News


పన్ను ఆదాకు చక్కని పథకం

Monday 6th January 2020
personal-finance_main1578282986.png-30695

  • మిరే అస్సెట్‌ ట్యాక్స్‌ సేవర్‌ ఫండ్‌ 

పెట్టుబడులపై అధిక రాబడులను పొందే అవకాశం.. అదే సమయంలో సెక్షన్‌ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను ఆదా.. ఈ ప్రయోజనాలు ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పథకాల నుంచి పొందొచ్చు.  ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో మంచి పనితీరు చూపిస్తున్న టాప్‌ పథకాల్లో మిరే అస్సెట్‌ ట్యాక్స్‌ సేవర్‌ కూడా ఒకటి. ఈఎల్‌ఎస్‌ఎల్‌ పథకాల్లో చేసే పెట్టుబడులపై మూడేళ్ల లాకిన్‌ ఉంటుంది. అంటే ఆ లోపు వాటిని వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. దీర్ఘకాల లక్ష్యాల కోసం, పిల్లల ఉన్నత చదువుల కోసం, రిటైర్మెంట్‌ కోసం ఈ పథకాల్లో పెట్టుబడులను పరిశీలించొచ్చు.  

రాబడులు...
ఈ పథకం 2015 డిసెంబర్‌లో ప్రారంభం అయింది. నాటి నుంచి నేటి వరకు మెరుగైన రాబడులనే ఇచ్చింది. గడిచిన ఏడాది కాలంలో రాబడుల 13.1 శాతంగా ఉన్నాయి. మూడేళ్లలో వార్షిక రాబడులు 17.7 శాతంగా ఉన్నాయి. ఈ పథకం రాబడులకు ప్రామాణికంగా పరిగణించే బీఎస్‌ఈ 200 టీఆర్‌ఐ (టోటల్‌ రిటర్న్‌ ఆన్‌ ఇండెక్స్‌) రాబడులు ఏడాదిలో కేవలం 9 శాతంగా, మూడేళ్లలో వార్షికంగా 14.1 శాతంగానే ఉండడం గమనార్హం. ప్రారంభించిన రోజు నుంచి చూస్తే ఇప్పటి వరకు సగటున వార్షికంగా 18.69 శాతంగా ఉన్నాయి. మూడేళ్ల క్రితం ఈ పథకంలో రూ.1 లక్ష ఇన్వెస్ట్‌ చేసి ఉంటే ఇప్పటికి రూ.1.65 లక్షలు సమకూరేది. 2016, 2017లో పన్ను ఆదా విభాగం సగటు రాబడులను మించి పనితీరు చూపించిన ఈ పథకం, 2018 మార్కెట్‌ కరెక్షన్‌ సమయంలో నష్టాలను పరిమితం చేసింది. ఈఎల్‌ఎస్‌ఎస్‌ విభాగంలో నష్టాలు సగటున 6 శాతంగా ఉండగా, మిరే అస్సెట్‌ ట్యాక్స్‌ సేవర్‌ పథకంలో నష్టాలకు 2.3 శాతానికే పరిమితమయ్యాయి.  

పెట్టుబడుల విధానం
2017 నుంచి ఈక్విటీల్లో పూర్తి మొత్తంలో ఇన్వెస్ట్‌ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం 99 శాతం పెట్టబడులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ ఉంది. నగదు నిల్వలు కేవలం ఒక శాతం లోపునే ఉన్నాయి. ఈ పథకం బ్యాంకింగ్‌ రంగానికి పెద్ద పీట వేసింది. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగంలోని స్టాక్స్‌లో 37 శాతం మేర పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత 12 శాతం మేర ఎనర్జీ రంగంలో, ఎఫ్‌ఎంసీజీలో 10 శాతం, హెల్త్‌కేర్‌లో 8 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. కన్‌స్ట్రక్షన్‌, టెక్నాలజీ రంగ స్టాక్స్‌లో 7 శాతం చొప్పున ఇన్వెస్ట్‌ చేసింది. మార్కెట్‌ విలువ పరంగా ఎటువంటి స్టాక్స్‌లో అయినా ఇన్వెస్ట్‌ చేసే వెసులుబాటు ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాలకు ఉంటుంది. ప్రస్తుతానికి ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో మొత్తం 54 స్టాక్స్‌ ఉన్నాయి. లార్జ్‌క్యాప్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం భారీ లార్జ్‌క్యాప్‌, లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో 70 శాతం వరకు పెట్టుబడులు కలిగి ఉంది. మిడ్‌క్యాప్‌ 25 శాతం, స్మాల్‌ క్యాప్‌నకు 5 శాతం వరకు పెట్టుబడులు కేటాయించింది. 
 You may be interested

రుపీ 72 దిగువకు

Monday 6th January 2020

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ఎఫెక్ట్‌ ప్రారంభంలోనే 21 పైసలు డౌన్‌ మధ్యప్రాచ్యంలో గత వారం తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదరనున్న అంచనాల కారణంగా వరుసగా రెండో రోజు దేశీ కరెన్సీకి షాక్‌ తగిలింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 21 పైసలు నీరసించింది. 72.01 వద్ద మొదలైంది. వెరసి సాంకేతికంగా కీలకమైన 72 మార్క్‌ దిగువకు చేరింది. ప్రస్తుతం 25 పైసలు(0.35 శాతం) బలహీనపడి 72.05 వద్ద

డిపాజిట్‌ క్యాన్సిలేషన్‌ వద్దు..!

Monday 6th January 2020

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసే వారు మన చుట్టూ చాలా మంది ఉంటారు. ఎందుకంటే పెట్టుబడి విషయంలో ఇది సౌకర్యవంతమైన సాధనం. బ్యాంకు శాఖకు వెళ్లి గంట వ్యవధిలో డిపాజిట్‌ చేయడం, అవసరమైనప్పుడు వెళ్లి గంటలో నగదుగా మార్చుకోగల సౌకర్యం ఇందులో ఉంది. ఇతరత్రా ఎటువంటి సమస్యలూ ఇందులో ఉండవు. భద్రత కూడా ఎక్కువే. రాబడి తక్కువే ఉన్నా ఎక్కువ మంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను ఇష్టపడడానికి కారణం ఈ అంశాలే. డిపాజిట్‌

Most from this category