News


పసిడిలో పెట్టుబడులు పెట్టవచ్చా?

Wednesday 14th August 2019
personal-finance_main1565778189.png-27766

ర్యాలీ కొనసాగవచ్చని నిపుణుల అంచనా
ఎంసీఎక్స్‌లో బంగారం పదిగ్రాముల ధర రూ. 37270ని తాకింది. దీంతో ఈ ఏడాది ఇంతవరకు పసిడి దాదాపు 18 శాతం ర్యాలీ జరిపినట్లయింది. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో కొనసాగుతున్న బుల్‌ ర్యాలీకి అనుగుణంగా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పైపైకి పెరుగుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర దాదాపు 1500 డాలర్లకు అటుఇటుగా కదలాడుతోంది. పసిడిలో ఇంతటి ర్యాలీకి ప్రధాన కారణం ట్రేడ్‌వార్‌ కాగా, ప్రపంచబ్యాంకులు చేపడుతున్న రేట్‌కట్‌ ధోరణి కూడా బంగారం ధర పెరుగుదలకు మరొక ప్రధాన కారణమవుతోంది. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిపోవడం, వృద్ది మందగమన సంకేతాలతో ఎక్కువమంది ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిసాధనాలవైపు చూస్తున్నారు. ముఖ్యంగా ట్రేడ్‌వార్‌ ముదిరి కరెన్సీవార్‌గా మారుతుందన్న భయాలతో ఇటీవల కాలంలో పలు దేశాల ఈక్విటీలు భారీ పతనాలు నమోదు చేశాయి. దీనివల్ల పెట్టుబడిదారులకు ప్రస్తుతం ఏకైక పెట్టుబడిలక్ష్యస్థానంగా బంగారం మారిందని కమోడిటీ నిపుణుల విశ్లేషణ. ముఖ్యంగా వారం రోజుల క్రితం చైనా కరెన్సీ న్యూనీకరణ చేయడం, ట్రంప్‌ కొత్త సుంకాల హెచ్చరికలు చేయడం వంటివి బంగారంపై పాజిటివ్‌ సెంటిమెంట్‌ను మరింత పెంచాయి. బంగారం ఈటీఎఫ్‌లకు డిమాండ్‌ పెరగడం దేశీయంగా పసిడికి కలిసివచ్చింది. అంతర్జాతీయంగా 2016 తర్వాత తొలిసారి యూఎస్‌ట్రెజరీ బాండ్‌ ఈల్డ్డ్స్‌ 2 శాతం దిగువకు చేరాయి. ఇతర అంతర్జాతీయ బాండ్‌ ఈల్డ్డ్స్‌ సైతం నేల చూపులు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు ఈక్విటీలు బాగాలేక, ఇటు డెట్‌ మార్కెట్‌ బాగాలేకపోవడంతో ఇన్వెస్టర్లకు ఏకైక ఉత్తమ సాధనంగా పసిడి నిలుస్తోంది. ముఖ్యంగా మార్కెట్లో కొత్తగా వచ్చేమదుపరులు ఈక్విటీలు, డెట్‌సాధనాలను కాదని బంగారంపై మొగ్గు చూపుతున్నారు. యూరప్‌ కేంద్రబ్యాంకు త్వరలో క్వాంటిటేటివ్‌ఈజింగ్‌(ఉద్దీపనలు) ప్రకటించనుంది. ఇదే జరిగితే మందగమన భయాలు మరింత పెరిగి ఈక్విటీల నుంచి పసిడిలోకి మరిన్ని కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.  


దేశీయంగా...
అంతర్జాతీయ కారణాలకు తోడు దేశీయంగా కొన్ని కారణాలు మన మార్కెట్లో పుత్తడి ధర ర్యాలీకి కారణమవుతున్నాయి. ఎఫ్‌ఐఐలు ఈక్విటీల నుంచి నిధుల ఉపసంహరణకు దిగడంతో రూపీ బలహీనపడడం పసిడికి కలిసివస్తోంది. దీనికితోడు మానిటరీ పాలసీ సడలీకరణ కారణంగా లిక్విడిటీ పెరగడం రూపాయిని కుంగదీస్తోంది. మరోవైపు కమోడిటీల్లో చమురులో ర్యాలీ లేకపోవడంతో ఎక్కువమంది బంగారం వైపు మరలుతున్నారు. అంతర్జాతీయంగా చమురు డిమాండ్‌ మరింత బలహీనపడవచ్చని ఇటీవల ఐఈఏ అంచనా వేసింది. దేశీయంగా పండుగ సీజన్‌ ఆరంభం కానుండడంతో పసిడికి డిమాండ్‌ పెరుగుతోంది. ఇవన్నీ కలిసి బంగారంధరలో బుల్‌ పరుగును తీసుకువస్తున్నాయని, ఇదే జోరు కొనసాగితే ఏడాది చివరకు పదిగ్రాముల బంగారం ధర రూ.40వేలను చేరవచ్చని కమోడిటీ నిపుణుల అంచనా. రూపీ బలహీనత కొనసాగి, చమురు డిమాండ్‌ తరిగిపోతున్న ప్రస్తుత వాతావరణంలో బంగారం ధర మరింత పెరిగే ఛాన్సులు ఉన్నాయని, అందువల్ల దీన్ని మంచి పెట్టుబడి సాధనంగా మలచుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. You may be interested

మంచి షేర్లు మల్టీబ్యాగర్లవుతాయి..

Wednesday 14th August 2019

ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, పడిపోయిన ప్రతి స్టాకు తిరిగి కోలుకోలేకపోవచ్చని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రె‍సిడెంట్‌, రిసెర్చ్‌ హెడ్‌ జగన్నాథం తునుగుంట్ల ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. ఆర్థిక ఉద్దీపనల కోసం వేచి ఉన్నాం.. మార్కెట్‌ 11,000 దిగువకు పడిపోయాయి. విదేశి సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ)లపై అధిక పన్నులు విధించడం, మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ, బలహీన రుతుపవనాలు,

11000 పైన ముగిసిన నిఫ్టీ

Wednesday 14th August 2019

353 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌  కలిసొచ్చిన జాతీయ, అంతర్జాతీయ సానుకూలాంశాలు కిత్రం ట్రేడింగ్‌ భారీ నష్టాలను చవిచూసిన మార్కెట్‌ బుధవారం కొంతవరకూ ఆ నష్టాల్ని పూడ్చుకోగలిగింది.  సెన్సెక్స్‌ 353 పాయింట్లు లాభంతో 37,311.53 వద్ద, నిఫ్టీ 103 పాయింట్లు పెరిగి 11,029.40 వద్ద స్థిరపడింది. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలకు తోడు షార్ట్‌ కవరింగ్‌, రూపాయి షార్ప్‌ రికవరీ తదితర అంశాలు సూచీలు లాభాలకు కారణమయ్యాయి. అంతర్జాతీయంగా అందిన సానుకూల సంకేతాలతో

Most from this category