సౌర్వభౌమ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2019-20 - సిరీస్‌-6 కింద ఒక గ్రాము బంగారం ఇష్యూ ధరను రూ.3,835గా, సెటిల్‌మెంట్‌ తేదీగా ఈ నెల 30గా ఖరారు చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసి, డిజిటల్‌ రూపంలో చెల్లింపులు చేసే వారికి ఒక గ్రాముపై రూ.50ను తగ్గింపుగా ఇవ్వనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖా ప్రకటించింది. అంటే ఇన్వెస్టర్‌కు ఒక గ్రాము బంగారం తగ్గింపు తర్వాత రూ.3,785 అవుతుంది. సార్వభౌమ బంగారం బాండ్ల పథకాన్ని మొట్టమొదటిగా 2015 నవంబర్‌ మాసంలో కేంద్ర ప్రభుత్వం ఆరంభించింది. భౌతిక బంగారంపై పెట్టుబడులను తగ్గించాలన‍్న ఉద్దేశ్యంతో దీన్ని తీసుకొచ్చింది. తద్వారా ఆ మేరకు బంగారం దిగుమతులు తగ్గితే, కరెంటు ఖాతా లోటుపై భారం తగ్గుతుంది.

 

ఒక గ్రాము బంగారం యూనిట్‌గా ఈ బాండ్లు ఉంటాయి. కనీసం ఒక గ్రాము విలువకు సరిపడా ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో 500 గ్రాముల బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు. అదే హిందూ అవిభాజ్య కుటుంబాలకు ఈ పరిమితి గరిష్టంగా 4 కిలోలు. ట్రస్ట్‌లకు 20 కిలోలు. ఈ పథకం కాల వ్యవధి 8 సంవత్సరాలు. ఐదో సంవత్సరం నుంచి కావాలనుకుంటే వైదొలగొచ్చు. నగదు రూపంలో అయితే గరిష్టంగా రూ.20వేల వరకే పెట్టుబడికి అనుమతి ఉంటుంది. అంతకుమించితే డిజిటల్‌ రూపంలోనే చెల్లింపులు చేయాలి. ఈ బాండ్లను కొనుగోలు చేసిన వారికి కాల వ్యవధి తీరే నాటికి ఉన్న బంగారం రేటు ఆధారంగా చెల్లింపులు చేస్తారు. పైగా బంగారం బాండ్ల విలువపై వార్షికంగా 2.5 శాతం వడ్డీ కూడా చెల్లించడం అదనపు ఆకర్షణ.You may be interested

నేడు బ్యాంక్‌ సమ్మె

Tuesday 22nd October 2019

విలీనాలు, ఇతర అంశాలకు నిరసన  సమ్మె ప్రభావం స్వల్పమేనంటున్న ఎస్‌బీఐ  న్యూఢిల్లీ/కోల్‌కత:  బ్యాంక్‌ల విలీనానికి నిరసనగా నేడు(మంగళవారం) కొన్ని బ్యాంక్‌ యూనియన్లు సమ్మె చేయనున్నాయి. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ సర్వీసులకు అంతరాయం ఏర్పడనున్నది. బ్యాంక్‌ల విలీనాలు, డిపాజిట్ల రేట్ల తగ్గింపు, ఉద్యోగ భద్రతకు సంబంధించిన కొన్ని అంశాలపై నిరసన తెలియజేస్తూ ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌(ఏఐబీఈఏ), బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(బీఈఎఫ్‌ఐ)లు క్‌ యూనియన్లు జాతీయ స్థాయిలో 24

సత్తా చూపిస్తున్న డయోగ్నోస్టిక్‌ స్టాక్స్‌

Monday 21st October 2019

హెల్త్‌కేర్‌ రంగం స్టాక్స్‌ (ఫార్మా) గడ్డు పరిస్థితులను చవిచూస్తుంటే, మరోవైపు ఇదే విభాగంలోని డయోగ్నోస్టిక్‌ (వ్యాధి నిర్ధారణ కేంద్రాలు) కంపెనీల స్టాక్స్‌ మంచి రాబడులను అందించాయి. దేశంలో వ్యాధి నిర్ధారణ పరీక్షల పరిశ్రమ పరిమాణం 9 బిలియన్‌ డాలర్లుగా ఉంటుందని అంచనా. గత ఐదేళ్లలో హెల్త్‌కేర్‌ విభాగంలో ఈ విభాగం ఒక ఆశాకిరణంగా కొనసాగుతోంది. లివర్‌ పనితీరు నుంచి, కొలెస్ట్రాల్‌ వరకు తమ ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకోవాలన్న అభిలాష

Most from this category