News


ఆదాయపన్ను తగ్గింపులు లేనట్లే!

Wednesday 30th October 2019
personal-finance_main1572423942.png-29236

ప్రభుత్వ వర్గాల స్పష్టీకరణ...!
వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గింపు ఉంటుందన్న ఊహాగానాలను ‍ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి. వచ్చే బడ్జెట్లో సైతం ఎలాంటి పన్ను తగ్గింపులుండవని ఈ వర్గాలు స్పష్టం చేసినట్లు సీఎన్‌బీసీటీవీ 18 తెలిపింది. ఇతర దేశాల్లో మన కన్నా ఎక్కువ ఐటీ ఉందని, దీనికితోడు ప్రస్తుత విత్త పరిస్థితి ఎలాంటి ఐటీ తగ్గింపునకు ఆస్కారమివ్వదని వివరించాయి. కార్పొరేట్‌ టాక్స్‌ను తగ్గిస్తూ సెప్టెంబర్‌లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానంతరం, వ్యక్తిగత ఆదాయపన్నును సైతం తగ్గిస్తుందన్న ఊహాగానాలు పెరిగాయి. ప్రత్యక్ష పన్నులపై ఏర్పాటైన ఒక కమిటీ ఐటీ రేట్ల తగ్గింపు సిఫార్సు చేయడంతో ఈ ఊహలకు మరింత బలం వచ్చింది. కానీ ఇలాంటి ఆలోచన ప్రభుత్వానికేదీ లేదని సదరు వర్గాలు తెలిపాయి. సామాజిక భద్రతా పథకాలు అమలు చేసే పలు దేశాల్లో దిగువ ఐటీ స్లాబుల్లో కూడా భారీ రేట్లు ఉన్నాయని ఈ వర్గాలు తెలిపాయి. అయితే మనవద్ద మాత్రం సామాజిక భద్రతను క్రమంగా పెంచుతూ అల్పాదాయ వర్గాలకు పన్నులు తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 
ప్రభుత్వం చెబుతున్న దేశాల్లో ఎక్కువమంది జనాభాకు సామాజికంగా సరైన ప్రభుత్వ విద్య, వైద్యం వంటి సదుపాయాలున్నాయని విమర్శకులు గుర్తు చేస్తున్నారు. ఉదాహరణకు యూఎస్‌, యూకేల్లో 90 శాతం ప్రైమరీ, సెకండరీ విద్యార్ధులు ప్రభుత్వ ఫండెడ్‌ పాఠశాలల్లోనే ఉన్నారు. ఇక వైద్యానికి వస్తే ఈ దేశాల్లో ప్రజలు వైయుక్తికంగా వైద్యంపై 10- 15 శాతం మాత్రమే ఖర్చు చేస్తుండగా, భారత్‌లో ఒక వ్యక్తి ఆరోగ్యవ్యయాలు 65 శాతం ఉన్నాయి. మన వద్ద ప్రభుత్వ విద్య, వైద్యం నాణ్యత పరంగా చాలా దీనంగా ఉండడంతో సగటు మనిషి ఎక్కువగా వీటిపైనే వెచ్చించాల్సివస్తోంది. అయితే అలాంటి దేశాల్లో సామాజిక భద్రత కోసం కొంత మొత్తాలు చెల్లించాల్సిఉంటుందని, దీనికితోడు కొంత మెరుగైన ఆర్థిక పరిస్థితి ఉన్నా, ఈ పథకాలు వర్తించవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు ఇప్పటికే ఆదాయపన్ను విషయంలో పలు మినహాయింపులు అమల్లో ఉన్నందున ప్రస్తుతం ఐటీ తగ్గించాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. ప్రస్తుత మినహాయింపులు, పన్ను ప్రయోజనాలు అన్నీ లెక్కిస్తే వార్షికాదాయం 6.5 లక్షల రూపాయలవరకు ఉన్నవారిపై దాదాపుగా ఎలాంటి పన్ను భారం ఉండడంలేదని గుర్తు చేస్తున్నారు. అందువల్ల ఐటీ పరంగా ఎలాంటి మినహాయింపు అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. You may be interested

అత్యంత విలువైన కంపెనీ ఆపిల్‌ కాదు..అరామ్‌కో!

Wednesday 30th October 2019

9నెలల్లో రూ. 4.8లక్షల కోట్ల ఆదాయం.... ఆపిల్‌ సహా దిగ్గజాలను మించిన సంపాదన... సంవత్సరాంతానికి లిస్టింగ్‌కు.. ప్రపంచంలోని కార్పొరేట్‌ కంపెనీలన్నింటిలోకి అత్యంత ఖరీదైన కంపెనీ ఏది? చాలామంది ఆపిల్‌ అనుకుంటారు, కొందరు గూగుల్‌ అని, కొందరేమో మైక్రోసాఫ్ట్‌ అని అoటారు. ఎందుకంటే ఇవన్నీ లిస్టయిన కంపెనీలు వీటి మార్కెట్‌ క్యాప్‌, ఆదాయవ్యయాల వివరాలు ఎప్పటికప్పుడు బహిర్గతం అవుతుంటాయి.  కానీ వీటన్నింటినీ తలదన్నే కంపెనీ ఒకటుంది...    ఒక ఆపిల్‌, ఒక గూగుల్‌, ఒక ఎక్సాన్‌ మొబైల్‌ను కలిపితే ఎంత

16శాతం పెరిగిన సెంట్రల్‌ బ్యాంక్‌

Wednesday 30th October 2019

నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలపడంతో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో 16శాతం లాభపడ్డాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.18.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. రూ.3,353 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల బృందం ఆమోదం తెలిపినట్లు బ్యాంక్‌ ఎక్చ్సేంజీలు తెలియజేసింది. ఫలితంగా మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ బ్యాంక్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇంట్రాడేలో ఒకదశలో 16శాతం లాభపడి రూ.20.80

Most from this category