News


7 నుంచి సార్వభౌమ గోల్డ్‌ బాండ్‌ ఇష్యూ

Saturday 5th October 2019
personal-finance_main1570215362.png-28724

దసరా, దీపావళి పండుగల సందర్భంలో బంగారానికి సహజంగా డిమాండ్‌ అధికంగా ఉంటుంది. ఈ సందర్భాల్లో పెట్టుబడుల కోణంలోనూ బంగారం కొనే వారుంటారు. కనుక ఈ అవకాశాలను గమనించిన కేంద్ర ప్రభుత్వం మలివిడత సౌర్వ భౌమ బంగారం బాండ్ల ఇష్యూను చేపట్టింది. ఈ నెల 7వ తేదీన ఇష్యూ ఆరంభమవుతోంది. ఈ నెల 11వ తేదీ వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. 

 

సౌర్వభౌమ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2019-20 - సిరీస్‌-5 కింద ఒక గ్రాము బంగారం ఇష్యూ ధరను రూ.3,788గా ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసి, డిజిటల్‌ రూపంలో చెల్లింపులు చేసే వారికి ఒక గ్రాముపై రూ.50ను తగ్గింపుగా ఇవ్వనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖా ప్రకటించింది. అంటే ఇన్వెస్టర్‌కు ఒక గ్రాము బంగారం తగ్గింపు తర్వాత రూ.3,738గా అమలవుతుంది. సార్వభౌమ బంగారం బాండ్ల పథకాన్ని మొట్టమొదటిగా 2015 నవంబర్‌ మాసంలో కేంద్ర ప్రభుత్వం ఆరంభించింది. భౌతిక బంగారంపై పెట్టుబడులను తగ్గించాలన‍్న ఉద్దేశ్యంతో దీన్ని తీసుకొచ్చింది. తద్వారా ఆ మేరకు బంగారం దిగుమతులు తగ్గితే, కరెంటు ఖాతా లోటుపై భారం తగ్గుతుంది. 

 

ఒక గ్రాము బంగారం యూనిట్‌గా ఈ బాండ్లు ఉంటాయి. కనీసం ఒక గ్రాము విలువకు సరిపడా ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో 500 గ్రాముల బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు. అదే హిందూ అవిభాజ్య కుటుంబాలకు ఈ పరిమితి గరిష్టంగా 4 కిలోలు. ట్రస్ట్‌లకు 20 కిలోలు. ఈ పథకం కాల వ్యవధి 8 సంవత్సరాలు. ఐదో సంవత్సరం నుంచి కావాలనుకుంటే వైదొలగొచ్చు. నగదు రూపంలో అయితే గరిష్టంగా రూ.20వేల వరకే పెట్టుబడికి అనుమతి ఉంటుంది. అంతకుమించితే డిజిటల్‌ రూపంలోనే చెల్లింపులు చేయాలి. ఈ బాండ్లను కొనుగోలు చేసిన వారికి కాల వ్యవధి తీరే నాటికి ఉన్న బంగారం రేటు ఆధారంగా చెల్లింపులు చేస్తారు. పైగా బంగారం బాండ్ల విలువపై వార్షికంగా 2.5 శాతం వడ్డీ కూడా చెల్లించడం అదనపు ఆకర్షణ.



You may be interested

యస్‌ బ్యాంకు ర్యాలీ కొనసాగుతుందా..?

Saturday 5th October 2019

యస్‌ బ్యాంకు షేరు శుక్రవారం కూడా స్వల్పంగా లాభపడింది. అంతకుముందు రోజు 30 శాతానికి పైగా పెరిగిన విషయం తెలిసిందే. బ్యాంకు ఫైనాన్షియల్స్‌ చాలా బలంగా ఉన్నాయని, ఆర్‌బీఐ నిర్దేశిత పరిమితుల కంటే లిక్విడిటీ (బ్యాంకు వద్ద నిధులు) ఎక్కువే ఉందంటూ యస్‌ బ్యాంకు ఎండీ, సీఈవో రవనీత్‌ గిల్‌ మీడియాకు ఇచ్చిన స్పష్టత స్టాక్‌ ర్యాలీకి తోడ్పడింది. మరి ఈ ర్యాలీ ఇక ముందు కూడా కొనసాగుతుందా..? అన్న

సెన్సెక్స్‌ నష్టం 433 పాయింట్లు

Friday 4th October 2019

ఆర్థిక మందగమన భయాలతో ఆర్‌బీఐ జీడీపీ వృద్ధి అంచనాల్ని భారీ సవరించడంతో శుక్రవారం మార్కెట్‌ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 433 పాయింట్లు నష్టపోయి 38000 దిగువున 37,673.31 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 139 పాయింట్లను కోల్పోయి 11200 దిగువున 11,174.75 వద్ద ముగిసింది. ఒక్క ఐటీ తప్ప అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు విపరీతంగా జరిగాయి. ముఖ్యంగా వడ్డీరేట్లకు ప్రభావితమయ్యే బ్యాంకింగ్‌, అటో, రియల్టీ షేర్లు తీవ్ర ఒడిదుకుడులకు

Most from this category